కాపోళ్లు రెడ్లు ఎలా అయ్యారు?
హిందువులలోని అనేక శూద్రకులాల్లో రెడ్డి కులం కూడా ఒకటి. రెడ్లు ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10% నుండి 17% వరకు వున్నారు. వీరి భాష తెలుగు. కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో కూడా చాలామందిఉన్నారు.
మొదట రట్టుల ప్రసక్తి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి అశోకుని శిలాశాసనాల్లో కనిపిస్తున్నది. బహుశా ఈశాసనాల్లో పేర్కొనబడిన రట్టులే కాలక్రమంలో రెడ్లు అయి ఉండొచ్చు.
క్రీ.పూ. 200 సంవత్సరాల నాటి భారవేలుని హాతిగుంఫా శాసనం వీరినే రఠికులని ప్రస్తావిస్తున్నది. ఇదే అభిప్రాయాన్ని ఆచార్య బి.యస్.ఎల్. హనుమంతరావు కూడా తన 'సోషల్ మొబిలిటీ' అనే పేరుతో వ్రాసిన వ్యాసాలలో వ్యక్తపరచారు. 'రెడ్డి' పదం పుట్టుక గురించి పండితుల మధ్య చాలా పెద్ద చర్చే జరిగింది.
క్రీ.శ. 6వ శతాబ్దినుండి ఆంధ్రదేశంలో కాపులు లేక వ్యవసాయదారుల పేర్ల చివర 'రట్టగుడి' పదం కనిపిస్తున్నది. ఉదాహరణకు - క్రీ.శ. 6-7 శతాబ్దాల నాటి శాసనాల్లో 'అరవళమహేంద్రరట్టగుడి', 'పల్లవ రట్టగుడి', 'చల్కిరట్టగుడి' మొదలైన ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఒక కన్నడ శాసనంలో 'కొమ్మయరట్టగుడి' అనే పదం ఉంది. 'కుడియన్' అనే మాటకు కాపు అనే అర్థం ఉంది. 'కుడి' నుంచే 'కుడియన్ ఉద్భవించింది. నేటికీ ఆంధ్రదేశంలో రెడ్లను 'కాపోళ్ళు' అని పిలవడం విదితమే. రెడ్లు అందరూ కాపులే. కాని కాపులందరూ రెడ్డి కాదు. 'రట్టగుడి' పదమే క్రమేణ 'రటోడి'గా మారిందనడానికి తగిన శాసనాధారాలున్నాయి. క్రీ.శ. 10వ శతాబ్ది నాటి కందుకూర శాసనంలో 'రటోడి కాపులు' అనీ, అదే కాలానికి చెందిన గురిందగుంట శాసనంలో 'భీమరట్టోడి', 'రటోడికి ఏను రూకలు' ప్రయోగాలు కనిపిస్తాయి. తూర్పు చాళుక్యుల నాటి కొన్ని శాసనాల్లో 'రట్టోడి చేను', 'రట్టోడి తోట' మొదలైన శబ్దాలు కనిపిస్తున్నాయి.
రట్టోడి పదమే 'రట్టడి', 'రడ్డి' అనే రూపాంత రాలు చెంది చివరికి 'రెడ్డి'గాస్థిరపడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
క్రీ.శ. 10వ శతాబ్ది నాటి గొంకరాజు శాసనంలో 'రట్టడి' అనే పదం ఎలా ప్రయోగించబడిందో చూడండి - శ్రీ భీమేశ్వర మహాదేవరయాన దీని సాక్షి కరెప్పన విట్టపరట్టడి యుంబోని రట్టడియుం నడుకుదిరి సురపరట్టడియుం ఆన్దపురి అయితమ రట్టడియుం...." క్రీ.శ.12వ శతాబ్ది నాటి శాసనంలో 'యంగిరట్టడి', 'ఏరుయమ రట్టడి' అనే పేర్లు ఉన్నాయి (నెం. 114 శిలాశాసనాలు 1917). ఈ శతాబ్దానికి చెందిన మరికొన్ని శాసనాల్లో పేర్ల చివర 'రడ్డి' అనే పదం కనిపిస్తున్నది. ఉదాహరణకు - సూరపరడ్డి, పోతిరడ్డి(ద.భా.శా. IV నెం.762), బొలిరడ్డి కుమారుడు సూరపరడ్డి (నెం.790). 1117 నెంబరు శాసనంలో "కాకతిరాజ్య సమథునం
రేచరుద్రిరః" అనే ప్రయోగం కనిపిస్తున్నది. క్రీ.శ. 12వ శతాబ్దినాటి శాసనాల్లోనే రెడ్డి పదం - కేతిరెడ్డి, ముత్తిరెడ్డి మొదలైన పేర్లకనిపిస్తున్నది.
పైన పేర్కొన్న ఈ రూపాలన్నీ కేవలం శాసనాల్లోనే కాకుండా కావ్యాల్లో సైతం కనిపిస్తున్నాయి, మల్లికార్జున పండితారాధ్యులు
రచించిన శివతత్వసారం, కృష్ణదేవరాయలచే విరచితమైన ఆముక్తమాల్యద, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం, మల్లాది ప్రణీత శివధర్మోత్తరం, తంజావూరు రఘనాథరాయల రామాయణం మొదలైన కావ్యాల్లో పైన ఉదహరించిన ప్రయోగాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత 'రెడ్డి' అనే శబ్దంతో పాటు 'రడ్ఢి' అనే పదం కూడా క్రీ.శ. 17వ శతాబ్ది దాకా వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది.
క్రీ.శ. 16వ శతాబ్దికి చెందిన తెలుగుకవి అయిన తెనాలి రామకృష్ణ తన రచనల్లో 'రడ్డి' అనే పదం ప్రయోగించాడు. అలాగే ,
17వ శతాబ్దికి చెందిన మల్లారెడ్డి కూడా తన రచనల్లో 'రడ్డి' గానే పేర్కొన్నాడు.
క్రీ.శ. 7వ శతాబ్ది నుండి కోస్తా ఆంధ్రలో లభ్యమైన కొన్ని తామ్రశాసనాల్లో రాష్ట్రకూట ప్రముఖాన్" అనే ప్రయోగం కనిపిస్తోంది. ఉదాహరణకు- క్రీ.శ. 632 వాటి మొదటి విష్ణువర్ధనుని చీపురుపల్లి శాసనంలో "రాష్ట్రకూట ప్రముఖాన్ కుటుంబంలో"అనీ, మొదటి విజయాదిత్యుని శాసనాల్లో "గొమ్మలూరు నామ గ్రామ మధివాసతో రాష్ట్ర కూట ప్రముఖాన్ కుటుంబాన స్పర్వాన్", దినకాడు నామ గ్రామమధివాసతో రాష్ట్రకూట ప్రముఖాన్ కుటుంబాన స్పర్వాన్" మొదలైన ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఈ శాసనాల్లో కనిపించే రాష్ట్ర కూట ప్రముఖాన్ కుటుంబవం" అనే సంస్కృత వాక్య ప్రయోగానికి, శాసన పరిశోధకులు ఆంగ్లంలో
"సోల్జర్స్ , ది హెడ్స్ ఆఫ్ ప్రావిన్సెస్" అని అనువాదం చేశారు. అంటే గృహస్తులైన రాష్ట్రాల యొక్క పెద్దలు లేక నాయకులు అని వారి సూచన. కాని ఈ అర్ధం సరైనది కాదని కుందూరి ఈశ్వరదత్తు గారు వాదిస్తున్నారు. ఆయన అభిప్రాయంలో దీని భావం "కర్షకులైన రట్టడి శ్రేష్టులు, లేక రెడ్డి ప్రముఖులు" అని. రాష్ట్రకూట అంటే గ్రామాధికారి లేక పన్నులు వసూలు చేసే
ఉద్యోగి అని, మహారాష్ట్ర దేశంలోని దేశపాండ్య దేశముఖ్ అనే పదవులను పోలిందని పి.వి. వైద్యా పండితుడు చెప్పాడు. వైద్యా అభిప్రాయమే ఆమోదయోగ్యంగా ఉంది.
రాజులు భూదాన శాసనాలు రాయించే టప్పుడు, ఈ రాష్ట్ర కూట ప్రముఖులను
ఆహ్వానించి వారి సమక్షంలో దానం చేసేవారు. వీరికి ఒకటి లేదా పెక్కు గ్రామాలపై ఆధిపత్యం ఉండేది. రెడ్డి వచ్చే మొదలాడుఅనే మాట ఆనాడు గ్రామాలలో వారు పొందిన గౌరవాన్ని తెలియజేస్తున్నది.పై అంశాలను బట్టి రాష్ట్రకూట అనేది ఉద్యోగ నామమనీ, దాన్ని వంశనామంగా స్వీకరించారని చెప్పవచ్చు.
క్రీ.శ.8వశతాబ్ది నుండి 10వ శతాబ్ది దాకా అంటే సుమారు రెండు శతాబ్దాలు దక్కన్ లో ప్రముఖ పాత్ర వహించిన వారు రాష్ట్రకూటులు.రాష్ట్ర కూటుల (క్రీ.శ. 696-966)
మూల పురుషుడు మొదటి ఇంద్ర రాజు (క్రీ.శ.696-710) మొదట్లో చాళుక్య వంశ సామంతులుగా ఉండేవారు.
వీరి జన్మస్టలి కన్నడ దేశం. అయితే రాష్ట్ర కూట పదం కంటే "రట్టకుడి" పదం ప్రాచీనమైనదిగా కనిపిస్తున్నది. కాబట్టి "రట్టకుడికి సంస్కృతీ కరణమే రాష్ట్రకూటు" అని చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో రెడ్డి వంశీయులు మొదట్లో రాష్ట్రకూటులే నని చరిత్ర కారులు భావిస్తున్నారు.
తర్వాత కాలంలో ఇరు వంశీయులూ తమ శక్తి సామర్థ్యాలతో స్వతంత్ర రాజ్యాలను స్థాపించి ప్రభువులయ్యారు.
అయితే ఈ రెండు రాజవంశాల మధ్య గల సంబంధమేమిటో ఖచ్చితంగా చెప్పలేము. అయితే రెడ్లు తాము రాష్ట్రకూటుల బంధువులమని ఎక్కడా చెప్పుకోకపోవడం గమనార్హం.
దక్షిణాపథంలో 'రట్ట' జాతి వారున్నట్లు అశోకుని శాసనాల నుండి తెలుస్తోంది. అశోకుని శాసనాల్లో రాష్ట్రక, రాత్రిక, రిష్టిక రూపాలున్నాయి. భారవేలుని హాతిగుంఫా శాసనం రఠికులను పేర్కొంటున్నది. రట్టులనే వారు ఆంధ్రులలో విలీనమైన ఒక ప్రాచీన జాతి అని చెప్పవచ్చు. ఈ జాతి పేరు మీదుగానే - అరట్ట, సురట్ట, మరట్టు రట్టపాడి - అనే కొన్ని ప్రాంతీయ విభాగాల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. శాతవాహన సామ్రాజ్య పతనానంతరం రాజకీయ ఐక్యత పూర్తిగా విచ్ఛిన్నమై దేశం ఆర్ధికంగా సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో, అంటే క్రీ.శ. 300-600 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ రట్టుల ప్రస్తావన కనిపించదు.బహుశా ఆ కాలంలోనే వీరు ఆంధ్రదేశంలో విభిన్న ప్రాంతాల్లో స్థిరపడి, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తూ క్రమంగా ఆర్ధికంగా నిలదొక్కుకొని గ్రామ ప్రముఖులై క్రీ.శ.7వ శతాబ్ది నాటికి రాజకీయాల్లో ప్రవేశించి ఉంటారని చరిత్ర కారులు భావిస్తున్నారు.
రెడ్లది కష్టపడి పనిచేసే తత్వం.శారీరక శ్రమ చేయడంలో నేర్పరులు. ముఖ్యంగా వీరు పశ్చిమాంధ్రలోని కొండ ప్రాంతాల్లో స్థిరపడి, గ్రామాలపై పెత్తనం సంపాదించ గలిగారు. ఆ విధంగా రెడ్డి అంటేనే గ్రామాధి కారికి పర్యాయపదమైంది. కఠినమైన పీఠభూమిని సైతం వారు దున్ని, దోకి సస్య శ్యామలం చేయగలిగారు. పంటలు పండించే వారు కనుకనే వారు పంట రెడ్లు అయ్యారు. వారు స్థిరపడ్డ ప్రాంతాలను బట్టి, పంటరెడ్లు కూడా శాఖోపశాఖలుగా చీలిపోయారు. కనుకనే ఈనాటికీ, తెలంగాణా, రాయలసీమలో రెడ్లు ప్రధానమైన గ్రామీణ కులంగా ఉన్నారు. వ్యవసాయం, రాజకీయాలు వీరికి ఈనాటికీ పక్క పక్కనే నడుస్తున్నాయి.
చాలామంది రెడ్లు రాజ్యాల్ని ఏలినారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది
భూస్వాములుగా,రాయలసీమలో కృష్ణదేవరాయల కాలం నుండి పాలెగాళ్ళుగా ఉన్నారు. ఎక్కువ భాగం వీరిలో గ్రామ పెద్దలుగా ఉండేవారు. ఈ గ్రామ పెద్దలను రెడ్డి అంటుంటారు. వేరే కులస్థులు ఎవరైనా గ్రామ పెద్దగా ఉంటే వారిని కూడా రెడ్డి అని అంటుంటారు. వీరు పన్నులు వసూలు చేస్తుంటారు. గ్రామరక్షణ చూస్తుండేవారు. ప్రభుత్వంతోనూ, బయటవారితోనూ వ్యవహారాలను నడుపుతూ ఉండేవారు.రాజకీయాలలో వీరి పాత్ర అధికం.
కొంతమంది చరిత్రకారుల ప్రకారం క్రీ.పూ. 200లో దక్కను పర్వత కనుమలలోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారు. రెడ్లు రాష్ట్ర కూటులనుంచి వచ్చారని చరిత్రకారులన్నారు. రాష్ట్రకూటులు రాష్ట్రిక్ వంశం నుంచి వచ్చారని కూడా చెపుతారు. రాష్ట్రకూటులు రాట్టులుగా, రాట్టులు కాలక్రమంలో రెడ్డిగా మారినారని చెపుతారు.
కొంత మంది చరిత్రకారుల ప్రకారం రెడ్డి వర్గం వారిని రఠి వర్గం అంటారని, శాతవాహనులు, మౌర్య చక్రవర్తుల కంటే ముందు అనగా క్ర్రీ.పూ.200లో కాపు అనే వర్గం లోని రాయల కాపు, పాకనాటి కాపు, మొరస కాపు, పంట కాపు,మున్నూరు కాపు,దేసురి కాపు, పొంగలనాటి కాపు, ఓరుగంటి కాపు, మొటాటి కాపు, కొన కాపు, వెలనాటి కాపు, నేరేడు కాపు, అయోధ్యా కాపు, భూమంచి కాపు, కుంచేటి కాపు, గోధాటి కాపులుగా వేరు పడి రెడ్డి వర్గంగా మారి దక్కను పర్వత కనుమల లోని చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించారని పేర్కొన్నారు. వీరు ఉత్తర ఆంధ్రప్రదేశ్, కర్నూలు, పూనె దగ్గరి ప్రదేశాలలో నివసించారని పురావస్తు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
క్రీ.శ. 7,8 శతాబ్దాల నుంచి తెలుగు గడ్డ మీద
"రట్టగుడి " పేరిట చిన్న గ్రామాధికారులు ఉండేవారు. ఈ రట్టగుడి శబ్దం నుండే రట్టోడి, రట్ట, రడ్డి, రెడ్డి అనే రూపాలు పుట్టాయి.చిన్న చిన్న భూభాగాలకు అధికారులై వాటిని గుత్తగా అనుభవిస్తున్న వాళ్లని రట్టగుట్టలు, రట్టగుడ్లు అని పిలిచేవారు. వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం. రట్లడులకు నిధి, నిక్షేపము, జలము, పాషాణములు, అక్షిణి, ఆగామి, సిద్ధమి, సాధ్యము ఇలా ఎనిమిది రకాల హక్కులు తమ భూములపై ఉండేవి. ఆ కాలంలో రట్టడలు ఒకరకంగా ఆర్ధిక వ్యవస్థలు.ఆదిలో వృత్తివాచకమైన " రడ్డి " పదం తర్వాత జాతి వాచకమైంది.
చాలా ప్రాంతాలలో గ్రామ పెద్దగా వుండే వారిని "రెడ్డి"గా వ్యవహరిస్తారు. కాలగమనంలో వారి అనుచరులు రెడ్డి గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈవిధంగా కూడా రెడ్డి వర్గం ఏర్పడిందని చెప్పవచ్చు. భారత దేశం, తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో రెడ్ల పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఒక రెడ్డి వందమందితో సమానం అని నానుడి వుంది.
కాకతీయుల కాలం (1050-1076)లో గ్రామ పెద్దను గౌరవవాచకంగా 'రెడ్డి' అని
సంభోదించేవారు. కాకతీయులు స్వతంత్ర రాజులయ్యాక రెడ్డి హాదాతో వున్నవారు చాలామంది సామంతరాజులుగా వీరి దగ్గర ఉండేవారు. కాకతీయులు చాలామంది రెడ్డి ప్రముఖులను ప్రధాన హెూదాలలో, సైనికులు గానూ నియమించే వారు. అప్పట్లో ప్రసిద్ధిచెందిన వారు మునగాల రెడ్లు, కాకతీయ ప్రతాపరుద్రుని క్రింద సామంతరాజులుగా మునగాలకు చెందిన అన్నయిరెడ్డి జమీందారుగా ఉన్నట్లు చరిత్ర చెపుతోంది.
కాకతీయుల తరువాత విజయనగర సామ్రాజ్యంతో పాటు రెడ్డి రాజులు వచ్చారు.
సామంతులుగా ఉన్న రెడ్డిరాజులు స్వతంత్రుల య్యారు. అయితే వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం ఉండేది. కానీ బహమనీ సుల్తానులు వీరిద్దరికి ఉమ్మడి శత్రువు అయ్యారు. దాంతో వారిద్దరు ఒక్కటైనారు. విజయనగర రాజు 2వ హరిహరుడు తనకుమార్తెను కాటయవేమారెడ్డి కుమారుడు కాటయకిచ్చి వివాహం చేసినాడు. రెడ్డిరాజులు అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు.
రెడ్డిరాజులు కళింగ (నేటి ఒరిస్సా)పై దండెత్తి వాటిని వశపరుచుకొన్నారు. కళింగ గజపతి కపిలేంద్ర వీరిపై పోరాడాడు. కానీ విజయనగర రాజులు రెండవ దేవరాయల సాయంతో వీరభద్రారెడ్డి కపిలేంద్రను ఓడించాడు. వీరభద్రారెడ్డి మరణం తరువాత గజపతి కపిలేంద్ర వీరభద్రరెడ్డి ఆధీనంలో వున్న రాజమహేంద్రవరం (నేటి రాజమండ్రి)ను స్వాధీనం చేసుకున్నాడు. గజపతుల పతనం తరువాత గతంలో వున్న రెడ్డిరాజ్యాలన్నీ విజయనగర సామ్రాజ్యం ఏలుబడిలోకి వచ్చాయి.
విజయనగర రాజుల కాలంలో రెడ్లను సైన్యాధి పతులుగా నియమించు కున్నారు. ఈ రెడ్లు తమ స్వంత సైన్యాలనుఏర్పాటుచేసుకొని విజయనగర సామ్రాజ్యానికి పెట్టని కోటలుగా ఉండేవారు.వీళ్ళనే పాలెగాళ్ళు అన్నారు. వీరు యుద్ధాలలో పాల్గొనేవారు. శాంతి సమయంలో గ్రామాలలో పన్నులు వసూలు చేసి రాజు ఖజానాకు చెల్లించేవారు.
బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొచ్చిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఒక పాలెగాడుగా ఉండేవాడు. రాయలసీమలో రెడ్లు ఆధిపత్యంలో ఉండేవారు.
విజయనగర సామ్రాజ్య పతనం తరువాత పాలెగాళ్ళు స్వతంత్రులయ్యారు. వీరికి స్వంత సైన్యం ఉండేది. ఈ పాలెగాళ్ళ మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగేవి. దాన్నే నేడు మనం ఫ్యాక్షన్ అంటున్నాం.ఇప్పుడు రాయలసీమ లో ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైంది.
తెలంగాణాలో రెడ్లు వివిధ సంస్థానాధి పతులుగా ఉండేవారు. గోల్కొండ సుల్తానుల పాలనలో వీరంతా సామంత రాజులుగా వ్యవహరించేవారు. రామకృష్ణారెడ్డి, పెద్ద వెంకటరెడ్డి, ఇమ్మడి వెంకటరెడ్డి మొదలైన వారు ప్రముఖులు. ఇమ్మడి వెంకటరెడ్డి గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షాకుమద్దతుగా తన సైన్యాన్ని తరచూ పంపించే వాడు. మహబూబ్ నగర్ జిల్లాలో పంగల్ కోటను వీర కృష్ణారెడ్డి నిర్మించాడు. గద్వాల సంస్థానాన్ని కోటను రాజా సోమతాద్రి నిర్మించాడు. నిజాం పాలనలో రెడ్లు ప్రధానాధి కారులుగా, గ్రామపోలీసులుగా, పన్ను వసూలుదార్లుగా పనిచేసేవారు.నిజాం ఏలుబడిలో రెడ్లు దేశ్ ముఖ్ లుగా ఉండేవారు. వీళ్ళను పటేల్ అని, దొరలని పిలిచేవారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి నిజాం పాలనలో కొత్వాలుగా పనిచేసినాడు.
నిజాం ఏలుబడిలో ఒక అధికారిగా నియమించబడిన హిందువు ఇతనొక్కడే.
అదే సందర్భంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల్లో రావి నారాయణరెడ్డి,
బద్దం ఎల్లారెడ్డి మొదలగువారు కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. ఆంధ్రమహాసభను నిజాంవ్యతిరేక సభగా మార్చి సాయుధ పోరాటం చేసిన యోధులువారు. అయితే చాలామంది తమపేర్ల చివర కుల సంబంధ రెడ్డి పదాన్ని తీసివేసి కులాతీతంగా జీవించిన వారెందరో ఉన్నారు.
వేమారెడ్డి ప్రజాకవి వేమనగా మారినాడు. పుచ్చలపల్లి సుందరామిరెడ్డి కామ్రేడ్ సుంద రయ్యగా మారినాడు.కొండపల్లిసీతారామయ్య కూడా అదేవిధంగా మారినాడు. ఇలా తమ పేర్ల చివర తమకులచిహ్నాన్ని వదులుకోవడం చాలా సాహసోపేతమైనది. కుల సంఘాలు విపరీతంగా పెరిగి కుల వైషమ్యాలు పెరుగుతున్న సందర్భంలో ఇలా కులచిహ్నాలను వదలుకోవటం ఎంతో ఆదర్శమైనది.
రెడ్డి చరిత్ర:
ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాని కి వచ్చి స్తిరపడ్డ రాష్ట్రకూటు లే రెడ్లు గా పిలువబడినారని శాసనాల ఆదారం గా తెలుసుకున్నాము.దక్షిణాని కి వచ్చిన తర్వాత రాష్ట్రకూటులు చాలుక్యుల కాలం లొ గ్రామ పెద్దలు గా పనిచేసారు.ఆ తర్వాత కాకతీయుల కాలం లొ సైనిక అదికారులు గా మరియు సామంత రాజులు గా పని చేసారు.ఇనగాల బమ్మి రెడ్డి,రేచెర్ల నామి రెడ్డి,బేతి రెడ్డి మరియు రుద్రి రెడ్డి లు సైనిక అధికారులు గా పని చేసినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది.
కాకతీయులు కూడా రాష్ట్రకూటులేనని క్రిష్ణా జిల్లా మాగల్లు శాసనం మరియు ఖమ్మం జిల్లా బయ్యారం శాసనాలు తెలియజేయుచున్నాయి.బయ్యారం శాసనం గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించినది.మాగల్లు శాసనం చాలుక్య రాజు దనర్నవ వేయించాడు.మాగల్లు శాసనంలో కాకతీయ పాలనకు మూలపురుషుడైన కాకర్త్య గుండన పూర్వీకులు రాష్ట్రకూటులని పేర్కొనబడినది.
రెడ్డి పదోత్పత్తి 7 వ శతాబ్దం నుంచి రక రకాలు గా పేరు మార్చుకుంటు వస్తుంది.మొదట 7 వ శతాబ్దం లొ రట్టగుడి గా, తర్వాత రట్టొటి,రాథొడ్, రట్టాడి, రట్టజికము, రద్రికము,రడ్డి గా మారుతూ వచ్చి చివరకు రెడ్డి దగ్గర స్తిరపడింది.
క్రీ.శ.641 వ సంవత్సరము నకు సంబందించిన గుంటూరు జిల్లా మాచర్ల శాసనం లో రట్టగుళ్ళు గా పేర్కొనబడినది.
9 వ శతాబ్దము నకు సంబందించిన వరంగల్ జిల్లా లోని కొండపర్తి శాసనం లో పొలమెయరట్టోడి గా పేర్కొనబడినది.పొలమెయరట్టోడి అనేది గ్రామ పెద్ద లేదా అధికారి పేరు అయ్యి వుండొచ్చు.ఈ శాసనము భూమి కౌలు కు సంబందించిన ఒప్పందము గురించి తెలియ చేస్తుంది.
1065 వ సంవత్సరము ప్రాంతము లో రెడ్లు రడ్డిగా పిలవబడినట్లు మెదక్ జిల్లా లోని ములుగు గ్రామము వద్ద లబించిన కల్యాణి చాళుక్యు లకు సంబందించిన శాసనం తెలియజేయుచున్నది.ఈ శాసనము 1065 సంవత్సరమునకు సంబందించినది.ఈ శాసనము ప్రకారము కదిరడ్డి మినిరడ్డి ని గ్రామ పెద్ద గా నియమించినట్లు పేర్కొనబడినది.
12 వ శతాబ్దం నాటికి ఇప్పుడు పిలువబడుతున్న "రెడ్డి" పదం వాడకం లోకి వచ్చినట్లు పిల్లలమర్రి శాసనాల ద్వార తెలుస్తుంది.
పిల్లలమర్రి తూర్పు దిక్కు శాశనం ప్రకారం రేచెర్ల నామిరడ్డి 1117 రాక్షస సంవత్సర వైశాఖశుక్ల త్రయోదశి నాదిత్యవారమునాండు తన పేరు మీద మరియు తల్లిదంద్రుల పేరు మీద శ్రీకామేశ్వర, శ్రీకాచేస్వర శ్రీనామెశ్వర దేవాలయాలను ప్రతిష్టించినట్లు పేర్కొనబడినది.
పిల్లలమర్రి దక్షిణం దిక్కు శాశనం ప్రకారం రేచెర్ల నామిరడ్డి 1124 శ్రీ దుందుబి సంవత్సర చైత్ర శుక్ల చతుద్దషి శనైశ్చరవారం నాడు శ్రీమన్నామేశ్వరం గుడిని ప్రతిష్టించినట్లు పేర్కొనబడినది.
పిల్లలమర్రి పడమర దిక్కు శాశనం ప్రకారం రేచెర్ల బేతిరెడ్డి భార్య ఎఱుక సానమ్మ గారు 1130 విభవ సంవత్సరము జ్యేష్టశుద్ద మూడవ సోమవారం నాడు శ్రీఎఱకేశ్వర గుడిని ప్రతిష్టించినట్లు పేర్కొనబడినది.
నల్లగొండ జిల్లా జలాల్ పురం శాశనంలో గణపతిదేవుని సామంతరాజు చెరుకు బొల్లయ రెడ్డి వంశం గురించి తెలుపబడినది.ఈ శాశనం క్రీ.శ.1202 సంబందించినది.చెరుకు వంశీయులు నల్లగొండ జిల్లా జమ్ములూర్ మరియు మహబూబ్ నగర్ జిల్లా అమరాబాద్ కేంద్రాలుగా క్రీ.శ.1158 నుంచి క్రీ.శ.1323 వరకు
పరిపాలించారు.
రెడ్లు క్షత్రియులు అనడానికి అనేక అదారములు లభించెను.
హంపి న్రుసింహాలయ శాసనంలో ప్రోలరెడ్డి తనను శ్రీరామవంశ సంభవ సుమిత్రపౌత్ర రాష్ట్రకూట రాజు గారి వంశమున పుట్టినవానిగా చెప్పుకున్నాడు.
మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ శాసనం లో గోన బుద్ధారెడ్డి సూర్యవంశీయుడు గా పేర్కొనబడినది.తిరువల్లూరు లొని వీర రాఘవస్వామి ఆలయములోనున్న పెద కోమటి వేమారెడ్డి శాసనంలో తాను సూర్యవంశస్తుడిగా పేర్కొన్నాడు.శ్రి వైకుంట విష్ను క్షేత్రము నందు వున్న శాసనము లో రాజమహేంద్రవరపు నాగిరెడ్డి తనను సూర్యవంశీయుడిగా పేర్కొన్నాడు.పట్టమెట్ట సోమనాథ సోమయాజి సూత సంహిత అను పద్య కావ్యాన్ని రాసి దోమకొండ సంస్థానాదీషుడైన కామారెడ్డి కి అంకిత మిచ్చెను మరియు బ్రహ్మోత్తర ఖండ అనే కావ్యాన్ని రాసి కామారెడ్డి సోదరుడైన యెల్లారెడ్డి కి అంకితమిచ్చెను. పట్టమెట్ట సోమనాథ సోమయాజి సూత సంహిత కావ్యంలో దోమకొండ సంస్తానాదీషుడగు కామారెడ్డి ని సూర్యవంశీయుడు గా పేర్కొన్నాడు.గద్వాల సంస్తానాదీషుడైన చిన సోమభూపాలుని(1752-1793) ఆస్తాన కవి అయిన కాణాదం పెద్దన సోమయజి ఆద్యాత్మ రామాయణం కావ్యములో చిన సోమభూపాలుని పూర్వీకుడైన సోమభూపాలుని సోమవంశజుడిగా చెప్పియున్నాడు.
రెడ్లలో శాఖలు :
రెడ్ల లొ అనేక శాఖలు ఉన్నవి.అందులొ మొటాటి, పాకనాటి,వెలనాటి,గుడాటి, పంట(దేసటి),పెడకంటి,కుంచేటి, రేనాటి,ఓరుగంటి,భూమంచి మొదలైనవి తెలుగు ప్రాంతాల్లొ వినిపిస్తుంటవి.ఇందులొ కొన్ని నివాస ప్రాంతాల పేర్లతో యేర్పడితె మరికొన్ని కట్టుబాట్లు మరియు నడవడిక తో యేర్పడినట్లు తెలుస్తుంది.
మొటాటి (మొట్టనాడు),పాకనాటి (పాకనాడు), వెలనాటి (వెలనాడు),
రేనాటి( రేనాడు) ప్రాంతాల ఆదారం గా ఎర్పడినట్లు తెలుస్తుంది.
పాకనాడు,రేనాడు మరియు వెలనాడు రెడ్లు:
పాకనాడు, వెలనాడు, రేనాడు అనేవి ఒకప్పుడు తెలుగు చోళులు పరిపాలించిన రాజ్యాల పేర్లు.గుంటూరు జిల్లాలోని నరసారావుపేట,గురజాల మరియు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాలను కలిపి పల్నాడు సీమ అంటారు.గోదావరి, పెన్నా నదుల మద్య ఉన్న రేపల్లె మరియు తెనాలి ప్రాంతాలను కలిపి వెలనాడు అంటారు.నెల్లూరు చుట్టు ప్రక్కల ప్రాంతాలను పాకనాడు అంటారు.కడప ప్రాంతాన్ని రేనాడు చోలులు పాలించినారు అందుకే ఈ ప్రంతాన్ని రేనాడు గా పిలుస్తారు.
పాకనాడు,రేనాడు మరియు వెలనాడు తొ ప్రాంతాలు ఉండడం వలన పాకనాటి రెడ్లు , రేనాటి(రేనాడు) మరియు వెలనాటి రెడ్ల విషయంలో స్పష్టత వచ్చింది.
మొటవాడ (మొటాటి) రెడ్లు:
తెలంగాణ ప్రాంతం తో పాటు కర్నూలు,క్రిష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఎక్కువ గా ఉన్నటువంటి మొటవాడ (మొటాటి) రెడ్లు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాలి.
కవి రెడ్రెడ్డి మల్లారెడ్డి (1650-1700) ప్రాంతం లొ రాసిన పద్యం లొ తాను మోటవాడ వంశానికి చెందిన వ్యక్తి గ చెప్పుకున్నాడు.అంతేకాకుండ తన తాత గ్రామ చౌధరి గా పనిచేసినట్లు పేర్కొన్నాడు.
"ప్రోల్వాల గోత్ర పవిత్ర కోనమదేవి
కళత్ర మోటవాడ వంశ వారాశిజనిత కైరవమిత్ర
బుధ బంధు సుకవిజన స్తొత్ర" - రెడ్రెడ్డి మల్లారెడ్డి
"ప్రోల్వాలగోత్ర సంపూర్ణాభిచంద్రుడు
మల్లభూనాధుండు మాన్యయశుడు
అందలంబును తశ్రీపు లందుకొనుచు
సరస బూర్గులపట్టణ చౌధరగుచు
ప్రజల బాలించె భూభుజుల్ ప్రస్తుతింప" - రెడ్రెడ్డి మల్లారెడ్డి
సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం అలంపూర్ ను పాలించిన రెండవ తిమ్మ భూపాలుడు (తిమ్మ రెడ్డి) తాను మొట్టవాడ కు సంబందించిన వ్యక్తి గా పద్యాల్లొ రాసుకున్నాడు.దీన్ని బట్టి మొట్టవాడ నె మొటాటి అని,ఇది ఒక ప్రాంతానికి సంబందించిన పేరు అని తెలుస్తుంది.
"అట్టి గంగ కు తోబుట్టువగు చతుర్ధ
జాతియందు నితాంత విఖ్యాతిదనరు
చున్న మొటవాడకులమున నొప్పు మీరే
చాల బిజ్జుల దాద భూపాలమౌలి" --- తిమ్మ భూపాలుడు
మొట్టవాడ అనే పేరు కు దగ్గరగా పోల్చిచూస్తె వరంగల్ పట్టణంలో మట్టెవాడ అని ఒక ప్రధానమైన వీది ఉన్నది.మొట్టవాడ రెడ్లు మట్టెవాడ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారని స్వర్గీయ సురవరం ప్రతాప రెడ్డి గారు అబిప్రాయపడినారు.సురవరం ప్రతాప రెడ్డి గారు ఇంకా కొంతకాలం జీవించి ఉంటె మొటాటి శాఖ విషయం లో పూర్తి స్పష్టత వచ్చి ఉండెది.
అయితే మొటవాడ ను పోలిన మరో ప్రాంతం పేరు మొట్టవాడినాడు.ఒకప్పటి పల్నాడు సీమలో బాగంగా ఉన్న మార్కాపురం ప్రాంతాన్ని మొట్టవాడినాడు గ పిలిచేవారు.దీనిని బట్టి అలోచిస్తే మొటవాడ (మొటాటి) రెడ్లు పల్నాడు ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చు అనేదానికి కొంత బలం చేకూరుతుంది.అయితే పల్నాడు లో తరచుగా జరిగెడి యుద్దాలవలన మొటాటి రెడ్లు కొందరు తెలంగాణా ప్రాంతాలకు తరలివెల్లి వుండొచ్చు.
కొనిదెన (కాట్యదొన) 1150 సంవత్సరం శాసనం లో త్రిభువనమల్లదేవ పొత్తపి చోడ మహరాజు కమ్మనాడు, గుండికర్రు మరియు మొట్టవాడి ప్రాంతాలను జయించినట్లు పేర్కొనబడినది.మొట్టవాడి-నాడు గురించి కల్యాణి చాలుక్యుల సంబందించిన త్రిపురాంతకం ఆలయ శాసనం లో చెప్పబడినది.త్రిపురాంతకం ఆలయ శాసనం ప్రకారం మొట్టవాడి-నాడు లో కవలకుంట,రాచగొండ,సతకోడు, ముత్తువాలు, కంభంపాడు,మ్రానెపల్లి, మేడపి,గుట్టలపల్లి, మిరియంపాడు మరియు దువ్వలి మొదలగు గ్రామాలు ఉండెవి.బాపట్ల శాషనంలో కూడా మొట్టవాడి గురించి ప్రస్తావించబడినది.బాపట్ల శాసనం ప్రకారం మొట్టవాడి-నాడు యొక్క త్రిపురాంతక ఆలయానికి పుల్లలచెరువు అనే గ్రామాన్ని ఇచ్చినట్లు వ్రాయబడినది.
కమ్మనాడు క్రింద ప్రెంపల్లి,మధుకంబల్లి, పల్లమెట్ట, ఉప్పుగుండురు, పెద్ద గంజాం,
కదకుడురు, కురవద, పయుందొర్రు, చిన్న గంజాం,కణుపరితి, పులిచెరువు, కోత్యదొన, అక్కరజు చెరువు,బల్లికురువ, గుందియపుండి, జొన్నప్రాలురు, అమ్మలపుండి,ఎద్దనిపుండి, రామకురు,చెంజెర్వు, కొప్పరం,సోఘరేవు మొదలగు గ్రామాలు ఉన్నట్లు ఇతర అదారాలను బట్టి తెలిస్తుంది.
పంట రెడ్లు:
12,13 వ శతాబ్దంలలో పంట రాజ్యము నెల్లూరు చోడుల పరిపాలనలో భాగం గా వుండెది.పంట రాజ్యము లో నివశించినవారె పంట రెడ్లు గా పిలవబడియుంటారని చరిత్రకారులు అబిప్రాయపడినారు.
అల్లయ వేమారెడ్డి శాశనము లో ఇలా పేర్కొనబడినది.
పంట కులములో ప్రోల్వాల గోత్రోద్భవుదైన దొడ్డ నరేంద్రుడు జన్మించెను.
మహాకవి శ్రీనాధుడు పల్నాటి వీరచరిత్ర గ్రందం లొ నాగమ్మను పంట రెడ్డి కోడలుగా పేర్కొన్నాడు.
“పంటరెడ్డివారి పణతి యనంగ ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రి
మేకపోతుల రెడ్డి మేనకోడలును ఆరవెల్లి వారింటి అమర కోడలును”
పంట రెడ్డి వంశస్తులు అద్దంకి ని రాజధాని గా చేసుకుని రెడ్డి రాజ్య స్తాపనకు పునాది వేశారు, తర్వాత కొండవీడు కు రాజధాని ని మార్చి పరిపాలనను కొనసాగించారు.ప్రొలయ వేమారెడ్డి,అన వోటారెడ్డి, అన వేమా రెడ్డి,కుమర గిరిరెడ్డి,కటయ వేమారెడ్డి,అల్లాడ రెడ్డి,వీర భద్రారెడ్డి మొదలగు వారు దాదాపు 123 సంవత్సరములు పరిపాలించారు.
కొండవీడు ను పాలించిన రాజులను దేసటి రెడ్లు అనికూడ పిలిచేవారు.దేసటి రెడ్డి(దేశ రట్టొడి నుంచి వచ్చింది) అంటె స్తానిక రెడ్లు అని అర్థం వచ్చును.దేసటి అనేది పంట రెడ్ల లొ ఒక రకం అయ్యికూడ ఉండొచ్చు.
పంట కులము లో పద్నాలుగు రకాలు వున్నట్లు గా 15 వ శతాబ్దపు అరవీడు వంశానికి చెందిన బుక్కరాయల కాలం నాటి భట్టు రాజు చెప్పిన పద్యం ద్వార తెలుస్తుంది.
"పంటాన్వయమునను పద్నాల్గుశాఖల
జక్కగా వివరింతు సత్యమరసి
మొటాటి వెల్నాటి మొరస నేరే డయోద్య
పంట పొంగలినాటి పాకనాటి
భూమంచి కురిచేటి మున్నూటి దేసటి
యొనర గండియకోట యోరుగంటి
యన ఒరగుచునుండు నంధ్రావనీస్థలి
గౌరవాదిష్ఠిత కాపు కులము
పంట పదునాల్గు కులములం చంట జగతి
దర తరంబుల నుండియు వరలెడినుడి
వీనికుపజాతు లున్నవి వివిధములుగ
భుజబలాటోప పిన్నమ బుక్క భూప"
భూమంచి రెడ్లు:
భూమంచి పదం బహుమంచి(చాలా మంచివారు) నుంచి ఏర్పడినట్లు కొందరి అబిప్రాయము.మంచి భూమి ని కలిగి ఉన్నవారు అని మరి కొందరి అబిప్రాయము. భూమంచి రెడ్లు ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాల్లొ ఎక్కువ గ ఉంటారు.
దేశ్ ముఖ్,దేసాయి మరియు చౌధరి :
దేశ్ ముఖ్,దేసాయి మరియు చౌధరి అనేవి రెడ్ల శాఖలు కావు.వివిద హోదాలల్లో పనిచేసిన రెడ్లు రాను రాను అవే తమ శాఖలు గా చెప్పుతున్నారు కాని అవి కేవలము రెడ్ల హోదా మరియు స్తోమతను బట్టి పిలవబడిన పేర్లు మాత్రమే.
దేశ్ ముఖ్, దేసాయి మరియు చౌధరి మొదలగునవి ఉత్తరాదినుంచి తెలుగు ప్రాంతానికి వచ్చినవి.దేశ్ ముఖ్ మరాఠ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తది.దేశ్ ముఖ్ అనే టైటిలు తో కొన్ని గ్రామాల భూముల పైన లేదా కొంత భూబాగం పైన హక్కులు కలిగి ఉన్నవాల్ల ను పిలిచేవాల్లు.దేసాయి దేస అనే సంస్క్రుత పదం నుంచి వచ్చింది. దేస అంటె భూమి(ల్యాండ్).పాలనా పరం గా ల్యాండ్ లార్డ్స్ (జమిందారులు) ను దేసాయి గా పిలిచేవాల్లు.రెడ్రెడ్డి మల్లారెడ్డి పద్యాల లొ చెప్పినదానిని బట్టి చౌధరి అనేది కేవలం ఒక హోదా నే అని అర్థం అవుతుంది.కొంత మంది చౌధరి రెడ్డి శాఖ అని చెప్పుతుంటారు, కాని చౌధరి రెడ్డి అంటే శిస్తు వసూలు చేసే గ్రామ పెద్ద అని మల్లారెడ్డి పద్యాల ద్వార తెలుస్తుంది.
తెలంగాణా లొ దొరలు మరియు పటేండ్లు :
తంజావూరు ను 1600 సంవత్సరము నుంచి 1634 సంవత్సరము వరకు పాలించిన రఘునాథ నాయకులు తను రాసిన రఘునాథనాయకాభ్యుదయం గ్రంధంలొ పాలకులను దొరలు అని సంబోదించారు.పటేలు అనే పదం ఉత్తర భారత దేశం నుంచి వచ్చింది.గుజరాత్ లొ పటేలు అనే పదం దాదాపు 15 వ శతాబ్దం నుంది వాడుకలొ వున్నది.దొర మరియు పటేలు అంటె కులం కాదు కేవలం ఒక హోదా మాత్రమె.తెలంగాణ ప్రాంతంలొ దొర మరియు పటేలు అనే పదాలు నిజాం రాజుల పాలన మొదలైనప్పటి నుంచి అంటే 1724 తర్వాత వాడకంలోకి వచ్చినవి.గ్రామాల్లొ నిర్వహించిన పనినిబట్టి దొర లేదా పటేలుగా పిలువబడినారు.ఒకే కుటుంబం కు చెందిన రెడ్డి వంశీయులు వివిద గ్రామాలకు వలసబోయి స్తానికంగా వున్న పరిస్తితులను బట్టి కొందరు దొరలు గా పిలవబడితె మరికొందరు పటేండ్లు గా పిలవబడినారు.అదేవిదంగా ఒకే కుటుంబానికి చెందిన కొందరు వెలమ వంశీయులు వలసబోయి వేర్వేరు గ్రామాల్లొ కొందరు పటేండ్లు గా మరికొందరు దొరలు గా పిలవబడినారు.అయితే గ్రామాల్లొ నిర్వహించిన పనిని బట్టి దొర లేదా పటేలు గా పిలవబడినారు అంతే కాని వీటికి అంత గా ప్రాముఖ్యత లేదు.ఇంకా చరిత్రను తవ్వితె మెదక్ జిల్లా లోని గట్ల మల్యాల గ్రామం లో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వారు,కరీంనగర్ జిల్లా లోని కథలాపూర్ గ్రామం లో వైశ్యు కులానికి చెందిన వారు మరియు వరంగల్ జిల్లా ములుగు మండలం లోని మదనపల్లి గ్రామం లో లంబాడి కులానికి చెందిన వారు నిజాం రాజు దగ్గర గ్రామాదికారాలు పొంది దొరలు గా పిలువబడినారు.
రెడ్ల ఇంటి పేర్లు మరియు గోత్రాలు :
గోత్రం ముందు పుట్టి తర్వాత ఇంటిపేర్లు వచ్చాయి.రెడ్ల లొ మొత్తం పదివేల ఇంటిపేర్లు వున్నట్లు చరిత్ర కారులు చెప్పుతారు. మొటాటి లొ 360 గోత్రాలు వున్నట్లు మరియు పాకనాటి లొ 120 గోత్రాలు వున్నట్లు రెడ్ల వద్దకు వచ్చె పిచ్చుకుంట్ల వాల్లు చెప్పుతుంటారు.వీరు కుంటి మల్లా రెడ్డి మరియు అనుముల బ్రహ్మ రెడ్డి కథ చెప్పుకుంటు కొన్ని గోత్రాల పేర్లు చదువుతుంటారు.
ఒకే గోత్ర నామం కలిగి ఉన్నవారు వేర్వేరు శాఖ లలో వున్నారు.అల్లయ వేమారెడ్డి శాశనము లో పంట కులములో ప్రోల్వాల గోత్రోద్భవుదైన దొడ్డ నరేంద్రుడు జన్మించెను అని పేర్కొనబడెను.అదే విదం గా మొటాటి శాఖ కు చెందిన మల్లారెడ్డి తనది ప్రోల్వాల గోత్రమని పేర్కొన్నాడు.దీనిని బట్టి ఒకే గోత్ర నామం కలిగి ఉన్నవారు వేర్వేరు ప్రాంతాలకు వెల్లి పోయిన కారణం గా వేర్వేరు శాఖలు గా పిలవబడినారని అర్థం అవుతుంది.
రెడ్ల రాజ్యాలు మరియు సంస్థానాలు:
మునగాల సంస్తానము కాకతీయ రాజ్యం పతనం కాకముందు నుంచే ఉన్నట్లు తాడ్వాయి దగ్గర మల్లికార్జునస్వామి ఆలయంలో లబ్యమైన రెండు శాసనాలు తెలియచేస్తున్నాయి.ఈ శాసనాలు క్రీ.శ 1300 మరియు 1306 కు సంబందించినవి.
మారయ గణపతి రెడ్డి క్రీ.శ 1300 లో మరియు చెరుకు అన్నయరెడ్డి క్రీ.శ 1306 లో మునగాలను పాలించారు.ఈ శాసనాలు ద్వార మునగాల పాలకులు గణపతి రెడ్డి మరియు అన్నయ రెడ్డి ప్రతాపరుద్రునికి సామంతరాజులుగా ఉండినట్లు తెలియజేయుచున్నవి.కొలిన్ మక్కెంజీ (1754-1821,Colin Mackenzie,first surveyor general of India) ప్రకారం మునగాల పాలకుడు గుర్లపాటి అయ్యన్న దేశాయి మరియు అతని కుమారుడు 1693 లో చనిపోయారు, అప్పుడు మునగాల పరగాణ బాద్యతలు అయ్యన్న కోడలు సుభద్రమ్మ చేతికి వెళ్ళాయి.అయితే సుభద్రమ్మకు పాలనలో ఇబ్బందులు తలెత్తడంతో సుభద్రమ్మ సోదరుడైన కీసర ముకుందప్ప పాలన బాద్యతలు చేపట్టాడు.ముకుందప్ప తరువాత అతని కుమారులు సూరన్న మరియు నరసన్న లు కొద్ది కాలం వరుసగా పాలించరు.సూరన్న,నరసన్న ల తర్వాత నరసన్న భార్య లక్ష్మమ్మ మునగాలను పాలించారు.లక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ కుమారుడు కీసర వెంకట్రాం,కీసర వెంకట్రాం కుమారుడు వెంకట నరసిం హ పాలించారు.వెంకట నర్సింహ తర్వాత అతని కుమారుడైన కోదండ రాం అధికారంలోకి వచ్చాడు.కోదండరాం 1814 లో చనిపోయాడు,అప్పటికి అతని కుమారుడైన వెంకట నరసిం హ రావు - 2 మైనరు కావడం వలన పాలన కోర్టు అద్వర్యంలో సాగింది.తర్వాత 1818 లో వెంకట నరసిం హ రావు - 2 పాలకుడైనాడు.వెంకట నరసిం హ రావు - 2 1836 లో చనిపోయిన తరువాత అతని పెంపుడు కుమారుడు కోదండ రామయ్య మైనరు కావడం వలన పాలన రెండవ సారి కోర్టు అద్వర్యంలో 1850 వరకు నడిచింది.కోదండ రామయ్య 1854 లో అకాల మరణం చెందడమువలన, అప్పుడు అతని భార్య రుక్కమ్మ, రుక్కమ్మ మరణం తరువాత కూతురు లక్ష్మమ్మ మునగాలను పాలించారు.లక్ష్మమ్మ నిజాం సంస్తానానికి చెందిన దేశ్ ముఖ్ నాయిని వెంకట రామయ్య ను వివాహం చేసుకున్నారు.లక్ష్మమ్మ కు పిల్లలు లేకపోవడం వలన మానుకోట తాలూక నెల్లికుదురు గ్రామానికి చెందిన నాయిని రాఘవ రెడ్డి గారి మూడవ కుమారుడైన రంగా రెడ్డిని క్రీ.శ 1883 లో దత్తత తీసుకుని రంగా రావు అని పేరు మార్చి పిలుచుకున్నారు.రంగా రెడ్డి క్రీ.శ 1879 లో జన్మించారు.1892 లో లక్ష్మమ్మ చనిపోవడం మరియు రంగారెడ్డీ మైనరు కావడం వలన మూడవసారి పాలన కోర్టు అద్వర్యంలో సాగి తిరిగి 1900 లో రంగా రెడ్డికి పాలన బాద్యతలను కట్టబెట్టింది.నాయిని రంగా రావు గారికి దేశ భక్తి ఎక్కువ.స్వదేశి వస్తువుల మీద మమకారంతో బెజవాడ లో స్వదేశి దుకాణం కూడా ప్రారంబించారు.అంతేకాకుండ బట్టలు నేసే పరిశ్రమ ను కూడా ప్రారంబించారు.నాయిని రంగా రావు గారికి సాహిత్యం మీద చాల మక్కువ.నాయిని రంగారావు గారు రావిచెట్టు రంగారావు మరియు కొమర్రాజు లక్ష్మణ రావు తొ కలిసి శ్రీ క్రిష్ణ దేవరాయ బాషా నిలయం గ్రంధాలయాన్ని 1901 లో ప్రారంబించారు.ఇదే ముగ్గురు 1904 లో వడ్డెపల్లి దేశ్ముఖ్ పింగళి వెంకట్రాం రెడ్డితో కలిసి హన్మకొండ లో రాజ రాజ నరేంద్ర భాషా నిలయం ప్రారంబించారు.1907 సంవత్సరములో గ్రామీణ ప్రాంత విద్యార్తులకోసం "కొండవీడు హాస్టలు" పేరుతో ఒక వసతి గ్రుహాన్ని ప్రారంబించారు.1917 లో నెల్లూరు లో రంగా రావు గారి అద్యక్షతన రెడ్ల మహా సభ జరిగింది.ఆ మహా సభ లోనె రెడ్ల కోసం ఒక సంఘాన్ని ప్రారంబించాలని రంగా రావు గారు చెప్పి విరాళాలు ఇవ్వవలసినదిగా ఆ సభ కు వచ్చిన ప్రముకులను రంగా రావు గారు కోరడం జరిగినది.మూడేల్లలో దాదాపు పది లక్షల విరాళాలు వచ్చాయి.తర్వాత సమావేశాలు 1920 లో నెల్లూరులోనె సి.ఆర్.రెడ్డి అద్యక్షతన జరిగాయి, అవే సమావేశాల్లో నాయిని రంగా రావు గారు అద్యక్షుడి గా రెడ్డి జన సం ఘం యేర్పాటుకావడం జరిగినది.
వర్థమానపురం,బుద్దపురం:
కాకతీయ రుద్రదేవుడు కందూరు చోళులను జయించి ఆ స్థానం లో గోన బుద్దా రెడ్డి ని సామంత రాజు గా నియమించాడు.గోన బుద్దా రెడ్డి రంగనాథ రామాయణం రాసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు.గోన బుద్దా రెడ్డి తర్వాత అతని సోదరుడు గోన లకుమా రెడ్డి మరియు కుమారుడు గోన గన్నా రెడ్డి పరిపాలించారు.
గోన గన్నారెడ్డి మహబూబ్ నగర్ లోని బిజినేపల్లి మండలం, వర్థమానపురం (నేటి వద్దెమాని) మరియు బుద్దపురం(నేటి బూత్పూర్) కేంద్రాలు గా పరిపాలన కొనసాగించారు.గోన గన్నారెడ్డి సోదరి కుప్పాంబను కాకతీయ వంశస్తుడైన మల్యాల గుండ దంఢాదీశునికి ఇచ్చి వివాహం జరిపించారు.గోన గన్నారెడ్డి తర్వాత మల్యాల గుండ వర్థమానపురం మరియు బుద్దపురం లను పాలిచారు.
గద్వాల:
గద్వాల సంస్థానం పాలకులు పాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు.గద్వాల సంస్థానం చాలా పురాతనమైనది.గద్వాల ను విద్వద్గద్వాల గా కూడా పిలిచేవారు. కాకతీయులకు ముందు నుంచె గద్వాల ఉన్నట్లుగా చరిత్ర చెప్పుతుంది.కాకతీయులకు గద్వాల సామంత రాజ్యం గా వుండేది.కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు 1290 ప్రాంతంలో గద్వాల పాలకుడైన బుద్దారెడ్డి కి యేడు సీమల మీద అధికారాలు ఇచ్చి నాడేగౌడ గా నియమించాడు.కాకతీయ రాజ్యం పతనం తర్వాత గద్వాల బహమని సుల్తానులకు ఆ తర్వాత నిజాం రాజుకు సామంత రాజ్యం గా వున్నది.17 వ శతాబ్దంలో పెద్దారెడ్డి కర్నూలు కు నాడేగౌడ గా ఉండేవాడు.పెద్దారెడ్డి మరియు బక్కమంబ ల కుమారుడే పెద్ద సోమభూపాలుడు.పెద్ద సోమభూపాలుడు పూడూరు గ్రామంలో జన్మించాడు.పెద్ద సోమభూపాలుడిని నల్ల సోమనాద్రి అని కూడా పిలిచేవారు.గద్వాల కోటను 17 వ శతాబ్దము చివరన పెద్ద సోమ భూపాలుని కాలము లో నిర్మించారు.పెద్ద సోమ భూపాలుడు కర్నూలు నవాబు ను ఓడించి గుర్తుగా 32 ఫీట్ల పొడవున్న పిరంగి ని తీసుకొచ్చి కోటలో ఉంచారు.పెద్ద సోమభూపాలుడు 1712 వరకు గద్వాలను పాలించాడు.గద్వాల చివరి పాలకురాలు ఆది లక్ష్మి దేవమ్మ 1924 - 1949 సంస్థానాన్ని పాలించారు.
అలంపూర్ / కొండారెడ్డి బురుజు:
కర్నూలు కోటను 1529-1542 వరకు పాలించిన విజయనగర రాజు అచ్యుత రాయని కాలంలో నిర్మించారు.ఆ తర్వాత కర్నూలు గోల్కొండ రాజులకు అనుబందంగా కర్నూలు నవాబు పాలనలో ఉండేది.మహబూబ్ నగర్ లోని అలంపూర్ సీమను 1597-1643 వరకు పాలించిన బిజ్జుల కొండారెడ్డి అనేకసార్లు కర్నూలు నవాబును యుద్దంలొ ఓడించాడు.అయితె కర్నూలు నవాబు గోల్కొండ రాజు సహాయంతొ బిజ్జుల కొండారెడ్డిని బందించి కర్నూలు కోటలో ఉంచాడు.అప్పటినుంచి ఈ కోటను ప్రజలు కొండారెడ్డి బురుజుగా పిలవడం జరిగింది.కొండారెడ్డి సంకెళ్ళను చేదించుకొని సొరంగ మార్గాన్ని తవ్వి కోటనుంచి తప్పించుకున్నారు అయితె గోల్కొండ రాజులు అలంపూర్ సీమను స్వాదీనపర్చుకున్నారు. ఆతర్వాత కొంత కాలానికి కొండారెడ్డి వంశీయులు 1665 ప్రాంతంలొ ప్రక్తూరు ప్రాంతానికి తరలివెళ్ళి వంద గ్రామాలతో చిన్న రాజ్యాన్ని యేర్పరుచుకొని పాలన కొనసాగించారు.ప్రక్తూరు కోటనుంచి పాలించిన వాల్లలొ తిమ్మ భూపాలుడు అనర్ఘరాఘవము గ్రంధాన్ని రాసి ఎంతో పేరు గడించారు.ప్రక్తూరు ప్రాంతము 1790 వరకు బిజ్జుల వంశీయుల పాలనలొ కొనసాగింది.
రెడ్లలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాల్లు:
పలనాటి నాగమ్మ భారత దేశంలోనే కాదు, ప్రపంచ రాజకీయ చరిత్ర లోనె మొదటి మహిళా మంత్రి.నాగమ్మ 12 వ శతాబ్దానికి సంబందించినవారు.నాగమ్మ స్వస్థలం కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం అరవెల్లి గ్రామం.నాగమ్మ చిన్న తనంలో ఉన్నప్పుడె,తండ్రి రామిరెడ్డి తన బావ మరిది మేకపోతుల జగ్గారెడ్డి గ్రామమైనటువంటి పల్నాడు ప్రాంతం లోని జిట్టగామాలపాడు గ్రామానికి వలస వెల్లినాడు.రామిరెడ్డి తన మేనల్లుడు సింగారెడ్డి కి నాగమ్మ ను ఇచ్చి వివాహం చేసినాడు.వివాహం అయ్యిన మూడు రోజులకే సింగారెడ్డి పాము కాటు తొ మరణించాడు.నాగమ్మ మంత్రి గోపన్న వద్ద శిశ్యురాలిగా చేరి యుద్ద విద్యలను నేర్చుకున్నది.యుద్ద విద్యలతో పాటు నాగమ్మ పరిపాల నకు సంబందించిన విషయాలపైన చాల పరిజ్ఞానాన్ని సంపాదించి నలగామరాజు ప్రభుత్వం లో మంత్రిగా చేరి,ఎప్పటినుంచో నలగామరాజు దగ్గర మంత్రి గా ఉన్న బ్రహ్మనాయుడు మీద పై చేయి సాదించి తన సత్త చాటుకున్న యోదురాలు.
వేమన కొండవీడు రెడ్డి రాజుల కుటుంబం లో జన్మించారు.వేమన 1652 వ సంవత్సరములో జన్మించి వుండవవచ్చని తెలుగు బాష మీద పరిశోదన చేసిన సి.పి.బ్రౌన్ పేర్కొన్నారు.ఎంతో సాదారణ జీవితం గడపిన వేమన నీతిసారము తో పద్యాలు రాసి తెలుగు గడ్డ పై చెరగని ముద్ర వేసారు.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భారతదేశంలోనె మొదటి స్వాతంత్ర సమరయోదులు.సిపాయీల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడు అయినారు.
రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి చిన్న తనంలోనే తల్లిని,తండ్రిని కోల్పోయి మేనమామ వద్ద పెరిగారు.అరవై రూపాయల వేతనంతో అమీను కొలువులో చేరి అంచెలం
రెడ్డి అనేది కులం కాదు ఒక మతం కాదు అది మన రక్తం రైతు గుండెల్లొ నుంచి నరనరాల్లో నుంచి పుట్టింది రెడ్డి
తమిళనాడు మొదట ముఖ్యమంత్రి : సుబ్బారెడ్డి గారూ
కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి : చెంగల్ రెడ్డి గారూ
పాండిచే రి మొదటి ముఖ్యమంత్రి : వెంకటరెడ్డి గారూ
రాజస్థాన్ మొదటి ముఖ్యమంత్రి : రవితోడు రెడ్డి గారు
ఆంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి : నీలం సంజీవ రెడ్డి గారు
రెడ్ల పరువు కాపాడిన ముఖ్యమంత్రి మహానేత వైఏస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇది మన చరిత్రా సోదరులారా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి