పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి

ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటని అడగండి. వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు. పట్టణంలోకి  వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు. "అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది" అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు. భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు. మారిషస్ వాళ్ళకు అక్కడ పురోహితుడు, కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడుగుతున్నారు. ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు. మరోపక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. హోటల్స్ లో దోస మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది. అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యు లో నిల్చుంటున్నారు.  సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి. జీతం ఎక్కువ వస్తుంది అని కాదు. చాల సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు రెండు ...

ఇల్లు లేదా స్థలాలు కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

చిత్రం
         pc forbes.com టైటిల్‌ డీడ్‌.. మీరు కొనాలనుకుంటున్న ఇల్లు లేదా స్థలం, ఎవరి పేరున ఉందో తెలుసుకోవాలి. టైటిల్‌ డీడ్‌ (యాజమాన్య పత్రం) చూస్తే ఈ విషయం తెలిసి పోతుంది. ఆస్తి అమ్మడానికి సిద్ధపడిన వ్యక్తి పేరు మీదే ఆ ఆస్తి ఉందా? అతడికి దానిపై హక్కు ఉందా లేదా ధ్రువీకరించుకోవాలి. టైటిల్‌ డీల్‌ పత్రం తీసుకుని ప్రాపర్టీ కేసులు చూసే అనుభవజ్ఞుడైన న్యాయవాది చేత చెక్‌ చేయుంచుకోవడం మరీ మంచిది. ఒకవేళ ఆస్తి ఇద్దరు లేదా ఎక్కువ మంది పేర ఉంటే, ప్రతి ఒక్కరి నుంచి రిలీజ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న తర్వాతే కొనుగోలుకు సిద్ధపడాలి. లేకపోతే మున్ముందు న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అమ్మకం పత్రం.. టైటిల్‌ డీడ్‌ ధ్రువీకరించుకున్నాక ఆస్తి కొనుగోలుకు సిద్ధంకావచ్చు. ఇందుకోసం అమ్మకందారుడితో అమ్మకం ఒప్పందం (సేల్‌ డీడ్‌) కుదుర్చుకోవాలి. అమ్మకం పత్రం ద్వారా ఆ ఆస్తి యాజమాన్య హక్కులు, అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి సంక్రమిస్తాయి. సేల్‌ డీడ్‌ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఆస్తి సొసైటీ, బిల్డర్‌ పేర ఉన్నదా? లేక ఆ ప్రాంత అభివృద్ధి సంస్థ పేరు మీద ఉన్నదా అన్నది తెలుసుకోవచ్చు. టాక్స...

భాగస్వామిని ఆకట్టుకునే కళ

చిత్రం
కామసూత్ర లాంటి గ్రంథంతో, ఖజురహో, దిల్వారా, అజంతా, ఎల్లోరా శిల్పాలతో ప్రేమ భాషను ప్రపంచానికి పంచిన దేశంలో భారతీయులు మాత్రం ప్రేమగా మాట్లాడడం, తమ భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్నారు. సెక్స్‌ అంటే "పది సెకన్లే ఉండే ఒక ఓవర్ రేటెడ్ అనుభూతి"గా ఇంగ్లీష్ రచయిత సైమన్ రేవెన్ వర్ణించారు. "ప్రాచీన భారతదేశానికి సంబంధించిన శృంగార సాహిత్యం అనువదించే ధైర్యం ఎవరు చేయగలరు?’’ అని ప్రశ్నించారు. నేను అదే ప్రశ్నను "ద ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్" పుస్తకం రాసిన డాక్టర్ సీమా ఆనంద్‌ను అడిగాను. "సైమన్ రేవెన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా" అన్నాను. దానికి ఆమె "అస్సలు ఒప్పుకోను, నా ఉద్దేశం ప్రకారం సెక్స్ గురించి మన ఆలోచన మారింది. ఎన్నో శతాబ్దాల నుంచీ మనకు ఇది పనికిరానిదని నేర్పిస్తూ వచ్చారు. సెక్స్ చెడ్డదని, అది చేయడం పాపం అని చెప్పారు. కానీ ఎవరూ దానితో లభించే ఆనందం గురించి మాట్లాడరు. 325 Eలో కాథలిక్ చర్చి తన నియమ నిబంధనల్లో ‘శరీరం పనికిరాని ఒక వస్తువు. శారీరక సుఖం చెడ్డది. దాన్ని పొందాలనే కోరిక రావడమే పాపం’ అని చెప్పింది’’ అని సీమా ఆనంద్ అన్నారు. "సెక్స్ ఒకే ఒక ఉద్దేశం...

అప్పగింతలప్పటి మామ మాటలు అల్లునితో

చిత్రం
 ఒక తండ్రి తన కూతురిని అత్తవారింటికి అప్పగించేటప్పుడు చెప్పిన మాటలు... నిజంగా అద్భుతం... బాబూ ! మా అమ్మాయి కొత్త కుటుంబం లో ముఖ్యమైన నిన్ను ఎలా సంబోధించాలి ? ఎందుకంటే ఇపుడు మా అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు . అందుకు నాకు చింత లేదు బాబూ ! ఎందుకంటే మా అమ్మాయికి చెప్పాము మా కంటే మీరే ఆమెకు ప్రధానం అని . మేమిపుడు ఆమె ప్రయాణం లో వెనుక సీటులోకి వెళ్ళాము . మీరు పక్క సీట్ లోకి వచ్చారు . ఇదంతా మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాము . ఆమెను సంతోషంగా ఉంచండి . నాకు చాలా నమ్మకం ! నీవు ఆమెను మేము చూసుకున్న కంటే చక్కగా చూసుకుంటావు . అయినా అందరు తండ్రులలాగే ఆ ప్రేమతో నీతో మాటి మాటికీ అంటున్నా ! ఆమెను సంతోషంగా ఉంచండి . ఆమె నాకు ఎప్పటికీ బరువూ కాదు , బాధ్యతా కాదు ! నిజానికి ఆమె మా ఇంటికి ఒక అందం ! మా ఊపిరి ! ఆమె మా చిరునవ్వు ! ఆమెకు పెళ్లి చెయ్యడం ప్రకృతీ , మన సంస్కృతి , సంప్రదాయమూ నిర్ణయించిన విధానం కనుక మీ ఇంటికి పంపిస్తున్నాను . మా ఇంటి సంతోషం మీ ఇంటిని సంతోష పరచడానికి పంపుతున్నాము . ఇన్నాళ్ళూ మా ఇంటిలో వెలిగిన జ్యోతిని మీ ఇంట వెలుగులు నింపాలని పంపిస్తున్నాము . మా ప్రపంచాన్ని మీకు ఇచ్చేస్తున్నాము. ఆమెను సం...

కాపోళ్లు రెడ్లు ఎలా అయ్యారు?

             హిందువులలోని అనేక శూద్రకులాల్లో రెడ్డి కులం కూడా ఒకటి. రెడ్లు ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10% నుండి 17% వరకు వున్నారు. వీరి భాష తెలుగు. కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో కూడా చాలామందిఉన్నారు. మొదట రట్టుల ప్రసక్తి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి అశోకుని శిలాశాసనాల్లో కనిపిస్తున్నది. బహుశా ఈశాసనాల్లో పేర్కొనబడిన రట్టులే కాలక్రమంలో రెడ్లు అయి ఉండొచ్చు.        క్రీ.పూ. 200 సంవత్సరాల నాటి భారవేలుని హాతిగుంఫా శాసనం వీరినే రఠికులని ప్రస్తావిస్తున్నది. ఇదే అభిప్రాయాన్ని ఆచార్య బి.యస్.ఎల్. హనుమంతరావు కూడా తన 'సోషల్ మొబిలిటీ' అనే పేరుతో వ్రాసిన వ్యాసాలలో వ్యక్తపరచారు. 'రెడ్డి' పదం పుట్టుక గురించి  పండితుల మధ్య చాలా పెద్ద చర్చే జరిగింది.           క్రీ.శ. 6వ శతాబ్దినుండి ఆంధ్రదేశంలో కాపులు లేక వ్యవసాయదారుల పేర్ల చివర 'రట్టగుడి' పదం కనిపిస్తున్నది. ఉదాహరణకు - క్రీ.శ. 6-7 శతాబ్దాల నాటి శాసనాల్లో 'అరవళమహేంద్రరట్టగుడి', 'పల్లవ రట్టగుడి', 'చల్కిరట్టగుడి' మొదలైన ప...

