ప్రామిసరి నోటు గురించి
ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు తీసుకున్నవ్యక్తి ప్రామిసరి నోటును రాయాల్సి ఉంటుంది. ఒకవేళ అతను రాయకుంటే ఎవరైతే రాస్తారో వారి సంతకం ఉండాలి. అంతే కాని డబ్బు ఇచ్చే వ్యక్తి అస్సలు రాయరాదు. ఇక లక్షకు ఒక ప్రామిసరి నోటు చొప్పున రాయించుకుంటే బెటర్.మూడు నాలుగు లక్షలకు కలిపి ఒకే ప్రామిసరి నోటును రాయించుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రామిసరి నోట్ల విషయంలో కొందరు తరచు చేసే తప్పులు ఏంటంటే ఆ నోట్లపై స్టాంపులు అతికించక పోవడం,జామీను సంతకం తీసుకోక పోవడం, సాక్షి సంతకం చేయించుకోక పోవడం,ఇక ప్రామిసరి నోటు సొంత దస్తూరితో రాయడం.ఈ నాలుగు తప్పులు చేయడం చేయకుండా ఉండాలి. ఎంత మొత్తంకు ప్రామిసరి నోటు రాయించుకున్నా కూడా తప్పనిసరిగా స్టాంపులు అతికించాలి. స్టాంపుపై డబ్బు తీసుకున్న వ్యక్తి సంతకం చేయించుకోవాలి. ఇక ప్రామిసరి నోటులో జామీను అనే ఆప్షన్ ఉంటుంది.కాని అంతా కూడా దాన్ని పట్టించు కోరు.కాని అదే చాలా కీలకం.తప్పనిసరిగా అప్పు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తిన...