పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పిళ్లా యశ్వంత్ రెడ్డి (ఏడోతరం 10)

        పిళ్లా యశ్వంత్ రెడ్డి 19-04-1995న పిళ్లా విజయకుమార స్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా కడపలో జన్మించారు. యశ్వంత్ కు అతని మేనమామ రామకృష్ణారెడ్డి చోటూ అని ముద్దుపేరు పెట్టారు.          వారి తండ్రి  అనంతపురం జిల్లాలోని కదిరి జీవిత బీమా సంస్థలో డెవలప్ మెంట్ ఆఫీసరుగా 1991 నుండి పనిచేస్తున్నారు.దాంతో యశ్వంత్ కుటుంబం కదిరి వాణీ వీధిలో వుండేది.ఆ వీధి చివరలో వున్న ఖాద్రీ పాఠశాలలో యల్.కె.జి. (లోయర్ కిన్నర్ గార్డెన్)తో యశ్వంత్ తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. తరువాత తన అక్క జ్యోత్స్న చదువుతున్న హరీష్ స్కూలులో యు.కె.జి. (అప్పర్ కిన్నెర్ గార్డెన్), ఒకటవ  తరగతి పూర్తిచేశారు.        తన తండ్రి అనంతపురంలో సొంత ఇల్లు నిర్మించాక కుటుంబం అక్కడికి మారింది. అనంతపురంలో అప్పట్లో మంచి పేరున్న చిన్మయా నగర్ లో వున్న యల్.ఆర్.జి. పాఠశాలలో 2 నుండి 7వ తరగతి వరకు చదివారు.               "మన జీవితం మన చేతుల్లో వుంది.  మనం ఎదగాలి అంటే మనం అబ్రహామ్ లింకన్ లాగా చదవాలి. గాం...

ఏడోతరం.. (10)

        పిళ్లా యశ్వంత్ రెడ్డి      పేరు        : పిళ్లా యశ్వంత్ రెడ్డి పుట్టిన తేది  : 19-04-1995    చదువు   : బి.టెక్. (మెకానికల్)      తల్లి        : పిళ్లా లక్ష్మిదేవి     తండ్రి       : పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి

పిళ్లా శరత్ జ్యోత్స్న, దొడ్డావుల సుధీర్ రెడ్డి(ఏడో తరం 9)

         పిళ్లా విజయ కుమారస్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి దంపతుల ప్రథమ సంతానంగా పిళ్లా శరత్ జ్యోత్స్న కడపలో 12.10.1990 తేదీన జన్మించింది. తండ్రి కడపలోని యల్.ఐ.సి. డివిజనల్ ఆఫీసులో అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన పదోన్నతి పై 1991 ఏప్రిల్ లో అనంతపురం జిల్లాలోని కదిరి యల్.ఐ.సి. బ్రాంచి ఆఫీసులో చేరడంతో కుటుంబమంతా కదిరికి మారింది.   కదిరిలో  జ్యోత్స్న మెహర్ బాబా పాఠశాలలో కొంతకాలం చదివారు. తరువాత హరీష్ స్కూలులో యల్.కె.జి. నుండి 6వ తరగతి వరకు చదివారు. 1995లో తమ్ముడు యశ్వంత్ రెడ్డి తోడయ్యాడు. జ్యోత్స్న, యశ్వంత్ లు ఇద్దరూ కలిసి సంగీతాన్ని అభ్యసించారు. కొన్ని పాటలు కూడా నేర్చుకున్నారు.          2001లో అనంతపురంలో స్వంత ఇల్లు నిర్మించాక అక్కడికి కుటుంబం మారింది. దాంతో శరత్ జ్యోత్స్న, తమ్ముడు యశ్వంత్ లిద్దరూ శారదానగర్‌కు దగ్గరలో వున్న యల్.ఆర్.జి (లక్ష్మిరమణ గోవింద) పాఠశాలలో చేరినారు. జ్యోత్స్న 7వ తరగతిలో, యశ్వంత్ 2వ తరగతిలో చేరినారు.          జ్యోత్స్న పదవ తరగతి చదువుతున్నప్పుడు ఉదయాన్నే ఐదుకే లేచి ట్యూషన్ కు...

ఏడో తరం.. (9)

పిళ్లా శరత్ జ్యోత్స్న, దొడ్డావుల సుధీర్ రెడ్డి   పేరు       : పిళ్లా శరత్ జ్యోత్స్న పుట్టిన తేది:12-10-1990 చదువు      : బి.టెక్., యం.బి.ఏ. తల్లి            : పిళ్లా లక్ష్మిదేవి తండ్రి          : పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి భర్త             : దొడ్డావుల సుధీర్ రెడ్డి తల్లి             : ఉషారాణి  తండ్రి          : దొడ్డావుల సురేంద్రరెడ్డి,                       ఉబ్బరవాండ్ల పల్లి,                      తలుపుల మండలం                       కదిరి.                   దొడ్డావుల సురేంద్రరెడ్డి, ఉషారాణి దంపతుల సంతానం: 1) డి. పావని(29)  2) డి. సుధీర్ రెడ్డి (27)

పిళ్లా దీప్తి,పాపిరెడ్డిగారి రామనాథరెడ్డి(ఏడోతరం 8)

        పిళ్లా రవీంద్రనాథరెడ్డి, అనసూయ దంపతుల ఏకైక కుమార్తె పిళ్లాదీప్తి. 1987లో పులివెందులలో అమ్మగారి స్వంతవూరు పులివెందుల దగ్గరవున్న చిన్నకుడాలలో జన్మించింది.       ప్రాథమిక విద్యాభ్యాసమంతా కడపలో తన అన్న చదివిన 'సరస్వతి శిశుమందిర్'లో గడిచింది. ఎనిమిది నుండి పదోతరగతి వరకు మహర్షి విద్యాని కేతన్ లో చదివారు. ఇంటర్ మీడియట్ సాయిరాం కాలేజీలో చదివారు. తరువాత రాజంపేటలో వున్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ లో బి.టెక్ చేరినారు. ఆ సందర్భంలో తన తల్లిదండ్రులు కూడా రాజంపేటలో మన్నూరులో నివాసముండేవారు. ఆమె తండ్రి  ఆర్.టి.సి. కండక్టరుగా రాజంపేటలో పనిచేసేవారు.           2008లో బి. టెక్ పూర్తయ్యాక 2009లో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం వెన్నపూసపల్లె గ్రామ వాస్తవ్యులైన పాపిరెడ్డిగారి పెద్దారెడ్డి, రామతులశమ్మ దంపతుల చివరి పుత్రుడు రామనాథరెడ్డిని వివాహం చేసుకున్నారు. రామనాథరెడ్డిహైదరాబాదులో రెడ్డిల్యాబ్స్ లో పనిచేస్తున్నారు.         దీప్తి, రామనాథంలకు 01-04-2010లో రాకేష్ రెడ్డి జన్మించాడు.రాకేష్ కడపలో తన అమ్మమ్మ దగ్గర పెరిగార...

ఏడోతరం ... (8)

పిళ్లా దీప్తి, పాపిరెడ్డిగారి రామనాథరెడ్డి పేరు: పిళ్లా దీప్తి  పుట్టిన తేది    : 1987  చదువు: బి.టెక్.  తల్లి     : పిళ్లా అనసూయ తండ్రి : పిళ్లా రవీంద్రనాథరెడ్డి   భర్త     : పాపిరెడ్డిగారి రామనాథరెడ్డి   తల్లి   :రామతులశమ్మ, తండ్రి : పాపిరెడ్డిగారి పెద్దారెడ్డి, వెన్నపూసపల్లె, యల్లనూరు మండలం, అనంతపురం జిల్లా. సంతానం : ఇద్దరు కొడుకులు 1. రాకేష్ రెడ్డి 2. గణేష్ రెడ్డి పాపిరెడ్డిగారి పెద్దారెడ్డి, రామతులశమ్మ సంతానం 1. రామచంద్రారెడ్డి (45)  2. సావిత్రమ్మ (40) 3. చంద్రావతి (35)  4. రామనాథరెడ్డి (35)

పిళ్లా దినేష్ రెడ్డి, పందిళ్లపల్లి సుస్మిత(ఏడోతరం7)

      ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రగతినగర్‌లో నివాసముంటున్న పిళ్లా దినేష్ రెడ్డి పులివెందులలోని లింగాల మండలం చిన్న కుడాలలో పిళ్లా రవీంద్రనాథరెడ్డి, అనసూయ దంపతులకు 14-08-1984లో జన్మించారు.           తన ప్రాథమిక విద్యాభ్యాసమంతా కడపలో జరిగింది. తండ్రి విజయవాడలోని  విజయ స్పిన్నింగుమిల్లులో పనిచేస్తున్నప్పుడు తాను జన్మించాడు. తండ్రి కడపకు వచ్చేశాక ఎర్రముక్క పల్లెలో నివాసముంటున్న తరుణంలో ప్రాథమిక విద్యాభ్యాసాన్నిసరస్వతీ శిశుమందిర్ లోనూ, మహర్షి విద్యానికేతన్ లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. పదవ తరగతి పూర్తవగానే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించారు. సికిందరాబాదులో వున్న గవర్నమెంట్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో ఎలక్ట్రానిక్స్ డిప్లమో కోర్సును 2002లో పూర్తిచేశారు.           2003లో జూబ్లీహిల్స్ లోవున్న వాల్యూలాట్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా చేరినారు. ఉద్యోగం చేస్తూ జె యన్ టి యులో బి.టెక్ కోర్సును దూరవిద్య ద్వారా పూర్తిచేశారు. ఆ తర్వాత 2014 నుండి కొనీల్యాబ్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ వున్నారు...

ఏడో తరం... (7)

పిళ్లా దినేష్ రెడ్డి, పందిళ్లపల్లి సుస్మిత పేరు : పిళ్లా దినేష్ రెడ్డి పుట్టిన తేది :14-08-1984 చదువు : డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, బి.టెక్. తల్లి : పిళ్లా అనసూయ తండ్రి : పిళ్లా రవీంద్రనాథరెడ్డి భార్య : పందిళ్లపల్లి సుస్మిత తల్లి     : పార్వతమ్మ తండ్రి : పందిళ్లపల్లి జయరామిరెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందుల సంతానం : ఒక కూతురు 1. సాయి హిమణి (3) 2. పందిళ్లపల్లి జయరామిరెడ్డి, తల్లి పార్వతమ్మ సంతానం 1. సుస్మిత 2. సునీల్ కుమార్ రెడ్డి (35)

అంకిరెడ్డిపల్లె జయభరత్ రెడ్డి, శేరెడ్డి మణి

         పిళ్లా ఇందిరాదేవి, అంకిరెడ్డిపల్లె పెద్ద కొండారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు జయభరత్ రెడ్డి కడపలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 24-11- 1979 లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కడపలోనే పూర్తిచేశారు. కోటిరెడ్డి సర్కిల్ లోని న్యూఏం జల్స్ పాఠ శాలలో పదవతరగతి చదివారు. నాగార్జున జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాక బిట్స్ పిలానీలో బిటెక్ కోర్సులో చేరారు.2002లో బిటెక్ కోర్సు పూర్తిచేశారు. అప్పట్లో అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై బిన్ లాడెన్ విమానంతో దాడి చేయించి పడగొట్టాడు. దాంతో ఇండియాలో కాంపస్ ప్లేస్ మెంట్స్ మందగించి పోయాయి. అప్పుడు భరత్ ఉద్యోగాన్వేషణకోసం బెంగళూరులో ఉంటూ రెండేండ్లు వేచి వుండాల్సి వచ్చింది.          2004లో పూనేలో వున్న హెచ్.యస్. బి.సి.లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు. హైదరాబాదులో వున్న వెరిజోనాలోకి 2007లో మారినారు. హైదరాబాద్ లో నిజాం పేట్ లో ఒక అపార్టుమెంటు తీసుకున్నారు.        శేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, కోటేశ్వరమ్మల కుమార్తె శ్రీమణిని 27-11- 2009లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన...

ఏడో తరం... (6)

అంకిరెడ్డి జయభరత్ రెడ్డి, శేరెడ్డి మణి పేరు           :  అంకిరెడ్డి జయభరత్ రెడ్డి పుట్టిన తేది :  24-11-1979 చదువు    :  బి.టెక్ (బిట్స్ పిలానిలో మెకానికల్)     తల్లి      : పిళ్లా ఇందిరాదేవి    తండ్రి     : అంకిరెడ్డి పెద్ద కొండారెడ్డి     భార్య    : శేరెడ్డి మణి సంతానం:ఒక కొడుకు, ఒక కూతురు 1.జాగ్వి (బేబి) 2. ధనుష్               శేరెడ్డి మణి     తల్లి      : కోటేశ్వరమ్మ     తండ్రి    : శేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి                  

అంకిరెడ్డి లీలావతి,గాలివీటి సాయికుమార్ రెడ్డి

        అంకిరెడ్డి పెద్ద కొండారెడ్డి, పిళ్లా ఇందిరాదేవి దంపతుల ప్రధమ సంతానంగా 15.12.1975లో కడపలో లీలావతి జన్మించింది.           తనతల్లి పిళ్లా ఇందిరాదేవి రాజంపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తుండే వారు. తండ్రి అక్కడే ఫ్యాన్సీ స్టోరు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవారు. అందువల్ల లీలావతి తన థమిక విద్యాభ్యాసాన్ని రాజంపేటలో పూర్తిచేసింది.               తనతల్లి కడపకు ఉద్యోగరీత్యా బదిలీ కావడంవల్ల లీలావతి తనహైస్కూలు విద్యను చెంబుమియాపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తిచేసింది. ఇంటర్ విద్యను, డిగ్రీలో బి.ఎస్.సి (యం, పి.ఎస్)ని కడపలో ఉన్న ఎస్.వి. డిగ్రీకళాశాలలో 1996లో పూర్తిచేసింది. 1998లో బి.ఎడ్ చదివేందుకు బద్వేలు వెళ్ళి అక్కడున్న వీరారెడ్డి కళాశాలలో పూర్తిచేసింది. 2001లో డి.ఎస్సీ, పరీక్షలో ఉత్తీర్ణురాలై రాయచోటీలోని ఉప్పర పల్లెలో ఉపాధ్యాయురాలిగా నియమితు రాలైంది.            1999 ఫిబ్రవరిలో గాలివీటి చంద్రశేఖర్ రెడ్డి లీలావతమ్మల కుమారుడు సాయికుమార్‌రెడ్డితో ఆమె వివాహం జ...

ఏడో తరం... (5)

(పిళ్లా)అంకిరెడ్డి లీలావతి, గాలివీటి సాయికుమార్‌రెడ్డి పేరు:అంకిరెడ్డి లీలావతి, పుట్టిన తేది: 15-12-1975 చదువు: బి.ఎస్సీ., బి.ఎడ్., తల్లి: పిళ్లా  ఇందిరాదేవి తండ్రి :అంకిరెడ్డి పెద్దకొండారెడ్డి భర్త: గాలివీటి సాయికుమార్ రెడ్డి సంతానం : ఒక కుమారుడు, ఒక కూతురు 1. నయనేష్ రెడ్డి (చింటూ) 2 అర్పిత 2ఏళ్ళ వయస్సులో డెంగ్యూతో అకాల      మరణం సంభవించింది. గాలివీటి సాయికుమార్ రెడ్డి తల్లి: లీలావతమ్మ తండ్రి: గాలివీటి చంద్రశేఖర రెడ్డి

పిళ్లా పద్మశోభ, సిరియపురెడ్డి చెన్నకిశోర్ రెడ్డి(ఏడోతరం 4)

         పిళ్లా దశరథరామిరెడ్డి, పిళ్లా నిర్మలాదేవి దంపతులకు 02-10-1976 లో జన్మించిన చివరి సంతానం పద్మశోభ.          శోభ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో పూర్తి చేసినారు.తరువాత గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ లో పదవ తరగతి వరకు చదివాక, ఇంటర్ చదువును ప్రభుత్వబాలికల కళాశాలలో పూర్తిచేసింది. 1997లో ఎన్.వి. డిగ్రీ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ పట్టాను పొందినారు.           కడప వాస్తవ్యులైన సిరియపురెడ్డి చెన్నారెడ్డి, వజ్రమ్మ దంపతులకు జన్మించిన సిరయపురెడ్డి చెన్నకిశోర్ రెడ్డితో 10-08-2001న కడపలో శోభకు వివాహం జరిగింది.          కిశోర్ 24-10-1975వ తేదీన కమలాపురంలో సిరియపురెడ్డి చెన్నారెడ్డి, వజ్రమ్మ దంపతులకు జన్మించారు. 10వ తరగతిని పులివెందులలో,ఇంటర్ ను నంద్యాలలో పూర్తిచేశాక, ఐ.టి.ఐ. డ్రాఫ్ట్ మన్ కోర్సును 1994లో పూర్తిచేసినారు. తరువాత ఆర్మీలో చేరినారు. వీరు చాలా కాలం పంజాబ్ లోని పాటియాలాలో వుండేవారు.         వీరికి 27-04-2002న నితిన్ కుమార్ రెడ్డి జన్మించాడు. ఇతన...

ఏడో తరం.. (4)

పిళ్లా పద్మశోభ, సిరియపురెడ్డి చెన్నకిషోర్ రెడ్డి పేరు:పిళ్లా పద్మశోభ పుట్టిన తేది : 2-10-1976 చదువు: బి.ఏ., తల్లి   :   పిళ్లా నిర్మలాదేవి, తండ్రి : పిళ్లా దశరథరామిరెడ్డి  సిరియపురెడ్డి చెన్నకిషోర్‌రెడ్డి   తల్లి : వజ్రమ్మ తండ్రి : సిరియపురెడ్డి చెన్నారెడ్డి సంతానం : ఒక కుమారుడు 1. నితిన్‌రెడ్డి (చిన్నూ) 17 సం||లు సిరియపురెడ్డి చెన్నారెడ్డి, వజ్రమ్మల సంతానం 1) ఎన్. చెన్నకిశోర్ రెడ్డి (42) 2) ఎన్. సతీష్ రెడ్డి (38)

పిళ్లా విశ్వనాథరెడ్డి, గజ్జల భాగ్యలక్ష్మి(ఏడోతరం3)

                  పిళ్లా దశరథరామిరెడ్డి, తుంగా నిర్మలాదేవి దంపతులకు పిళ్లా విశ్వనాథరెడ్డి మూడవ సంతానంగా 29.03. 1974న కడపలో జన్మించారు. అందరూ విశ్వం అని పిలిచేవారు.           ప్రాథమిక విద్యను, హైస్కూలు విద్యను కడప ఎర్రముక్క పల్లెలో ఉన్న న్యూఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో పూర్తిచేశారు. తరువాత ఇంటర్ మీడియట్ (హెచ్.ఇ.సి) చదువును ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్తిచేశారు.            తన తండ్రి తెలుగుపండితులుగా పనిచేస్తూ 1994లో మరణించడంతో కుమారుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. పెద్ద కుమారుడు లక్ష్మీ మోహన్ రెడ్డి (చిట్టీ) వద్దనడంతో విశ్వం ఆ ఉద్యోగాన్ని తీసుకున్నారు. ప్రారంభంలో రికార్డు అసిస్టెంటుగా చేరినా తరువాత పదోన్నతి పొంది ప్రస్తుతం సీనియర్ అసిస్టెంటుగా కడప మునిసి పాలిటీలో పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ప్రవేశించాక మనోన్మాన్య విశ్వవిద్యాలయంలో దూరవిద్య కింద బి.కామ్ డిగ్రీని పూర్తిచేశారు.            కడపలో చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లెలో వుండే గజ్జల వెంకటసుబ్బారె...

ఏడోతరం .. (3)

                           పిళ్లా విశ్వనాథరెడ్డి, గజ్జల భాగ్యలక్ష్మి పేరు : పిళ్లా విశ్వనాథరెడ్డి, పుట్టిన తేది  : 29-03-1974 చదువు        : బి.కాం., తల్లి : పిళ్లా నిర్మలాదేవి తండ్రి : పిళ్లా దశరథరామిరెడ్డి భార్య : గజ్జల భాగ్యలక్ష్మి తల్లి: లక్ష్మిదేవి, తండ్రి : గజ్జల వెంకటసుబ్బారెడ్డి, బొగ్గలేటిపల్లి, కడప సంతానం: ఇద్దరు కుమారులు 1. పిళ్ల వెంకట శ్రీచరణ్ రెడ్డి,11 సం||లు 2. పిళ్లా చక్రధర్ రెడ్డి,9 సం॥లు గజ్జల వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మిదేవి, బుగ్గలేటిపల్లి, సి.కె. దిన్నె సంతానం : (1) వెంకటసుబ్బారెడ్డి (40) (2) భాగ్యలక్ష్మి (38) (3) శ్రీనివాసులు రెడ్డి (36)

పిళ్లా పద్మరాధిక, చందమూరి నరసింహారెడ్డి(ఏడోతరం2)

         పిళ్లా పద్మరాధిక 1972సం||లో సెప్టెంబరు 9న పిళ్లా దశరథరామిరెడ్డి, పిళ్లా నిర్మలాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా కడపలో జన్మించింది. పద్మరాధికను చిన్నక్క అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఇది ఆమె అబ్బ (నాన్నకు నాన్న) పిళ్లా లక్ష్మిరెడ్డి, తనతల్లిగారి పేరు మీద పెట్టిన ముద్దు పేరు. కుటుంబ సభ్యులంతా చిన్నక్క అని ముద్దుగా పిలిచేవారు.         చిన్నక్క ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల లో, హైస్కూల్ విద్యను కడపలో వున్న గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ లో పూర్తి చేసినారు. 1987లో పదవ తరగతి పూర్తయ్యాక ఇంటర్ మీడియట్ ను స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో చదివారు. 1989లో ఇంటర్ పూర్తవగానే పాలిటెక్నిక్ కళాశాలలో డి.ఫార్మసీ కోర్సులో చేరారు. ఇదిమూడు సంవత్సర కోర్సు. 1992లో ఫార్మసీ డిప్లొమా పొందినారు. తరువాత నాగరాజు పేటలోని డిగ్రీ కళాశాలలో బిఏ చదువుతుండగా ఆమెకు పెద్దలు వివాహం చేశారు.            అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన చందమూరి నరసిరెడ్డి, లక్ష్మినారాయణమ్మ దంపతులకు ఐదవ సంతానమైన చందమూరి నరసింహారెడ్డితో ...

ఏడో తరం... (2)

పిళ్లా పద్మరాధిక, చందమూరి నరసింహారెడ్డి పేరు : పిళ్లా పద్మరాధిక పుట్టినతేది : 09-09-1972 చదువు: డి-ఫార్మశీ, బి.ఏ., తల్లి : పిళ్లా నిర్మలాదేవి తండ్రి : పిళ్లా దశరథరామిరెడ్డి భర్త : చందమూరి నరసింహారెడ్డి తల్లి : లక్ష్మీనారాయణమ్మ, తండ్రి : చందమూరి నర్సిరెడ్డి, సిద్దరాంపురం, బుక్కపట్నం మండలం సంతానం : ఒక కుమారుడు 1. సి. చందమూరి నచికేతరెడ్డి(నచ్చి) -18 సం||లు చందమూరి నర్సిరెడ్డి,లక్ష్మీనారాయణమ్మలసంతానం 1. సి. నరసింహారెడ్డి(50)  2. సి.జయరామిరెడ్డి (47) 3. సి. లక్ష్మినరసమ్మ (60)  4. సి. సుబ్బమ్మ (57) 5. సి. లక్ష్మీదేవి (54)  6. సి. సరస్వతి (50)

Perfect Maintenance of Life

Perfect Maintenance of Life         Distribute your One day 24 Hrs                   into 3 Parts  24 hrs        ____8 Hrs of Work                      ____7 Hrs of Sleep                      ____9 Hrs of 3HFS 9 hrs        _____3 Hrs of 3S's                  _____3 Hrs of 3H's                  _____3 Hrs of 3F's 3 hours of H 1 Hr - Health 1 Hr - Hygiene 1 Hr - Hobby 3 hours of F 1 Hr - Family 1 Hr   Friends 1 Hr - Faith 3 hours of S 1 Hr - Service 1 Hr - Soul 1 Hr - Smile

పిళ్లా లక్ష్మీ మోహన్ రెడ్డి (చిట్టీ), గోసుల సుబ్బమ్మ(ఏడోతరం1)

         చిట్టీ అని ముద్దుగా పిలువబడే లక్ష్మీ మోహన్ రెడ్డికి పుట్టినప్పుడు పెట్టిన పేరు లక్ష్మీ మనోహరరెడ్డి. ఆ పేరు పాఠశాలలో చేరినప్పుడు పొరపాటున లక్ష్మీ మోహన్ రెడ్డిగా మారిపోయింది. చిట్టి 01.06.1970 తేదీన కడపలో జన్మించారు. పిళ్లా దశరథరామిరెడ్డి, నిర్మలాదేవి దంపతుల ప్రధమ సంతానం చిట్టి.       కడపలో ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల లో, హైస్కూల్ విద్య మున్సిపల్ హైస్కూలులో పూర్తి చేశారు.తరువాత మరియాపురంలో ఇంటర్ చదివారు. తదనంతరం ప్రభుత్వ ఐ.టి.ఐలో ఎలక్ట్రికల్ కోర్సును పూర్తిచేశారు.          కడపలో బంధువులైన అంకుల్ సుబ్బిరెడ్డి దగ్గర కాంట్రాక్టరు వర్క్ లు పనిచేస్తున్నారు. ఊటుకూరులో వున్న గోసుల వెంకటసుబ్బారెడ్డి, శామలాదేవి దంపతుల ఏకైక కుమార్తె సుబ్బమ్మను 12.09.1999లో వివాహం చేసుకున్నారు.  సుబ్బమ్మ పదవతరగతి వరకు చదివింది.           వీరిప్పుడు కడపలో వున్న యర్రముక్క పల్లెలో ఉన్న స్వంత ఇంటిలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. 18.10.2003న ప్రథమ పుత్రుడు హర్షవర్ధన్ జన్మించాడు. ఇతను ప్రస్తుతం కడ...

ఏడో తరం..(1)

                         పిళ్లా లక్ష్మీమోహన్ రెడ్డి (చిట్టి),గోసుల సుబ్బమ్మ తో ఏడవతరం ప్రారంభమైంది.ఏడో తరం మొదటి వాడితను. పిళ్లా లక్ష్మీమోహన్ రెడ్డి తల్లి :పిళ్లా నిర్మలాదేవి తండ్రి :పిళ్లా దశరథరామిరెడ్డి చదువు : ఇంటర్, ఐ.టి.ఐ. (ఎలక్ట్రికల్) భార్య: గోసుల సుబ్బమ్మ తల్లి : శ్యామలా దేవి, ఊటుకూరు, తండ్రి: జి.వి. సుబ్బారెడ్డి, సి.కె. దిన్నె(మం)) సంతానం : ముగ్గురు కుమారులు 1. పిళ్లా హర్షవర్ధన్ రెడ్డి 13 సం||లు 2. పిళ్లా విష్ణువర్ధన రెడ్డి 9 సం||లు 3. పిళ్లా సాయివర్ష రెడ్డి 9 సం||లు జి.వి. సుబ్బారెడ్డి, శ్యామలాదేవి సంతానం 1. సుబ్బమ్మ (45) 2. రాజగోపాల్ రెడ్డి(43) 3. సుబ్బారెడ్డి (41)

అత్యధిక ధనవంతుల లక్షణాలు.

1. వారు లక్ష్యాన్ని గమనిస్తూ ఉంటారు 2. ఏ రోజు ఏం చెయ్యాలో వారికి ఖచ్చితంగా     తెలుసు 3. టి.వి. చూడరు.. 4. పుస్తకాలు చదువుతారు. కానీ వినోదం కోసం     కాదు 5.ప్రయాణంలో పుస్తకాల ఆడియో ఫైల్స్ వింటారు. 6. ఆఫీస్..సమయాలను పట్టించుకోకుండా పని     చేస్తారు. 7. అదృష్టాన్ని నమ్మరు. జాక్ పాట్ లను అసలు     నమ్మరు... 8. ఆరోగ్యం పాడయ్యే తిండి తినరు. 9. పరిస్థితి ఎలా ఉన్నా చిరునవ్వు చెదరకుండా      ఉంటారు. 10. విషయం తెలియకుండా కొత్త వారిని కలవరు. 11.ఎంత పని ఉన్నా కుటుంబానికి సమయం        ఇస్తారు.

పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి(ఆరోతరం5)

చిత్రం
         పిళ్లా లక్ష్మిరెడ్డి, పిళ్లా రామలక్ష్మి దంపతులకు చివరి సంతానంగా పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి 08-07-1964లో రాజంపేటలోని సరస్వతీ పురంలో జన్మించారు. పుట్టినపుడు పెట్టిన పేరు కుమారస్వామి. కాని అతనిని ముద్దుగా బాబు అని పిలిచేవారు. అతని పెద్దక్క విజయలక్ష్మి మరణంతో ఆమెకు గుర్తుగా కుమారస్వామికి విజయకుమారస్వామిగా నామకరణం చేశారు.            దాదాపు తాను 7 ఏళ్ళ ప్రాయంలో రెండవ తరగతి చదువుతున్నప్పుడు 1971లో అతని తల్లి రామలక్ష్మి ధనుర్వాతంతో ఆకస్మికంగా దివంగతు రాలైంది. తల్లి మరణాంతరం అతనిని అందరూ గారాబంగా చూసేవారు. కొండమ్మవ్వ బాబును ఆప్యాయంగా చూసేది.           బాబు ప్రాథమిక విద్యాభ్యాసమంతా వారి ఇంటి వెనుక నున్న ప్రాథమిక పాఠశాలలో పూర్తయింది. ఆరవ తరగతి చదివేందుకు ఇంటికి ఎదురుగా సమీపం లో వున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. కానీ తన పెద్దన్న పిళ్లా దశరథ రామిరెడ్డి తనను తనతోపాటు తీసుకెళ్లి కడపలో తన దగ్గర వుంచుకుని కడపలోని ఎర్రముక్కపల్లె మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేర్పించాడు. ఆపాఠశాలలో ఆయన తెలుగు పండితులుగా ...

ప్రొటీన్లు కావాల్సిందే.

         మహిళలతో పోలిస్తే మగవాళ్ల శరీర నిర్మాణమే వేరుగా ఉంటుంది. వీళ్లలో కొవ్వు కంటే కండరాల మాస్ ఎక్కువ. దీనివల్లే ఆడవాళ్ల కంటే ఎక్కువ శారీరక శ్రమని చేసే శక్తి ఉంటుంది వీళ్లలో.అందుకని ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.          సహజంగా ఉండాల్సిన శరీరబరువులో ఒక్క కేజీకి, 0.85 గ్రాముల చొప్పున ప్రొటీన్ ఉండాలి. చేసే పని, వయసు బట్టి మగవాళ్లు తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలంటే...          యుక్త వయస్కులు ఈ వయసులో శరీర ఎదుగుదల, ఎముకల పొడవు, వెడల్పు, మందం పెరుగుదల వంటివి జరుగుతుంటాయి. ఈ వయసులోనే కండరాలు పెరిగి శరీరానికి ఒక ఆకృతి ఏర్పడుతుంది. కండరాలు తయారవ్వడం వల్ల ప్రొటీస్, ఐరన్లు ఎక్కువ మొత్తంలో అవసరం పడతాయి. ఎముకలు శాశ్వతంగా పెరిగేందుకు క్యాల్షియం కూడా కావాల్సి ఉంటుంది. రోజూవారీ పనులతో పాటు శరీరంలోపల జరిగే ఈచర్యలన్నింటి కోసం అధిక మొత్తంలో శక్తి అవసరమవుతుంది. సాధారణంగా ఈ వయసు అబ్బాయిలు కాలేజీకి వెళ్తుంటారు. ఈ వయసు పిల్లలు చాలావరకు అల్పాహారం తినరు. బయటి ఆహారం ఎక్కువగా తింటుంటారు. పాస్టపడ్, సాఫ్ట్ డ్రింక్ మీద ఎక...

మనల్ని మనం ప్రేమించాలి.

          అప్పుడప్పుడు మనం  కొత్త నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లకు స్వస్తి పలికి కొత్త వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. వాటిలో బరువు తగ్గించుకోవడం అన్న నిర్ణయంతప్పనిసరిగా వుంటుంది. బరువు తగ్గడం మంచిదే అయితే అందుకు మనం పాటించే పద్ధతి దానికి హాని కలిగించకూడదు.          ఎందుకంటే ఏళ్ల తరబడి చేసిన పరిశోధనలు ద్వారా తేలిందేమంటే మీడియాలో చూపించినట్టు అందమైన శరీరాకృతి పొందడం అందరికీ సాధ్యం కాదు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కీల్ బృందం చేసిన పరిశోధనలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి. మన ఆకారాలకు, ప్రకటనల్లో చూపించే ఆకారాలకు ఎక్కడా పొంతన వుండదు. అది అనేక అనర్థాలకు దారితీస్తోంది.‌తమ శరీరం ఎలా వున్నా అంగీకరించేలా పరిశోధకులు బృందం చేసిన ప్రయోగంతో గొప్ప ఫలితాలు వచ్చాయి.                నాజూకైన శరీరం కోసం ఆహారపు అలవాట్లలో తీవ్రమైన మార్పులు చేసుకోకుండా వారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో అద్దం ముందు నిలబడి అవయవాల పని తీరును మెచ్చుకొనే వ్యాయామం ఒకటి. ఈ ప్రశంసలు శ...

వివాహబంధం

చిత్రం
       వివాహబంధం           వివాహం పట్ల విముఖత రోజు రోజుకూ పెరుగుతోంది. 'బ్యాచిలర్ గా వుంటేనే సోబెటరు. సుఖంగా వున్న ప్రాణాన్ని కష్టపెట్టు కోవడమెందుకు' అనుకునేవారు బోలెడంత మంది. అయితే వివాహంపై వ్యక్తమవుతున్న ఈ అభిప్రాయాలను పటాపంచలు చేస్తోంది ఓ అధ్యయనం. బ్రిటన్లో చేసిన రెండు సర్వేల ఆధారంగా... పెళ్లి కాని వారి కంటే పెళ్లైన వారు ఎంతో సంతృప్తికర జీవితం గడుపుతున్నారు.             ఒంటరితనం అనే సమస్య లేకపోవడంతో  సంతోషంగా జీవిస్తారని తేలింది. లండన్లోని 30 వేల మంది నుండి బ్రిటీష్ కుటుంబ విభాగ సర్వే సేకరించిన వివరాలను మరో సర్వేలో వివాహితులు, అవివాహితులు, వివాహమే చేసుకోనివారి సంతృప్తి కర జీవితాల రేటింగులను పరిశీలించారు. ఈ రెండు  నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వివాహానంతర జీవితంలో ముఖ్యంగా మధ్య వయస్కులు అందరికంటే ఎక్కువ సంతృప్తికర జీవితాన్ని గడుపుతున్నారని తేలింది. వివాహం జీవితాన్ని సంతృప్తికరం చేయడమే కాదు, మధ్య వయస్సులో వచ్చే అనుకోని పరిణామాలను సులభంగా అధిగమించేందుకు వుపయోగపడుతుంది. ఈ విషయంలో అవివాహితు...