గోత్రం

            గణ సమాజాల నుంచి, గోత్రాల నుంచి కొన్ని దశాబ్దాలపాటు పరిశోధించిన మోర్గాన్ "పురాతన సమాజం" లో అనేక అద్భుత విషయాల్ని ప్రపంచానికి అందించాడు. కులాలూ, గోత్రం, వంశం ప్రజల సంస్కృతిలో భాగంగా ఒక ఇప్పటికీ ఉండడం ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు సగోత్రీకుల్లో వివాహ నిషేధం!              గోత్రం అనే పదం వేదాలలో ఎక్కడా కానరాదు. అయితే, పాళీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు ‘గొట్ట’ అనే మాట కనిపిస్తోంది. బౌద్ధమతం సుస్థిరం అయిన కాలం నాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలోకూడా ‘గోత్రం’ గురించిన ప్రసక్తి ఉంది. ‘గోత్రం’ అంటే అనేక అర్థాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొనవచ్చు. ‘గోత్రం’ అనే పదం ‘గౌః’ అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. ‘గౌః’ అంటే గోవులుఅని అర్థం. ‘గోత్ర’ అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వం...

బంధం

     భార్యాభర్తల మధ్య బంధం భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉంటేనే ఆ కాపురం చక్కగా ఉంటుంది.  అందంగా ఉంటుంది.  ఒకరినొకరు ప్రేమించడం అన్నిటికన్నా ఆరోగ్యకర మైన ప్రేమ. వారిద్దరి మధ్య ఎలాంటి కలహాలు లేకుండా చక్కగానడుచుకోగలుగుతారు.  అలా కాకుండా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గ్యాప్ వస్తే, దాని వలన వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు.  చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఇద్దరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.   ఇద్దరిలో ఎవరిపైన తప్పు చేశారని తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై గ్యాప్ మొదలౌతుంది.  ఆ గ్యాప్ ను వీలైనంత త్వరగా సర్దుకుపోయి పూడ్చుకునే ప్రయత్నం చేయాలి తప్పించి, మరో విధంగా ఉండకూడదు.  కేవలం అభిప్రాయాలను పంచుకునే విషయంలో మాత్రమే కాదు...శృంగారం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది.  అప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా దానిని భాగస్వామితో చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా చూసుకోవాలి.  అంతేకాదు, జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంతసమయం ఇంటికి, భాగస్వామికి కేటాయించినపుడు ఆ లైఫ్ హ్యాపీగా ఉంట...

సోషల్ రూల్స్

సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్: 1. ఒకరికి, రెండు సార్లకు మించి      అదేపనిగా కాల్ చేయవద్దు. వారు      సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే      చాలా ముఖ్యమైన పని ఉందని      అర్థం.  2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు      అరువు తీసుకున్న డబ్బును వారికి      తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న      మొత్తమైనాసరే! అది మీ      వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది!   3. ఎవరైనా మీకోసం పార్టీ      ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన      వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్      చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే      ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని      అడగండి.  4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?       మీకు పిల్లలు లేరా?        ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"       వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను       ఎదుటివారిని అడగవద్దు. అవి,       వారి ...