ఇది ఆడపిల్లల కోసం.. ! """""""""""""""""""""""""""""""""""""" పెళ్లికి ముందు సెక్స్ విషయంలో... అమ్మాయిలూ, పెళ్ళికి ముందు సెక్స్ విషయంలో ఏవో కొన్ని విలువలు మీకు మీరే ఏర్పరచుకోండి.. ఎలాంటివి అని నన్ను అడిగితే నేను చెప్పలేను. కానీ.. మీ చదువు, మీ అనుభవం, మీ గతం, మీ కుటుంబం, మీ పరిసరాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలో, మరొకటో.. ఇంకొకటో.. ఏవో కొన్ని 'విలువల'ను సెక్స్‌కు జత చేసుకోండి. దాని వల్ల శారీరక సంబంధాలలోకి దిగేటప్పుడు, ఆ విలువ(లు) మీకొక అడ్డంకిగా ఉంటుంది (ఉంటాయి). ఆ అడ్డంకిని దాటే ముందు కనీసం ఒకసారైనా ఆలోచిస్తారని., ఆడ పిల్లలకు ఇది చాలా అవసరం అని చెప్పాను, అంతే.. విలువలా, మట్టిగడ్డాలా.. తూ నా బొడ్డు ! అంటారా.. సరే మీ ఇష్టం.. Absolutely fine.. Even then, I am with you.. అటువంటప్పుడు ఈ మూడు విషయాలను మీరు గుర్తుంచుకోండి.. 1. మీ ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మీ కోరిక, మీ అవసరం, మీ సర...