పోస్ట్‌లు

జులై, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

వరకట్నం

     ''ఆడపిల్ల గుండెల మీద కుంపటి'' వంటి డైలాగులు సినిమాల్లోనే కాదు నిత్యజీవితంలోనూ తారాస పడుతుంటాయి. ఆడపిల్ల పుడితే ఆ తల్లే తిరస్కరణకు గురవుతున్న సందర్భాలు కోకోల్లలు. భ్రూణహత్యలకూ ఈ దురాచారమే మూలకారణం.       కట్నం ఇచ్చుకోలేని స్త్రీలను మానసిక క్షోభకు గురిచేయడమే కాదు, చంపడానికి సైతం వెనుకాడటం లేదంటే ఇంతకంటే క్రూరమైన చర్య మరొకటి లేదేమో. కట్నం కోసం వ్యక్తిత్వాలను అమ్ముకొని మానవత్వాలను మరిచి స్త్రీనొక ఆటబొమ్మగా చూడడం శోచనీయం. ఇలాంటి కేసులు విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  వరకట్న వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాల్సింది పోయి మన సమాజం దానికి జీవం పోస్తోంది. వరకట్న నిషేధం కోసం చట్టాలు చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం తక్కువైందని, మళ్ళీ ఇవ్వాలంటూ వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.     వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం 1961 జులైలో చట్టం తెచ్చింది. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ 1984లో డౌరీ ప్రొహిబిషన్‌ ఎమెండ్‌మెంట్‌ యాక్ట్‌ తెచ్చారు. అంతేకాకుండ...