మొదటి నాలుగు తరాలు

        
        పిళ్లా  చెన్నారెడ్డి తో మనకు తెలిసిన మొదటి తరం మొదలవుతుంది.ఇతను ముసలి రెడ్డిపల్లెలో నివసించే వారు. ఈ వూరు పూర్వపు పులివెందుల తాలూకా లోని   సింహాద్రిపురం మండలంలో ఉంది. పులివెందుల కడపజిల్లాలో ఉంది.ఇదొక నియోజక వర్గం. అప్పట్లో 200 సంవత్సరాలక్రితం పేరు చివర
రెడ్డి ఉండేది కాదు. చెన్నారెడ్డి ని చెన్నయ్య అనేవారు. రామిరెడ్డి ని రామయ్య అనేవారు.నేను చదువరుల సౌకర్యం కోసం రెడ్డి పదాన్ని అన్ని పేర్లకు కలిపాను.

మొదటి తరం

       పిళ్లా  చెన్నారెడ్డి మనకు తెలిసిన మొదటి తరం. ఇతని భార్య పేరు తెలియడం లేదు. ఈదంపతులకు ముగ్గురు కొడుకులు 1.నాగిరెడ్డి, 2.వెంకట్రామిరెడ్డి,3. వరదారెడ్డి జన్మించారు.

రెండోతరం

       1.పిళ్లా నాగిరెడ్డి కుటుంబంగురించి సమాచారం లేదు.
        2. పిళ్లా వెంకట్రామిరెడ్డి కి నలుగురు సంతానం. వారు పెద్ద చెన్నారెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి,చిన్న చెన్నారెడ్డి,సుబ్బక్క.
         3.పిళ్లా వరదారెడ్డి,బాలమ్మ ను వివాహం చేసుకున్నారు.వీరికి చిన్న చెన్నారెడ్డి, చెన్నమ్మ బూమక్క,లక్షుమక్క, పిళ్లా రామిరెడ్డి జన్మించారు.

మూడోతరం

           పిళ్లా వెంకట్రామి రెడ్డి కొడుకు
పెద్ద చెన్నారెడ్డి. ఇతని భార్య పేరు,వివరాలు లేవు.వీరికి ఒకడే కొడుకు.ఇతని పేరు పిళ్లా వెంకటరెడ్డి.
         పెద్ద చెన్నారెడ్డి తమ్ముళ్లు,చెల్లెలు వివరాలు లభించలేదు.   
          పిళ్లా వరదారెడ్డి కొడుకు చిన్న చెన్నారెడ్డి. ఇతను ఎల్లమ్మ ను వివాహం చేసుకున్నారు.వీరి కుటుంబ వివరాలు లభించలేదు.
       చెన్నమ్మ,బూమక్క,లక్షుమక్క ల వివరాలు లభించలేదు.
        పిళ్లా వరదారెడ్డి చివరి కొడుకు పిళ్లా రామిరెడ్డి.ఇతను  పిళ్లా చిన్నక్కను వివాహం చేసుకున్నారు. వీరికి  ఐదుగురు సంతానం.అప్పట్లో కుటుంబ నియంత్రణ లేదు.వారు నలుగురు కుమారులు, ఒక కూతురు.వారి పేర్లు వరుసగా1) పిళ్లా సుబ్బా రెడ్డి 2) పిళ్లా వెంకటరెడ్డి 3) పిళ్లా లక్ష్మిరెడ్డి 4) పిళ్లా లక్షుమమ్మ 5) పిళ్లా చెన్నారెడ్డి.

            

నాలుగో తరం

          పెద్ద చెన్నారెడ్డి ఒకే ఒక్క కొడుకు పిళ్లా వెంకటరెడ్డి.ఇతను.నారమ్మ ను వివాహం చేసుకున్నారు. వీరికి పిళ్లా వెంకట్రామిరెడ్డి జన్మించారు.       ‌    

             పిళ్లా రామిరెడ్డి కొడుకులు సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి లిద్దరూ అవివాహితులుగా మరణించారు.బహుశా కలరా తో కావచ్చు.మరో కొడుకు చెన్నారెడ్డి 5 ఏళ్ల వయస్సులోనే దివంగతులయ్యారు.

       పిళ్లా రామిరెడ్డి కూతురు లక్షుమమ్మ గజాల సోమలింగారెడ్డిని వివాహం చేసుకున్నారు.వారికి పిల్లలు లేరు.ఆమె కూడా చిన్న వయసులోనే మరణించింది. సోమలింగారెడ్డి చివరి రోజుల్లో కడపలో రామిరెడ్డి మనవడు దశరథరామిరెడ్డి ఇంట్లో ఉండేవారు.క్షయ వ్యాధితో బాధపడుతూ కన్ను మూశారు.

     పిళ్లా రామిరెడ్డి మూడో కొడుకు పిళ్లా లక్ష్మిరెడ్డి 1.7.1918లో జన్మించారు.ఆయన పిళ్లా శివలక్ష్మిని, పిళ్లా రామలక్ష్మి ని వివాహం చేసుకున్నారు.ప్రథమ కళత్రం మరణించడం తో ద్వితీయ వివాహం చేసుకున్నారు.ఆయన తెలుగు పండితులుగా పనిచేసి తన 62వ ఏట 28.03.1979 న మరణించారు.వీరితో ఐదోతరం మొదలైంది.


The Pilla Family Tree 

 Known Lineage of the  Pilla Family begins with Pilla Chennareddy

The known lineage of the Pilla family begins with Pilla Chennareddy, who lived in Musali Reddypalle, a village in Simhadripuram Mandal, which was once part of the Pulivendula Taluk. Pulivendula is in Kadapa District, and is now a legislative constituency.

Around 200 years ago, the suffix “Reddy” was not commonly used in names. For instance, Chennareddy was simply called Chennayya, and Ramireddy was known as Ramayya. However, for the readers’ convenience, the "Reddy" suffix has been added to all the names in this record.

First Generation

The known first generation begins with Pilla Chennareddy.His wife’s name is unknown.They had three sons.They were:

1. Nagireddy

2. Venkatramireddy

3. Varadareddy

     With them second generation began.

Second Generation

1. No available information about Pilla Nagireddy's family.

2. Pilla Venkatramireddy had four children:

Pedda (elder) Chennareddy

Pedda (elder) Subbareddy

Chinna (younger) Chennareddy

Subbakka (daughter)

3. Pilla Varadareddy married Balamma, and they had the following children:

Chinna Chennareddy

Chennamma

Boomakka

Lakshmamma

Pilla Ramireddy


Third Generation


Pedda Chennareddy (son of Venkatramireddy) Wife’s name and further details are unknown.They had only one son Pilla Venkatreddy.


Details of Pedda Subbareddy, Chinna Chennareddy, and Subbakka are unavailable.

Chinna Chennareddy (son of Varadareddy) married Ellamma.No further information about this branch of the family.

Chennamma, Boomakka, and Lakshmamma: No further details about them are available.

Pilla Ramireddy (youngest son of Varadareddy) married Pilla Chinnakka.They had five children-- four sons and one daughter (as family planning was uncommon at that time). Theory were

1. Pilla Subbareddy

2. Pilla Venkatreddy

3. Pilla Lakshmireddy

4. Pilla Lakshmamma (daughter)

5. Pilla Chennareddy

      With them fourth generation began.

Fourth Generation


Pilla Venkatreddy (son of Pedda Chennareddy) married Naramma. They had one son Pilla Venkatramireddy


      Pilla Ramireddy’s sons Subbareddy and Venkatreddy both remained unmarried and passed away, possibly due to cholera. Another son, Chennareddy, died at the age of five.




Lakshmamma (daughter of Pilla Ramireddy) married Gajala Somalingareddy.They had no children.She died at a young age. Somalingareddy spent his final days at the home of Dasharatha Ramireddy (grandson of Ramireddy) in Kadapa, suffering from tuberculosis.




Pilla Lakshmireddy, the third son of Ramireddy, was born on July 1, 1918. He married Pilla Sivalakshmi, and after her death, Pilla Ramalakshmi. He served as a Telugu Pandit (teacher) and passed away on March 28, 1979, at the age of 62. With him, the fifth generation began.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth