పెళ్లికి ముందు సెక్స్

ఇది ఆడపిల్లల కోసం.. !
""""""""""""""""""""""""""""""""""""""
పెళ్లికి ముందు సెక్స్ విషయంలో...

అమ్మాయిలూ,
పెళ్ళికి ముందు సెక్స్ విషయంలో ఏవో కొన్ని విలువలు మీకు మీరే ఏర్పరచుకోండి..

ఎలాంటివి అని నన్ను అడిగితే నేను చెప్పలేను. కానీ..

మీ చదువు, మీ అనుభవం, మీ గతం, మీ కుటుంబం, మీ పరిసరాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలో, మరొకటో.. ఇంకొకటో.. ఏవో కొన్ని 'విలువల'ను సెక్స్‌కు జత చేసుకోండి. దాని వల్ల శారీరక సంబంధాలలోకి దిగేటప్పుడు, ఆ విలువ(లు) మీకొక అడ్డంకిగా ఉంటుంది (ఉంటాయి). ఆ అడ్డంకిని దాటే ముందు కనీసం ఒకసారైనా ఆలోచిస్తారని.,
ఆడ పిల్లలకు ఇది చాలా అవసరం అని చెప్పాను, అంతే..

విలువలా, మట్టిగడ్డాలా..
తూ నా బొడ్డు ! అంటారా..
సరే మీ ఇష్టం.. Absolutely fine.. Even then, I am with you..

అటువంటప్పుడు ఈ మూడు విషయాలను మీరు గుర్తుంచుకోండి..

1. మీ ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.
మీ కోరిక,
మీ అవసరం,
మీ సరదా,
మీ సుఖం..
వీటన్నిటి కన్నా మీ ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం పాడు చేసుకోకుండా, సేఫ్ సెక్స్ పద్ధతులు పాటించండి...

2. శారీరక సంబంధాలలో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోకండి. తలలో దురదగా ఉంటే తల స్నానం చేసి ఆ దురదని వదిలించుకుంటాం కదా., అలా శరీరానికి పట్టిన దురదను వదిలించేసుకుని, తలంటుకోండి. ఇక అంతటితో దాన్ని వదిలేయండి (మరిచిపోకండి)..

3. మీతో సెక్స్‌లో పాలుపంచుకునే వాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి రాకుండా చూసుకోండి. (అంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి). ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా మిమ్మల్ని వేధించేవాడు కాడు అని అనుకుంటేనే, వాడితో సంబంధం పెట్టుకోండి. ఇతర వెధవలతో మీకెందుకు ? కాస్త జ్ఞానం ఉన్నవాడిని (మంచివాడిని) చూసుకోండి. లోకమేం వట్టిపోలేదు.. 

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బ్లాక్ మెయిల్ చేశాడా.. పోరా వెధవ, దొబ్బేయ్ అనండి.. 

ఐతే అలా అనడం సులువేం కాదు. అలా అనాలంటే మీకు చాలా బలం కావాలి. ఆ బలం రెండు విధాలుగా వస్తుంది..

1. మీరు ఆర్థికంగా స్థిరపడిన వారై ఉండాలి. ఈ లోకం మిమ్మల్ని వెలివేసినా.. మీ అంతట మీరు బ్రతకగలగాలి. ఆర్థిక దన్నూ ఉండాలి. అందుకు చదువుకోవాలి. ఉద్యోగమూ సంపాయించాలి..

లేదా..

2. కుటుంబమో, స్నేహితులో మీకు అండగా నిలబడాలి. ఎవరో ఒక్కరు మీతో నిలబడినా చాలు.. 

మగవాడికి ఈ సమాజం ఎప్పుడూ మద్దతిస్తుంది. రోడ్డు మీద వెళ్లేవాడు, ముక్కూ, మొహం తెలియనివాడు కూడా మగవాడినే సపోర్ట్ చేస్తాడు. అమ్మాయిలకు ఆ పరిస్థితి లేదు. నా అనుకున్నవాళ్లు కూడా అమ్మాయిలను వీధిన పడేస్తారు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తారు కూడా. మీ చుట్టూ ఉండే వ్యవస్థ మీద వీలైనంత తక్కువ ఆశలు పెట్టుకోండి. కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం పెంచుకోండి.. 

కాస్త తెలివిగా వ్యవహరించండి..
వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని ఏడుస్తూ జీవితాలను నాశనం చేసుకోకండి. వాడెలా దులిపేసుకుంటున్నాడో, మీరూ అలాగే దులిపేసుకోండి. దానికి కావలసిన దన్ను (support) సంపాయించండి. ఇపుడు ఈ కాలం అమ్మాయిలకు కావలసింది, ఈ తెలివితేటలే. ఇంకా ఎన్నాళ్లని ఈ ఏడుపులు, కేసులు.. ? అవీ ఎటూ తేలక వేదన, బాధ భరిస్తూ.. చస్తూ బ్రతకడం ! అవసరమా ఇదంతా ?

తెలివి తెచ్చుకోండి..
సెక్స్ ముఖ్యమే, కానీ దానికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం మాత్రమే ఇవ్వండి. అది మాత్రమే జీవితం కాదు కదా.. 

సెక్స్‌ని ఒక శారీరక అవసరంగా మాత్రమే చూడడం నేర్చుకోండి.. దానికి ఎంతో విలువ ఇవ్వాలో, అంతే విలువ ఇవ్వండి. దాన్ని గౌరవించండి. దాని ద్వారా ఆనందం కలగాలి కానీ, బాధ కాదు. వ్యక్తిగత హక్కును ఉపయోగించు కోవడం ఎంత సంతోషమో, ఎంత గర్వమో గుర్తించండి. తెలివిగా ఉండండి..

ప్రేమ, దోమ తరువాత మాట.. వ్యక్తిగత గౌరవం, విలువ ముందు. మీ గౌరవం, మీ విలువ.. వీటికి మాత్రమే ప్రాధాన్యమివ్వండి..

ఇక మారుతున్న మగ పిల్లలకు కూడా, ఒక్కమాట..

1. మీ ఆరోగ్యం, మీ భాగస్వామి ఆరోగ్యం కంటే ప్రధానమైంది ఏదీ లేదు. సేఫ్ సెక్స్ పద్ధతులు పాటించండి.

2. మీతో సెక్స్‌లో పాలుపంచుకున్న భాగస్వామిని గౌరవించండం నేర్చుకోండి.

ఒక వ్యక్తి స్వేచ్ఛగా, సంతోషంగా తన ఇష్టానుసారం మీతో ఒక సంబంధంలోకి దిగుతున్నారన్న దానికి విలువ ఇవ్వండి. 

ప్రేమ, దోమ తరువాత మాట.. ఎదుటి వ్యక్తిని గౌరవించడం, తనకు విలువ ఇవ్వడం నేర్చుకోండి ముందు..

PS: ఇలా బాహాటంగా రాసి లేదా చెప్పి సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు, పిల్లలను పాడుచేసేస్తున్నారు అనుకునే పెద్దలు ఎవరైనా ఉంటే.. ఈ పోస్ట్‌ను ఒకటికి పదిసార్లు చదవండి. మరో పదిసార్లు చూసి రాయండి. అటు తరువాత చూడకుండా కూడా రాయండి.

ముందు ఈ విషయాన్ని మీ బుర్రల్లోకి ఎక్కించుకోండి. అంతకంటే ముందు, మీరు సెక్స్‌ని గౌరవించడం నేర్చుకోండి. తరువాత మీ పిల్లలకు చెబుదురుగాని.
   --- Alamuru Sowmya
(An old post from:
Alamuru Sowmya garu..)

Absolutely right.. !
I am having the same opinion with regard to the "girls' sexual relationships" with their boy friends, before marriage.

   --- Rajeshwer Chelimela , Jvv Telangana

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం