పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Every family must know

చిత్రం

పిళ్లా రవీంద్రనాథరెడ్డి

చిత్రం
        పిళ్లా రవీంద్రనాథరెడ్డి 29-06-1958లో పిళ్లా లక్ష్మిరెడ్డి,రామలక్ష్మి దంపతులకురాజంపేటలో వున్న సరస్వతీపురంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం సరస్వతీపురంలో ఇంటి వెనుక నున్న ప్రాథమిక పాఠశాలలో గడిచింది.పదవ తరగతి వరకు ఇంటికి సమీపంలో వున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. తరువాత ఇంటర్మీడియట్ చదువుతున్న దశలో తన అక్క బావ దగ్గర ఉండి చదువు పూర్తి చేశారు.             ఇంటర్ చదువు పూర్తయ్యాక ఐ.టి.ఐ. ఎలక్ట్రిషియన్ కోర్సు చేరేందుకు 1975లో కడపకు వచ్చారు. తన అన్న దశరథరామిరెడ్డి దగ్గర వుంటూ ఐ.టి.ఐ. లో రెండేళ్ళ కోర్సు పూర్తి చేశారు.తనతో పాటు తనబావ తమ్ముడు సంటి కొండారెడ్డి కూడా అదేకోర్సులో చేరి తనతోపాటు తన అన్న దగ్గరే వున్నాడు.     ఐటిఐ అర్హత ద్వారా   విజయవాడలో విజయ స్పిన్నింగు మిల్లులో ఎలక్ట్రిషియన్ గా రూ. 200ల జీతానికి చేరారు. స్పిన్నింగ్ మిల్లులో కంపెనీ వారిచ్చిన గదిలో  వుండేవారు. మిల్లు బందరు రూటులో ఉన్న గంగూరులో వుండేది. అందులో 1977 నుండి 1984వరకు 7 సంవత్సరాలు పనిచేశారు. అక్కడ పనిచేస్తున్నసమయంలో 26-06-1980ల...

పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి(ఆరోతరం5)

చిత్రం
పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి (తల్లి గంగమ్మ, తండ్రి జి. వెంకటరెడ్డి) మున్నెయ్యగారిపల్లి, పెండ్లిమర్రి(మం), కడప. వీరికి ఇద్దరు సంతానం ఒకరు కుమార్తె మరొకరు కుమారుడు 1. పిళ్లా శరత్ జ్యోత్స్న - హైదరాబాద్ లో సేల్స్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. 2. పిళ్లా యశ్వంత్ రెడ్డి(చోటూ) బెంగళూరులో బిటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. గంగవరం వెంకటరెడ్డి, గంగమ్మల ముగ్గురు సంతానం 1. గంగవరం లక్ష్మీదేవి 2. గంగవరం సీతాదేవి భర్త మల్లికార్జున రెడ్డి (తిప్పరాజుపల్లి, పెండ్లిమర్రి, కడప) 3. గంగవరం రామకృష్ణారెడ్డి - భార్య లత(పీలేరు).

పిళ్లా రవీంద్రనాథరెడ్డి(ఆరోతరం_5)

చిత్రం
పిళ్లా రవీంద్రనాథరెడ్డి, అనసూయ (తండ్రి మొయిళ్ల సుబ్బిరెడ్డి, తల్లి అచ్చమ్మ ,చిన్నకుడాల, పులివెందుల) వీరికి ఇద్దరు సంతానం. ఒకరు కుమార్తె. మరొకరు కుమారుడు 1. పిళ్లా దీప్తి - హైదరాబాద్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు 2. పిళ్లా దినేషరెడ్డి - హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. మొయిళ్ళ సుబ్బిరెడ్డి, మొయిళ్ళ అచ్చమ్మ సంతానం 1. సాంబశివారెడ్డి (75) 2. గంగమ్మ (65) 3. సుభద్రమ్మ(60) 4. భవానమ్మ (58) 5. అనసూయ (56)

పిళ్లా ఇందిరాదేవి(ఆరో తరం_2)

చిత్రం
పిళ్లా ఇందిరాదేవి తో ఆరోతరం కొనసాగింది.  పిళ్లా ఇందిరాదేవి రాజంపేటలో పిళ్లా లక్ష్మిరెడ్డి పిళ్లా రామలక్ష్మి దంపతులకు 18.09.1952లో జన్మించారు. విద్యాభ్యాసమంతా రాజంపేటలో సాగింది. ఇంటర్ మీడియట్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిచేశాక, బి.ఏ. (తెలుగు) డిగ్రీ చేయడానికి తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో చేరారు. తరువాత 1972లో రాజంపేటలో తన తండ్రి పనిచేస్తున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా చేరారు.          రాజంపేటలో టీచరుగా పనిచేసిన కొన్నాళ్ళకు కమలాపురం మండలంలోని  నలింగాయగారి పల్లె గ్రామ వాస్తవ్యులైన  అంకిరెడ్డిగారి పిచ్చిరెడ్డి, కొండమ్మల పెద్దకుమారుడు అంకిరెడ్డిగారి కొండారెడ్డితో 1974 లో వివాహం జరిగింది. వివాహానంతరం బి.ఇడి., తప్పనిసరిగా పూర్తి చేయాలన్న నిబంధన కారణంగా ప్రొద్దుటూరులో ఆ కోర్సు పూర్తిచేశారు.           వారికి 1975లో ఒక కుమార్తె జన్మించింది. భాస్కరుడు తన కూతురి పేరిట లీలావతి గణితాన్ని రచించాడు. అలా ఆ అమ్మాయి తాత పిళ్లా లక్ష్మిరెడ్డి ఆ అమ్మాయి గణితంలో ప్రావీణ్యతసంప...

పిళ్లా ఇందిరాదేవి(ఆరోతరం_2)

చిత్రం
పిళ్లా ఇందిరాదేవి, అంకిరెడ్డిగారి పెద్ద కొండారెడ్డి (తండ్రి అంకిరెడ్డి పిచ్చిరెడ్డి, తల్లి కొండమ్మ) వీరికి ఇద్దరు సంతానం. ఒకరు కుమార్తె, మరొకరు  కుమారుడు. 1. అంకిరెడ్డి లీలావతి - హిందూపురంలో టీచరుగా       పనిచేస్తోంది. 2. అంకిరెడ్డి జయభరత్ రెడ్డి - హైదరాబాదులో           సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అంకిరెడ్డి గారి పిచ్చిరెడ్డి, అంకిరెడ్డి కొండమ్మల సంతానం 1. పెద్ద కొండారెడ్డి  2. చిన్నకొండారెడ్డి - మరణించారు 3. నడిపికొండారెడ్డి - మరణించారు 4. సంటి కొండారెడ్డి - పుత్తూరులో ఉద్యోగరీత్యా         ఉన్నారు. 5. శారద   - కడపలోని యర్రముక్కపల్లె లో నివసిస్తున్నారు. ఈమెకు శంకర్ రెడ్డి (టీచరు)తో వివాహమైంది.వీరికి ఇద్దరు కూతుర్లు.వారికి కూడా వివాహమైంది.

పిళ్లా దశరథరామిరెడ్డి(ఆరోతరం_1)

చిత్రం
        పిళ్లా దశరథరామిరెడ్డి తో ఆరో తరం ప్రారంభమైంది.             పిళ్లా దశరథరామిరెడ్డి సింహాద్రిపురం మండలంలోని కొరగుంటపల్లె లో పిళ్లా లక్ష్మిరెడ్డి,పిళ్లా శివలక్ష్మీదేవి దంపతులకు 16.3.40న  జన్మించారు.ఆయన   పుట్టిన  వారం రోజులకే  తల్లి దివంగతురాలైంది.   ఆయనను పెంచడానికి, బాగోగులు చూసేందుకు ఆయన తండ్రి ముసల్ రెడ్డి పల్లె వాస్తవ్యులు రామలక్ష్మమ్మ ను రెండో వివాహం చేసుకొన్నారు. దాంతో ఆయన బాల్యం, ప్రాథమిక విద్య   ముసల్ రెడ్డి పల్లె లో గడిచింది.ఉద్యోగ రీత్యా తండ్రి రాజంపేటకు బదిలీపై వచ్చిన తరువాత దశరథరామిరెడ్డి చదువు రాజంపేటలో కొనసాగింది.           ఎస్.ఎస్.ఎల్ .సి పూర్తి చేసిన తరువాత ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. ఇలా వెళ్ళిపోయిన  దశరథరామిరెడ్డి  ఉత్తర ప్రదేశ్ లోనివారణాసి సమీపంలో ఖుర్దా రోడ్ లో రైల్వే శాఖలో ఉద్యోగంలో చేరారు.ఇదంతా చివరి తమ్ముడు బాబు పుట్టక ముందు జరిగింది. అయినప్పటికీ ఇంటి విషయాలను తెలుసుకుంటూ ఉండేవారని 1964లో బాబు పుట్టిన సం...

ఆరో తరం_1

చిత్రం
 పిళ్లా దశరథరామిరెడ్డి, తుంగా నిర్మలాదేవి (తండ్రి తుంగా నారాయణరెడ్డి,తల్లి తుంగా మల్లమ్మ కసనూరు, సింహాద్రిపురం(మండలం) తుంగా నారాయణరెడ్డి, తుంగా మల్లమ్మల సంతానం 1. రఘనాథరెడ్డి (కడప) 6. రాజశేఖరరెడ్డి (కడప) 2. సుధాకరరెడ్డి(హైదరాబాదు) 7. కృష్ణారెడ్డి (బెంగళూరు) 3. నిర్మలాదేవి(కడప) 4. ప్రభాకర్ రెడ్డి(కడప) 5. కృష్ణవేణి(కసనూరు) వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు 1. పిళ్లా లక్ష్మీ మనోహరరెడ్డి (చిట్టి) (లక్ష్మీ మోహన్ రెడ్డిగా పేరు మార్పు) - కడపలో వున్నారు. 2. పిళ్లా పద్మ రాధిక (చిన్నక్క - కదిరిలో వున్నారు. 3. పిళ్లా విశ్వనాథరెడ్డి (విశ్వం) - కడపలో మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్నారు. 4. పిళ్లా పద్మ శోభ (శోభ) - బెంగళూరులో వున్నారు.

ఆరో తరం

చిత్రం
  ఆరో తరం(1) పిళ్లా లక్ష్మిరెడ్డి, కొమ్మా శివలక్ష్మీదేవి (మొదటి భార్య) సంతానంతో ఆరోతరం ప్రారంభమైంది. వీరికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు దశరథ రామిరెడ్డి (భార్య : తుంగా నిర్మలాదేవి ) ఆరో తరం (2) పిళ్లా లక్ష్మిరెడ్డి, కొమ్మా రామలక్ష్మి (రెండోభార్య) సంతానం తో ఆరో తరం కొనసాగింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు కలిగారు. వీరు 1. విజయలక్ష్మీదేవి అవివాహితగా మరణించారు. ఆరో తరం 3 2. ఇందిరా దేవి(18.09.52) తెలుగు        పండితులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆరో తరం 4 3. రవీంద్రనాథరెడ్డి(రవి) ఆర్.టి.సి. లో కండక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆరో తరం 5 4. విజయకుమారస్వామిరెడ్డి (బాబు)(08.07.64) కదిరిలో యల్. ఐ.సి.సంస్థలో డెవలప్మెంట్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు.

ఆరో తరం

       పిళ్లా లక్ష్మిరెడ్డి కొమ్మా శివలక్ష్మీదేవి,పిళ్లా లక్ష్మిరెడ్డి, కొమ్మా రామలక్ష్మి  సంతానంతో ఆరో తరం ప్రారంభమైంది.      ‌ ‌‌   పిళ్లా లక్ష్మిరెడ్డి,కొమ్మా శివలక్ష్మీదేవి దంపతుల ఒకే ఒక్క కుమారుడు దశరథ రామిరెడ్డి.వీరు సింహాద్రిపురం మండలంలోని కసనూరు గ్రామంలో ఉన్న తుంగా నారాయణ రెడ్డి, తుంగా మల్లమ్మ దంపతుల ప్రథమ పుత్రిక తుంగా నిర్మలాదేవి ని వివాహం చేసుకున్నారు.          తుంగా నారాయణరెడ్డి, తుంగా మల్లమ్మ దంపతుల కు 7గురు సంతానం.వారు 1. రఘనాథరెడ్డి,2. సుధాకరరెడ్డి,3.నిర్మలాదేవి 4. ప్రభాకర్ రెడ్డి,5. కృష్ణవేణి,6. రాజశేఖరరెడ్డి  7. కృష్ణారెడ్డి

పిళ్లా లక్ష్మి రెడ్డి (ఐదో తరం)

చిత్రం
                పిళ్లా లక్ష్మిరెడ్డి తో ఐదో తరం ప్రారంభమైంది. వీరు పిళ్లారామిరెడ్డి, పిళ్లా చిన్నక్క దంపతులకు  1.7.1918 లో  సింహాద్రిపురం మండలంలోని ముసల్ రెడ్డి పల్లెలో జన్మించారు. సింహాద్రిపురం పులివెందులకు 25 కి.మీ.దూరంలో ఉంది.          కోరగుంట పల్లె (కోవరంగుట్ట)లో వీరి విద్యా భ్యాసం పూర్తైంది.తరువాత బళ్లారిలో విద్వాన్ కోర్సు 1965లో పూర్తిచేశారు.        పిళ్లా లక్ష్మిరెడ్డి  సింహాద్రిపురం లోని ముసల్ రెడ్డిపల్లెలో వున్న కొమ్మా కొండమ్మ, కొమ్మా సుబ్బారెడ్డి దంపతుల  కుమార్తె కొమ్మా శివలక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. వారికొక  కుమారుడు  పిళ్లా దశరథరామిరెడ్డి జన్మించిన కొంతకాలానికే ఆ తల్లి అనారోగ్యం తో 1940లో మరణించింది. ఆమె ఫోటో లభించడంలేదు.             కొంతకాలానికి ఆయన రెండో పెళ్ళి చేసుకున్నారు. అదేవూర్లోవున్న కొమ్మా సోమిరెడ్డి, కొమ్మా అలివేలమ్మ దంపతుల  కుమార్తె కొమ్మా రామలక్ష్మిని వివాహ...

మొదటి నాలుగు తరాలు

చిత్రం
                 పిళ్లా  చెన్నారెడ్డి తో మనకు తెలిసిన మొదటి తరం మొదలవుతుంది.ఇతను ముసలి రెడ్డిపల్లెలో నివసించే వారు. ఈ వూరు పూర్వపు పులివెందుల తాలూకా లోని   సింహాద్రిపురం మండలంలో ఉంది. పులివెందుల కడపజిల్లాలో ఉంది.ఇదొక నియోజక వర్గం. అప్పట్లో 200 సంవత్సరాలక్రితం పేరు చివర రెడ్డి ఉండేది కాదు. చెన్నారెడ్డి ని చెన్నయ్య అనేవారు. రామిరెడ్డి ని రామయ్య అనేవారు.నేను చదువరుల సౌకర్యం కోసం రెడ్డి పదాన్ని అన్ని పేర్లకు కలిపాను. మొదటి తరం        పిళ్లా  చెన్నారెడ్డి మనకు తెలిసిన మొదటి తరం. ఇతని భార్య పేరు తెలియడం లేదు. ఈదంపతులకు ముగ్గురు కొడుకులు 1.నాగిరెడ్డి, 2.వెంకట్రామిరెడ్డి,3. వరదారెడ్డి జన్మించారు. రెండోతరం        1.పిళ్లా నాగిరెడ్డి కుటుంబంగురించి సమాచారం లేదు.         2. పిళ్లా వెంకట్రామిరెడ్డి కి నలుగురు సంతానం. వారు పెద్ద చెన్నారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి,చిన్న చెన్నారెడ్డి,సుబ్బక్క.      ...

పిళ్లావారు అనే పేరు ఎలావచ్చింది?

చిత్రం
                      కొన్ని జ్ఞాపకాలు        పులివెందుల ప్రాంతంలోని సింహాద్రిపురం మండలం, ముసల్ రెడ్డి పల్లెలో వీరి కుటుంబంలో ఒకామెకు ఐదువేళ్ళు బదులు ఆరువేళ్ళు పుట్టుకతో వచ్చినాయి. కొంతమందికి జన్యు లోపాల కారణంగా ఐదువేళ్ళతో పాటు ఆరోవేలు కూడా పుడుతుంది. కానీ ఇది చాలాబలహీనంగా ఉంటుంది. స్వతంత్రంగా అది కదలదు. వేలాడుతూవుంటుంది. దాన్ని పిల్లవేలు అని అంటూంటారు. అలా పిల్లవేలు వున్న అమ్మాయి కుటుంబం కావటంతో వాళ్ళను పిళ్లా వాళ్లు అని ఆపల్లెలో పిలవటం సహజంగా జరిగిపోయింది. అలా పిళ్లావారు అనే ఇంటి పేరు మెల్లగా స్థిరపడింది. కాకపోతే అంతకు ముందు వున్న ఇంటి పేరు ఏమిటో స్పష్టంగా ఎవరికీ తెలీదు.        వంశవృక్షం రాస్తున్నప్పుడు పిళ్లా వారు చాలామంది ఉన్నారని అర్థమయింది. ప్రస్తుతం మాతండ్రిగారి వైపువారి వివరాలతో మాత్రమే ఈ వంశవృక్షం రాయడం జరిగింది. మాతండ్రిగారి పెద్దల కుటుంబ వివరాలను రేఖీయ మాత్రంగా చివరలో ఒక చార్టు ద్వారా చూపించాను.            పిళ్లా వారిది ప్రధానంగా వ్యవసాయ కుట...

పిళ్లావారి వంశవృక్షం

చిత్రం
                                       పిళ్లావారి వంశవృక్షం  పిళ్లవారి వంశోద్భవం జ్ఞానానంద ప్రకాశకం అప్పయార్య సచ్ఛిష్యం చెన్నప్ప నామధేయకం