పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మాయమైపోతున్న బంధాలు..బంధుత్వాలు..!

మాయమైపోతున్న బంధాలు..బంధుత్వాలు..! మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయంగా భావిస్తారు. " ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం " అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం. కానీ నేడు అది పెరిగిన కొద్దీ మన బృందావనం బీటలు వాలి చివరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది. ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మా వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి మనిషిలో పెరుగుతున్న స్వార్ధం ఎందుకంటే మన చిన్నతనంలో "కలసి ఉంటే కలదు సుఖం" అని చెప్పేవారు, కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం మేలు". అంటున్నారు. ఇది భౌతిక , కుటుంబ ఎడబాటైనట్లైతే అంత ఇబ్బందేమీలేదు. కాని చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ...