గోత్రం
గణ సమాజాల నుంచి, గోత్రాల నుంచి కొన్ని దశాబ్దాలపాటు పరిశోధించిన మోర్గాన్ "పురాతన సమాజం" లో అనేక అద్భుత విషయాల్ని ప్రపంచానికి అందించాడు. కులాలూ, గోత్రం, వంశం ప్రజల సంస్కృతిలో భాగంగా ఒక ఇప్పటికీ ఉండడం ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు సగోత్రీకుల్లో వివాహ నిషేధం!
గోత్రం అనే పదం వేదాలలో ఎక్కడా కానరాదు. అయితే, పాళీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు ‘గొట్ట’ అనే మాట కనిపిస్తోంది. బౌద్ధమతం సుస్థిరం అయిన కాలం నాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలోకూడా ‘గోత్రం’ గురించిన ప్రసక్తి ఉంది. ‘గోత్రం’ అంటే అనేక అర్థాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొనవచ్చు. ‘గోత్రం’ అనే పదం ‘గౌః’ అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. ‘గౌః’ అంటే గోవులుఅని అర్థం. ‘గోత్ర’ అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు ‘సగోత్రీకుల’ను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది.
గోత్రం’ అనే పదం మొట్టమొదటిసారిగా ‘ఛాందోగ్యోపనిషత్’లో ఉన్న సత్యకామ జాబాలి కథలో కనిపిస్తుంది. గోత్రానికి గోవు, గురువు, భూమి, వేదం అని అర్థాలున్నాయి. అయితే వీటీకి, మనషులకు ఉన్న సంబంధం ఏంటి?. పురాతన కాలంలో గోవులే ధనం. ఒక చోట నుంచి మరోచోటికి వలస వెళ్తుండేవారు. అలాంటి సమయంలో గోవుల రక్షణకు గోత్రాలను ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవులలో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలను గోత్రపాలకులు తీర్చేవారు. వారు ఎంతో క్రమశిక్షణ, తపోనిష్ఠతో ఉండేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు, వారి వారి మూల పురుషులను గోత్ర నామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో , యాగాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది.గుడిలో అడిగే గోత్రం నువ్వు మొక్కే ఆ దేవుడికి "ఎంత దూరంలో నిలబడాలో" నిర్ణయించడానికే. రాజ్యాంగం అడిగే కులం, నీకు అవకాశాలు కల్పించి అన్ని కులాలతో సమానం గా కూర్చోబెట్టడానికి.
పిచ్చిగుంట్ల వారు రెడ్ల కులంలో వారి వంశ నామాలు,గోత్ర నామాలు శ్రావ్యంగా గానం చేస్తూ ఉంటారు.ఒకే కుదురులో వివాహాలు జరగకుండా ఉండేందుకు ఇదొక ఏర్పాటుగా చెప్పుకోవచ్చు. క్రమేపీ కనుమరుగవుతున్న గాత్రయుక్త కులాచారాల్లో ఇది ఒకటి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి