పొదుపు కుటుంబ ఆర్థిక ప్రణాళిక


  
పొదుపు ఒక మంచి అలవాటు. పొదుపు వల్ల వృధా కర్చు తగ్గుతుంది. వృధా కర్చులను 
తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. పొదుపు చేసిందంత కొత్తగ సంపాదించిన సంపాదన వంటిదే. విద్యుత్ పొదుపు విద్యుత్ ఉత్పత్తి తో సమానం. మద్యాన్ని 
తాగడం మానేసిన వారు సంపద కూడ బెట్టవచ్చు. వైశ్యులను కోమట్లను, మార్వాడీ గుజరాతీ సేట్లను , కమ్మ వారిని చూసి పొదుపు నేర్చుకోవాలి. 
వారినుంచి పొదుపుతో  పాటు అనేక విషయాలు నేర్చుకోవలసినవి
ఉన్నాయి. వాల్లు ఎలా పైకి వచ్చారో  తెలుసుకొని ఆచరించినవారు కూడ పైకి వస్తున్న విషయం కళ్లముందు కనబడుతున్నదే. వ్యాపార  మెలకువలు , 
పొదుపును పెట్టుబడిగా మార్చడం ఎలాగో వారిని అధ్యయనం చేయాలి. బ్రాహ్మణులు , మద్య మాంస ప్రియులు కర్చులు ఎక్కువ చేస్తారు. ఎస్సీలు మద్య మాంసాలతో పాటు సమాజం విధించిన వెలివేత అంటరానితనం, చిన్నచూపు వల్ల  గౌరవం పొందడం కోసం ఇంటికన్న బయట ఇతర కర్చులు బట్టల కర్చులు ఎక్కువ కర్చులు చేసి పొదుపు చేయలేక పోతుంటారు.

ఆర్థిక ప్రణాళిక చెప్పేవారు లేక, పొదుపు తక్కువ.: 

    1990 లో ఒకాయన 6వేలతో టీవీ కొన్నాడు. 


అతని మిత్రుడు 6 వేలతో 200 గజాల స్థలం కొన్నాడు. 

2000 నాటికి టీవీ పాడైంది. పిల్లలు ఫేలయ్యారు. మిత్రుని పిల్లలు ఎంసెట్ పాసై సీట్లు తెచ్చు కున్నారు. 
6 వేలకు కొన్న స్థలం రెండు లక్షలైంది.

ఇందిరా వికాస పత్రం:

   సంపాదన లేదా జీతం ఎంత అని కాదు. ఎంత పొదుపు చేసామనేదే ముఖ్యం. 1990 లో  ఇందిరా వికాస పత్రం కొంటే ఐదేండ్లకు డబల్ అయ్యేది. ఈ లెక్కన . వంద రూపాయలు 100 ఏండ్లకు పది కోట్లవుతాయి. నమ్మలేక పోతే కాగితం కలం తీసుకొని ఐదేండ్లకు డబుల్ చొప్పునః లెక్క వేస్తూ  పొండి. 

వందేండ్లకు 10 కోట్లకు పైన అయితది. అనగా నీవు ఇవాల  వృధా చేసే 100 రూ. లు రేపటి 10 కోట్లతో సమానం. 

ఎంత సంపాదిస్తే అంత :

సంపాదిస్తేనే దానం దర్మం త్యాగం. కర్చు పొదుపు. లేకుంటే ఏదీ లేదు.ఎంత సంపాదిస్తే అంత త్యాగం చేయవచ్చు. అంత పొదుపు చేయవచ్చు. అంత కర్చు చేయవచ్చు.
నీకు రోజు కోటి దానం చేయాలని ఉంది. ఎంత సంపాదించాలి? 1500 కోట్ల పైగా టర్నోవర్ చేస్తే జీతాలు పన్నులు ఇన్కం టాక్సు పోను 365 కోట్లు మిగులుతాయి. అనగా నీవు కోటి త్యాగం చేయాలంటే 1500 కోట్లు పైగా టర్నోవర్ 
 చేయాలన్న మాట!

పొదుపు ఆర్థిక ప్రణాళిక:

  పొదుపు పేరిట ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ సెకండ్ హాండ్ పాత డ్రెస్సులు వేసుకునే వారిని కొందరు పిసినారి అంటారు. చిరిగిన బట్టలు వేసుకొని అనేక గ్రామాలలో పాఠశాలలు స్థాపించి సంఘ సంస్కర్తగా  నిలిచి పోయాడు అంబేద్కర్ అపారంగా గౌరవించిన సంత్ గాడ్గే బాబా ( 1876-1956) . ఆయన పేరిట ప్రస్తుతం మహారాష్ట్ర లోని అమరావతి లో విశ్వవిద్యాలయం 90 వేల మంది విద్యార్థులతో నడుస్తున్నది. ఆయన రజక  కులంలో పుట్టి పేదల విద్య కోసం అనేక పాఠశాలలు స్థాపించారు. ప్రజలు పొదుపు లోంచి ఇచ్చిన పైసలతోనే అవన్నీ నిర్వహించారు. 
         పండుగలకు కూడా పాత వంటే చేసుకునే వారు పేదలు. ఉండి కూడా చేసుకోకపోతే అది పొదుపు పేరిట పిసినారులు .   ఇంటా బయటా చాయ కాఫీ టిఫిన్ పాన్ సిగరెట్ మద్యం ,మాంసం , చిరుతిండి అలవాటు లేకపోవడం, బయట అసలేదీ తినక పోవడం, సినిమాలు చూడక పోవడం పిసినారి తనంకాదు.అది మంచి పొదుపు . అది మంచి కుటుంబ ఆర్థిక ప్రణాళిక. మంచి ఆరోగ్య సూత్రం. మంచి పొదుపు సూత్రం. లాక్ డౌన్ కాలంలో కరోనా వల్ల బయటకు పోకపోతే ఎంత కర్చు తగ్గిందో అంచనా వేసుకొండి. కరోనా కాలంలో ఎంత కర్చు తగ్గిందో అట్ల ఎపుడు బతికితే అది మంచి పొదుపు , అది  మంచి ఆర్థిక ప్రణాళిక.
  అవసరమైన మేరకు స్తోమత ఉండి కర్చు చేయక పోవడం పిసినారి తనం. కొందరు మద్యం చాయ వగైరా తీసుకోకపోతే పిసినారి అంటారు. చాయ పాన్ సిగరెట్ మద్యం మాంసం వద్దంటే ఇగ బతుకుడెందుకే అనేవాల్లు , అనుకునేవాల్లున్నారు. కుటుంబ సంపాదన నెలకు 5 వేల నుండి 30 వేల వరకున్నవారు 60 శాతం రోజువారీ వెలవారీ కర్చులకు, వాడుకొని 30/40 శాతం పొదుపు చేస్తే మంచి ఆర్థిక ప్రణాళిక. 
    నెలకు 30వేలు 50 వేలు సంపాదన ఉన్నవారు తప్పక. పొదుపు చేసి దాంతో అదనపు ఆదాయం ఏర్పాటు చేసుకుంటే మంచి ఆర్థిక ప్రణాళిక  .  .నెలకు 50 వేలు - 2 లక్షలు ఆదాయం ఉండేవారు అంతకు పైబడి ఆదాయం ఉండేవారు పొదుపు చేసిన దాంతో...తాము  కట్టిన ఇన్కం టాక్సు కన్న ఎక్కువ ఆదాయం పొందితే మంచి ఆర్థిక ప్రణాళిక.

             పొదుపు ను మదుపు చేసి ఆదాయం పెంచుకునే వారే సంపన్నులని అమెరికా ఆర్థశాస్త్ర వేత్తలు పరిశోధనలో తేల్చారు. అక్కడ డాక్టర్ల ఆదాయంలో మూడోవంతు ఆదాయం ఉన్నవాల్లు డాక్టర్లకన్న సంపన్నులుగ బతున్నారట! డాక్టర్లు వంటి వారు పొజిషన్ పోకడ కోసం కర్చు ఎక్కువ చేస్తారట ! కొందరు సంపాదన కన్న కర్చులు ఎక్కువ చేసి అప్పుల పాలవుతారు. ఒకాయన సగం బ్యాంకు లోన్, సగం తన పైసలు పెట్టి డుప్లెక్స్ 


కట్టి చివరకు ఇల్లమ్మితే  అంతా అప్పు , వడ్డీ కిందికే పోయింది. తన  పెట్టుబడి తనకష్టం ఏదీ మిగల లేదు. 
       ఇపుడు ధరలు పెరిగినయి. మునుపటంత ఘోరంగ లేదు.  20 ఏండ్ల కింద ఆరు లక్షలకు కొన్న ఫ్లాట్ కు ఇపుడొకాయనకు నలభయి అయిదు లక్షలు వచ్చినయి. పొదుపు వల్ల  ఉద్యోగంలో మొత్తం ఎత్తుకున్న జీతం కన్నా ఎంతో ఎక్కువ సంపాదించారు. హైదరాబాద్ వంటి నగరాలకు ముందు వచ్చి ముందు కొన్న వారికి కలిసి వచ్చిన లాభం. 

        బ్యాంకు లోన్ తో క్యాబ్ తీసుకుంటే అప్పు తీరిన ఆరేండ్లకు తన పెట్టుబడి కింద డొక్కు క్యాబ్ మిగిలిందొకాయనకు! అంటే సంపాదించి బ్యాంకుకే పోసిండు.  అదే సమయంలో తన పైసలతో సెకండ్ హాండ్ క్యాబ్. నడుపుకున్నాయనకు మొత్తం పైసలు ఆయనకే మిగిలినయి. 
 అమెరికాలో మిలియనీర్ పారిశ్రామిక వేత్త ఒకాయన ఎపుడూ లేటెస్టు సెకండ్ హాండ్ కార్ కొనుక్కుని వాడే వాడట! రోడ్ పొంట క్యాంటీన్ లో తినేవాడట! 
       ఒక పల్లెటూరి ఆ వూరు సంపన్న షావుకారు పంచె కట్టి అంగీ వేసుకోకుండనే ఉండే వాడట! ఏంది సేటూ ! అంగీ ఐన వేసుకో అంటే నేను తెలువని దెవరికి? అంగీ వేసుకోక పోతే ఏంది? వేసుకుంటే పెరిగేదేంది అన్నాడట!
పది రోజులకు పెద్ద వూర్లె కనపడితే అడిగిండట! అంగి లేక పోతే ఎట్ల సేటూ అని!  ఇక్కడ        నన్ను గుర్తు పట్టెటోల్లు ఎవరున్నరు? అంగీ ఏసుకుంటే ఎంత? ఏసుకోక పోతె ఎంత? అన్నడట!
 పొదుపుకు పిసినారి కి ఎవరి నిర్వచనం వారిది! కుటుంబంలో జీవితంలో  లక్ష్యాలుండాలి.  జీవితానికొక ప్రణాళికతో పాటు ఆర్థిక ప్రణాళిక ఉండాలి. 



ఆర్థిక ప్రణాళిక , ఆర్థిక క్రమశిక్షణ లేని
 లేని కులాలు , వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలు, దేశాలు, ఆర్థిక ప్రణాళిక లేని బతుకులు అరాచకం . అప్పుల పాలు. ఆ బతుకులు ఆ దేశాలుఅనర్థం అర్ధాంతరం.. అస్తవ్యస్తం అవుతాయి. అలాగే ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోవడం మంచిది. ఎడా పెడా ప్రకృతిని విధ్వంసం చేస్తే మానవ సమాజం విపత్తులు ఎదుర్కోక తప్పదు. అలాగే ఎడా పెడా కర్చులు చేస్తూ అప్పులు చేస్తూ పోతే కొంతకాలానికి జీవితం కుటుంబం వినాశనం అయ్యే అవకాశం ఉంటుంది. పొదుపు తోనే మానవ సమాజం ఎదుగుతూ వస్తున్నది. పొదుపే పెట్టుబడి గా మారుతూ వస్తున్నది.

    ... బి ఎస్ రాములు
  ఫోన్: 8331966987

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth