అంకిరెడ్డిపల్లె జయభరత్ రెడ్డి, శేరెడ్డి మణి





         పిళ్లా ఇందిరాదేవి, అంకిరెడ్డిపల్లె పెద్ద కొండారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు జయభరత్ రెడ్డి కడపలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 24-11- 1979 లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కడపలోనే పూర్తిచేశారు. కోటిరెడ్డి సర్కిల్ లోని న్యూఏం జల్స్ పాఠ శాలలో పదవతరగతి చదివారు. నాగార్జున జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాక బిట్స్ పిలానీలో బిటెక్ కోర్సులో చేరారు.2002లో బిటెక్ కోర్సు పూర్తిచేశారు. అప్పట్లో అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై బిన్ లాడెన్ విమానంతో దాడి చేయించి పడగొట్టాడు. దాంతో ఇండియాలో కాంపస్ ప్లేస్ మెంట్స్ మందగించి పోయాయి. అప్పుడు భరత్ ఉద్యోగాన్వేషణకోసం బెంగళూరులో ఉంటూ రెండేండ్లు వేచి వుండాల్సి వచ్చింది.
         2004లో పూనేలో వున్న హెచ్.యస్. బి.సి.లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశారు. హైదరాబాదులో వున్న వెరిజోనాలోకి 2007లో మారినారు.
హైదరాబాద్ లో నిజాం పేట్ లో ఒక అపార్టుమెంటు తీసుకున్నారు.
       శేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, కోటేశ్వరమ్మల కుమార్తె
శ్రీమణిని 27-11- 2009లో వివాహం చేసుకున్నారు.
వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు.
కుమార్తెకు జాగ్వి అని నామకరణం చేశారు. ఆచిన్నారిని బేణి అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇటీవల(2017) జన్మించిన కుమారునికి ధనుష్ అనే పేరు పెట్టారు.
           ఆఫీసుకు వెళ్ళడానికి దగ్గరగా ఉండేందుకు వీరు ప్రస్తుతం హైదరాబాదులో జూబ్లీహిల్స్ లోని కావూరి హిల్స్ లో నివాసముంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth