పోస్ట్‌లు

జనవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

చిత్రం
చాణక్య లేదా కౌటిల్య ఒక ఆచార్యుడు. ఆయన గొప్ప విజ్ఞాని. ఒక వ్యక్తి తన జీవితంలో చాణక్య సూత్రాలను అనుసరిస్తే, అతను అన్ని రకాల సమస్యలను అప్రయత్నంగా పరిష్కరించగలడు. ఈ కాలంలో కూడా జీవన విధానంలో తోడుగా ఉండగల చాలా సలహాలను ఆయన ఇచ్చారు. మహాజ్ఞాని చాణక్య .. మతం, రాజకీయాలు మరియు సమాజం, మానవ జీవితం  ఇలా  ప్రతి అంశాన్ని  చర్చించారు. మనిషి తన జీవితంలో కొన్ని రంగాలలో ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో  అతను తన కలంతో ఎత్తి చూపాడు. జీవితానందాన్ని నెరవేర్చుకోవడానికి  డబ్బు అవసరమని ఆయన తన నీతిశాస్త్రంలో చెప్పారు. కానీ చాలా డబ్బు సంపాదించినప్పటికీ ఏ విధంగానూ ఆదా చేయలేని వారు చాలా మంది ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈ వ్యక్తులు డబ్బు ముఖాన్ని చూడలేరు.అంటే భాగ్యలక్ష్మి వారి ఇంట్లో ఉండదు.   చాణక్య సూత్రం ప్రకారం ఎలాంటి వ్యక్తులు డబ్బు ముఖాన్ని ఎప్పటికీ చూడలేరో    తెలుసుకుందాం. 1) చాణక్య సూత్రం ప్రకారం, రాత్రి నిద్రకు అనువైన సమయం. అతని ప్రకారం, సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలలో నిద్రించే వ్యక్తికి అర్థం(డబ్బు) ఉండదు. పగటిపూట నిద్రపోయే వ్యక్తికి జీవితాంతం డబ్బు ఉండదు...

కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు...

చిత్రం
కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు...  ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే! 1.నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు...ఎందుకంటే మీ అమ్మకు  20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా! తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది. 2.నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో... నీ తల్లికి నిన్ను  చూసుకోవడమే పని..నీవు మమ్మల్ని,నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి. 3.నీతో సమానంగా తనని చూసుకో...నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో!నీ మంచిచెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది. 4. పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి...కాస్త మోహమటంగా ఉండచ్చు...నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్ల...