అప్పగింతలప్పటి మామ మాటలు అల్లునితో
ఒక తండ్రి తన కూతురిని అత్తవారింటికి అప్పగించేటప్పుడు చెప్పిన మాటలు... నిజంగా అద్భుతం...
బాబూ !
మా అమ్మాయి కొత్త కుటుంబం లో ముఖ్యమైన నిన్ను ఎలా సంబోధించాలి ?
ఎందుకంటే ఇపుడు మా అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు . అందుకు నాకు చింత లేదు బాబూ ! ఎందుకంటే మా అమ్మాయికి చెప్పాము మా కంటే మీరే ఆమెకు ప్రధానం అని . మేమిపుడు ఆమె ప్రయాణం లో వెనుక సీటులోకి వెళ్ళాము . మీరు పక్క సీట్ లోకి వచ్చారు . ఇదంతా మేము సంతోషంగా ఆహ్వానిస్తున్నాము .
ఆమెను సంతోషంగా ఉంచండి .
నాకు చాలా నమ్మకం ! నీవు ఆమెను మేము చూసుకున్న కంటే చక్కగా చూసుకుంటావు . అయినా అందరు తండ్రులలాగే ఆ ప్రేమతో నీతో మాటి మాటికీ అంటున్నా !
ఆమెను సంతోషంగా ఉంచండి .
ఆమె నాకు ఎప్పటికీ బరువూ కాదు , బాధ్యతా కాదు ! నిజానికి ఆమె మా ఇంటికి ఒక అందం ! మా ఊపిరి ! ఆమె మా చిరునవ్వు ! ఆమెకు పెళ్లి చెయ్యడం ప్రకృతీ , మన సంస్కృతి , సంప్రదాయమూ నిర్ణయించిన విధానం కనుక మీ ఇంటికి పంపిస్తున్నాను . మా ఇంటి సంతోషం మీ ఇంటిని సంతోష పరచడానికి పంపుతున్నాము . ఇన్నాళ్ళూ మా ఇంటిలో వెలిగిన జ్యోతిని మీ ఇంట వెలుగులు నింపాలని పంపిస్తున్నాము . మా ప్రపంచాన్ని మీకు ఇచ్చేస్తున్నాము.
ఆమెను సంతోషంగా ఉంచండి .
ఆమె మా యువ రాణి . మీ ఇంట రాణిలా ఉంచు . ఆమెను మా చెమట తో, రక్తంతో, అనురాగం తో , ప్రేమతో , మమత తో , బాధ్యతగా పరిపూర్ణం గా తయారుచేశాము . ఆమె మే ఇంటికి శోభనూ , సంతోషాన్నీ , ప్రేమనూ , అనురాగాన్నీ , ఆప్యాయతనూ తీసుకుని వస్తుంది . ఇందుకు ప్రతిగా మేము కోరుకునేది
ఆమెను సంతోషంగా ఉంచండి .
ఆమె ఒక వేళ తన మాటలతో గానీ , చేతలతో గానీ నిన్ను ఇబ్బంది పెడితే ఆమెను మందలించు . కానీ సున్నితంగా చూసుకో ! ఆమె అద్దం లాంటిది . సున్నితమైన మల్లె పువ్వు లాంటిది . ఆమె ఏదైనా పరిస్థితిలో బాధ పడుతూ ఉంటె ఆమెకు నువ్వు తోడుగా ఉండు . ఆమెకు ఏదైనా అనారోగ్యం కలిగితే జాగ్రత్తగా చూసుకో ! నీ లాలన ఆమెకు మంచి మందు అని గుర్తుంచుకో ! ఆమె ఏదైనా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా ఉంటె ఆమెకు తెలియచెప్పు . ఆమె ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది అని గుర్తుంచుకుని ప్రేమగా చెప్పు . ఆమెను అర్ధం చేసుకో !
ఆమెను సంతోషంగా ఉంచండి .
ఆమె నాకు నెలల తరబడి కనబడక పోయినా పరవాలేదు . రోజూ నాతో మాట్లాడక పోయినా పరవాలేదు ఆమె మమ్మల్ని గుర్తుంచుకోక పోవడమే మాకు కావలసినది . మా జీవితాశయం మా అమ్మాయి సంతోషమే ! అది ఇపుడు నీ చేతుల్లో పెడుతున్నాము .
ఆమెను సంతోషంగా ఉంచండి .
నా ఈ మాటలు ఇపుడు నీకు అర్ధం కాకపోవచ్చు . వింతగా అనిపించా వచ్చు . నువ్వూ ఒక ఆడపిల్లకు తండ్రివి అయ్యే అదృష్టాన్ని పొందితే అపుడు నీ మనసూ ఇలాగే ప్రార్ధిస్తుంది !
మా ఇంటి లక్ష్మిని నీ చేతికందిస్తూ ......
మీ మామగారు
.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి