పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

“Die Empty”

పెద్ద నీతితో కూడిన ఈ  చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.  ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది. టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్న వేస్తాడు. ‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న. ‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు. అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు. ‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం.. ఎందుకంటే..' అంటూ ఆయనే వివరణ ఇస్తాడు. ‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢంగా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూ...

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం  ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో కుటుంబాల పాత్రే కీలకం  సమాజాన్ని ఏకం చేసే మార్గంలో కుటుంబమే ప్రాథమిక పునాది. సాంఘిక విలువలు నిర్మితమై, వాటిని పోషించే కుటుంబ వ్యవస్థ సమాజానికి పునాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వసుధైవ కుటుంబకం అనే భారతీయ భావన, కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను, అదే విధంగా మానవ నాగరికత పురోగతిలో దాని సార్వత్రిక పాత్రను నొక్కి చెబుతుంది. శతాబ్ధాలుగా భారతదేశంలో శాశ్వతమైన వాటిల్లో సంప్రదాయ కుటుంబ వ్యవస్థ కూడా ఒకటి. విస్తృతమైన కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ జీవన విధానంలో ఓ ప్రత్యేకమైన అంశం. ఏదేమైనా పాశ్చాత్యీకరణ, పట్టణీకరణతో పాటు అనేక ఇతర సామాజిక, ఆర్థిక కారణాల ఫలితంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చిన్న కుటుంబాల వ్యవస్థ బాగా పెరిగిపోయింది. ప్రస్తుత ప్రపంచంలో సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల యువత మీద ఉమ్మడి కుటుంబం చూపే సానుకూల ప్రభావం బలహీనపడడం ద...

స్త్రీ-పురుష సంబంధాలు

     ప్రతి మగవాడు ఒక ట్రాన్సిస్టర్. ఒకేట్యూను స్టేషన్లే తేడా.     మొగవాడు మంచి అమ్మాయంటే గౌరవం చూపిస్తాడు. తెలివైన ఆడపిల్ల నుంచి ప్రేరణ పొందుతాడు. అందమైన స్త్రీపట్ల ఉత్సుకత చూపిస్తాడు. అర్థంచేసుకోగల అమ్మాయికి తనని తాను అర్పించుకుంటాడు.      ఒక స్త్రీ, ఒక స్త్రీ ఎలా మాట్లాడుతుందో, ఒక పురుషుడు తప్పకుండా స్త్రీతో అలా మాట్లాడడు. అలా మాట్లాడాలంటే ఇద్దరికీ ఒక విధమైన అవగాహన, పరిపూర్ణ వ్యక్తిత్వం ఉండాలి.      ప్రపంచంలో చాలామంది మంచి మొగవాళ్ళు వుండొచ్చు. కానీ, మంచిభర్తలు మాత్రం చాలా తక్కువ.  Yandamoori veerendranath

చీకు చింతా లేని దాంపత్యం

చిత్రం
            సృష్టి మనుగడ స్త్రీ పురుషుల లైంగిక విజ్ఞానం పైన, వారి లైంగిక శక్తి పైన ఆధారపడి వుంటుంది. లైంగిక విజ్ఞానం, లైంగిక శక్తి స్త్రీ పురుషుల్లో లోపించే కొద్ది సృష్టి ధర్మాలకే విఘాతం కలుగుతుంది. అందుకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి, ముఖ్యంగా బుద్ధి జీవి అయిన మనిషికి, సహజ అవసరాలైన ఆకలి,నిద్ర, దాహం, వీటితోపాటు మైధునాన్ని కూడా ఒక సహజ అవసరంగా పేర్కొన్నారు.  అంతేగాకుండ, మధురమైన మానవ జీవనకళలలో "కామం" అనేది కూడా ఒక కమనీయకళ అని అభివర్ణించారు.        కళాత్మకంగా సాగే స్త్రీ పురుషుల జీవితం ఎల్లవేళలా కళకళలాడుతూ వుంటుందని, ఎప్పటికప్పుడు వినూత్నంగా, వినోదభరితంగా ఉం టుందని కొనియాడారు.       ఆధునికులకు ఆదర్శం అలనాటిభారతీయ కామశాస్త్ర పాండిత్యం.ఈ నాటికీ ఆనాటికీ పోల్చుకుంటే ఆధునికులకన్నా ప్రాచీనులే  అన్నింట మిన్న అని తేలిపోతుంది. ఆరడుగుల అందమైన ఆవయవ సౌష్టవంతో, ఆపాద పర్యంత సర్వాంగ సౌందర్యంతో, మధుర మందార మకరంద మందహాసాలతో, నిండు నూరేళ్ళ ఆరోగ్య సౌభాగ్య మహాభాగ్యాలతో, శృంగార గంగా తరంగ తురంగ వీరంగ విహారా లలో, ఇంకా ఏ విషయంలో పోల్చుకు...

భార్యాభర్తల మధ్య సంబంధం

     భార్యాభర్తల మధ్య బంధం భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉంటేనే ఆ కాపురం చక్కగా ఉంటుంది.  అందంగా ఉంటుంది.  ఒకరినొకరు ప్రేమించడం అన్నిటికన్నా ఆరోగ్యకర మైన ప్రేమ. వారిద్దరి మధ్య ఎలాంటి కలహాలు లేకుండా చక్కగానడుచుకోగలుగుతారు.  అలా కాకుండా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గ్యాప్ వస్తే, దాని వలన వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు.  చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఇద్దరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.   ఇద్దరిలో ఎవరిపైన తప్పు చేశారని తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై గ్యాప్ మొదలౌతుంది.  ఆ గ్యాప్ ను వీలైనంత త్వరగా సర్దుకుపోయి పూడ్చుకునే ప్రయత్నం చేయాలి తప్పించి, మరో విధంగా ఉండకూడదు.  కేవలం అభిప్రాయాలను పంచుకునే విషయంలో మాత్రమే కాదు...శృంగారం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది.  అప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా దానిని భాగస్వామితో చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా చూసుకోవాలి.  అంతేకాదు, జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంతసమయం ఇంటికి, భాగస్వామికి కేటాయించినపుడు ఆ లైఫ్ హ్యాపీగా ఉంట...

కుటుంబ కవితలు

మగడు వేల్పన పాతమాటది ప్రాణసఖుడ నీకు                              ‌‌__ గురజాడ పెళ్ళంటే పెద్ద శిక్షని మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే  మమ్మల్ని విభజించి పాలిస్తోందని అర్థమైంది                          ____ సావిత్రి

పసిపిల్లల పై అత్యాచారాలుఅమ్మలు నాన్నలూ.. పిల్లలు జాగ్రత్తలు

ఎండాకాలం వచ్చేస్తోంది అమ్మానాన్నలం పిల్లలు జాగ్రత్త. ఎండదెబ్బ తగులుద్దని జాగ్రత్త చెప్పట్లే. భార్యాభర్తలు ఇద్దరూ పనులకు వెళ్ళే వాళ్ళు మీ పిల్లలు జాగ్రత్త. రెండు నెలల్లో 42అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. అన్నీ మైనర్ పిల్లల పైనే. రెండున్నరేళ్ళ మనవరాలి పై తాత. తొమ్మిదేళ్ళ , నాలుగేళ్ళ బిడ్డల పై తండ్రులు, ఇట్లా ..... నిన్న ఆరేళ్ళ పిల్లపై గొంతులో ఇనుప చువ్వ కుచ్చి మరీ అత్యాచారం.  అమ్మానాన్నలు జాగ్రత్త అడవి కంటే భయంకరమైన సమాజంలో ఉన్నాం మన పిల్లలకు మనమే ప్రథమ రక్ష. ఘోరాలు జరిగినంక ఎంత రోదించినా , నేరస్తులకు ఏ శిక్షలు వేసినా మన పిల్లలు మనకు బాధాతప్త స్మృతులే , గుండెలు పగిలే జ్ఞాపకాలే.  ఇప్పుడు నేను రాసే సుద్దులేవీ స్లమ్ వీథుల్లో పొట్టపట్టుకుని కూలీచేసే వాళ్ళు చదవరు. పసిపిల్లల పై అత్యాచారాలు జరిగేది ఇటువంటి ప్రాంతాల పిల్లల పైనే. సింగిల్ పేరెంట్స్ పిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేసే పిల్లలే కామాంథులకు టార్గెట్లు. మరి బుద్దిజీవులు మానవతా మూర్తులు ఏమి చేయాలి మిద్దెతోట అవగాహనా సదస్సులు చేసినట్టే తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పిల్లలకు ఈ విషయాలు 1) కొత్తవాళ్ళు ఎవరు ఏదిచ్చినా...

భార్యతో ఎలా ప్రవర్తించాలి?

మంచి భర్తగా ఉండడానికి భార్యతో ఎలా ప్రవర్తించాలి? (బైబిల్ చెప్పిన విషయాలు) 1 . నీ భార్యతో మాట్లాడేటప్పుడు అరచి మాట్లాడవద్దు . ఆమె బాధపడుతుంది.  2 .నీ భార్య గురించి ఇతరుల వద్ద చెడుగా  మాట్లాడవద్దు.  3 .నీ భార్య తో పంచుకోవలసిన ప్రేమ లేదా ఆప్యాయత ను వేరొకరితో పంచుకోవద్దు. అది వ్యభిచారం అవుతుంది. 4 . ఇతర స్తీలతో నీ భార్యను పోల్చవద్దు. ఆ ఇతర స్త్రీ నీకు సరిజోడైతే , దేవుడు ఆమెనే నీకు భార్యగా ఇచ్చేవాడు.  5 .నీ భార్యతో సాధు గుణం తో , మృదువుగా మసలుకో. ఆమె అన్నీ త్యాగం చేసి నీతో జీవిస్తున్నది. నీవు కఠినం గా , చిరాకుగా ఉంటే ఆమె ఎంతో బాధ పడుతుంది . 6 . నీ భార్యతో ఏది దాచిపెట్టొద్దు. మీరిరువురు ఏక శరీరులు. ఆమె నీకు సహాయకురాలు. ఆమెకు తెలియని రహస్యం ఉండకూడదు.  7 .  నీ భార్య శరీరం గురించి కించపరిచేలా మాట్లాడవద్దు. ఆమె నీ పిల్లలను కనడానికి తన జీవితాన్ని,  అందాన్ని త్యాగం చేసింది. ఆమె నీ ఆత్మ. కేవలం శరీరం కాదు. 8 . ఆమె శరీర అందాన్ని బట్టి ఆమె విలువను ఎంచవద్దు. వృద్దాప్యం లో కూడా ఆమెతో సంతోషం గా గడుపు.  9 .బహిరంగం గా ఇతరుల ముందు నీ భార్యను తిట్టి అరవవద్దు. ఏదయినా సమస...

పెళ్లి కి ముందే మాట్లాడుకోవాలి.

పెళ్లి కి ముందే మాట్లాడుకోవాలి. * పనివేళలు, పనితీరు కూడా   ముందే మాట్లాడుకోవాలి. * పెళ్లయ్యాక పెద్దవాళ్ల బాధ్యత ఏ మేరకు అనేదీ ముఖ్యమే... * ఆర్థిక వ్యవహారాలపై స్పష్టత ఉంటే... సమస్యలు దూరం. * వ్యక్తిగతం, వృత్తిజీవితం సమన్వయం కూడా అవసరమే! ‘పెళ్లయ్యాక ఉద్యోగం మానేశా...’ అనే రోజులు కావివి. ఆడపిల్లలు కూడా అబ్బాయిలతో సమానంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. జీవితంలో రాణిస్తున్నారు. మరి కెరీర్ -వైవాహిక బంధం సజావుగా, పూల నావలా సాగాలంటే పెళ్లికి ముందు కాబోయే జంటలు చేసుకోవాల్సిన ఒప్పందాలేంటో చూద్దామా... బాగా చదుకోవడంతోనే నేటి తరం అమ్మాయిల ఆలోచనలు ఆగిపోవట్లేదు. పలు రంగాల్లో స్థిరపడుతూ నింగికి నిచ్చెన వేస్తున్నారు. అయితే పెళ్లి తరువాత చాలామంది అమ్మాయిల జీవితం వాళ్లు అనుకున్నట్లు ఉండట్లేదు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒత్తిడికి లోనవుతూ ఉద్యోగాలు మానేసే స్థితికి చేరుకుంటున్నారు. అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే... పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి కెరీర్ గురించి చర్చించుకోవడం ఎంతైనా అవసరం. * సంజాయిషీ లేకుండా... ఈ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగులకు ఓ సమయం అంటూ ఉండదు. కెరీర్లో దూసుకుపోయే క్రమంలో గంటల తరబడి ...

పొదుపు కుటుంబ ఆర్థిక ప్రణాళిక

చిత్రం
   పొదుపు ఒక మంచి అలవాటు. పొదుపు వల్ల వృధా కర్చు తగ్గుతుంది. వృధా కర్చులను  తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. పొదుపు చేసిందంత కొత్తగ సంపాదించిన సంపాదన వంటిదే. విద్యుత్ పొదుపు విద్యుత్ ఉత్పత్తి తో సమానం. మద్యాన్ని  తాగడం మానేసిన వారు సంపద కూడ బెట్టవచ్చు. వైశ్యులను కోమట్లను, మార్వాడీ గుజరాతీ సేట్లను , కమ్మ వారిని చూసి పొదుపు నేర్చుకోవాలి.  వారినుంచి పొదుపుతో  పాటు అనేక విషయాలు నేర్చుకోవలసినవి ఉన్నాయి. వాల్లు ఎలా పైకి వచ్చారో  తెలుసుకొని ఆచరించినవారు కూడ పైకి వస్తున్న విషయం కళ్లముందు కనబడుతున్నదే. వ్యాపార  మెలకువలు ,  పొదుపును పెట్టుబడిగా మార్చడం ఎలాగో వారిని అధ్యయనం చేయాలి. బ్రాహ్మణులు , మద్య మాంస ప్రియులు కర్చులు ఎక్కువ చేస్తారు. ఎస్సీలు మద్య మాంసాలతో పాటు సమాజం విధించిన వెలివేత అంటరానితనం, చిన్నచూపు వల్ల  గౌరవం పొందడం కోసం ఇంటికన్న బయట ఇతర కర్చులు బట్టల కర్చులు ఎక్కువ కర్చులు చేసి పొదుపు చేయలేక పోతుంటారు. ఆర్థిక ప్రణాళిక చెప్పేవారు లేక, పొదుపు తక్కువ.:      1990 లో ఒకాయన 6వేలతో టీవీ కొన్నాడు.  అతని మిత్రుడు 6 వేలతో 200 గజ...

పెంపకం

    పిల్లల   పెంపకం   రాజవత్ పంచవర్షాణి  దశవర్షాణి దాసవత్  ప్రాప్తే తు షోడశే వర్షే  పుత్రం మిత్రవదాచరేత్ తల్లిదండ్రులు తమ పిల్లలనుl ఐదు సంవత్సరాల వరకు మహారాజుని చూసినట్లు చూడాలి. తరువాత పది సంవత్సరాల పాటు ప్రేమానురాగాలు చూపిస్తూనే కట్టుదిట్టంగా పెంచాలి. పదహారు సంవత్సరాలు పూర్తి అయిన తరువాత మిత్రుణ్ణి చూసినట్లు చూడాలి. మనసు అనే మొక్కకు మనమే తోటమాలి. బీజాలు నాటడం నుంచి మొక్కగా ఎదిగేవరకు మనం ఎలా సాకుతామో అలా పెరుగుతుంది. మన జాగ్రత్తలన్నీ బీజాలు ఎంపిక చేయడంలోనే చూపాలి. అక్కడ పొరపాటు చేస్తే అమృతబీజాలకు బదులు విషబీజాలు పడతాయి. ఈ రెండింటి మధ్యగల తేడా ఏమిటోకూడా మనం గ్రహించాలి. అమృతబీజాలంటే- ప్రేమ, కరుణ, దానం, దయ వంటివి. విషబీజాలంటే- అసూయ, ద్వేషం, కోపం, అహంకారం వంటివి. మొదటివి పూలమొక్కల్ని మొలిపిస్తాయి. రెండోరకం- విషవృక్షాలు పుట్టిస్తాయి. బాల్యదశ తల్లిదండ్రుల సంరక్షణలో గడుస్తుంది. పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపవలసింది వారే. పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. వారి ప్రతి చర్యనూ పిల్లలు సమీపం నుంచి గమనిస్తుంటారు. కాబట్టి, తమనుంచి పిల్లలు సద్గుణాలు నేర్చుకునేట్టు పెద్దల ప్...