భార్యతో ఎలా ప్రవర్తించాలి?
మంచి భర్తగా ఉండడానికి భార్యతో ఎలా ప్రవర్తించాలి?
(బైబిల్ చెప్పిన విషయాలు)
1 . నీ భార్యతో మాట్లాడేటప్పుడు అరచి మాట్లాడవద్దు . ఆమె బాధపడుతుంది.
2 .నీ భార్య గురించి ఇతరుల వద్ద చెడుగా మాట్లాడవద్దు.
3 .నీ భార్య తో పంచుకోవలసిన ప్రేమ లేదా ఆప్యాయత ను వేరొకరితో పంచుకోవద్దు. అది వ్యభిచారం అవుతుంది.
4 . ఇతర స్తీలతో నీ భార్యను పోల్చవద్దు. ఆ ఇతర స్త్రీ నీకు సరిజోడైతే , దేవుడు ఆమెనే నీకు భార్యగా ఇచ్చేవాడు.
5 .నీ భార్యతో సాధు గుణం తో , మృదువుగా మసలుకో. ఆమె అన్నీ త్యాగం చేసి నీతో జీవిస్తున్నది. నీవు కఠినం గా , చిరాకుగా ఉంటే ఆమె ఎంతో బాధ పడుతుంది .
6 . నీ భార్యతో ఏది దాచిపెట్టొద్దు. మీరిరువురు ఏక శరీరులు. ఆమె నీకు సహాయకురాలు. ఆమెకు తెలియని రహస్యం ఉండకూడదు.
7 . నీ భార్య శరీరం గురించి కించపరిచేలా మాట్లాడవద్దు. ఆమె నీ పిల్లలను కనడానికి తన జీవితాన్ని, అందాన్ని త్యాగం చేసింది. ఆమె నీ ఆత్మ. కేవలం శరీరం కాదు.
8 . ఆమె శరీర అందాన్ని బట్టి ఆమె విలువను ఎంచవద్దు. వృద్దాప్యం లో కూడా ఆమెతో సంతోషం గా గడుపు.
9 .బహిరంగం గా ఇతరుల ముందు నీ భార్యను తిట్టి అరవవద్దు. ఏదయినా సమస్య ఉంటె రహస్యం గా మీ గదిలో చర్చించు.
10 . ఎల్లపుడు నీ భార్యను మెచ్చుకొంటూ , కృతజ్ఞతలు చెప్పు.నీ గురించి నీ పిల్లల గురించి , ఆమె ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది.
11 . స్త్రీలంతా ఒకేలా వంట చేయలేరు. నీ భార్య చేసిన వంట ను మెచ్చుకో. ఆమె రోజుకు మూడుసార్లు , సంవత్సరం అంతా ప్రతి రోజు , జీవితాంతం వంట చేస్తూనే ఉంటుంది .
12 . నీ రక్త సంబందీకులను , నీ తోబుట్టువులను నీ భార్యతో పోల్చవద్దు. ఆమె నీలో సగభాగం. నీకు అందరికన్నా నీ భార్యకు మొదటి స్తానం ఇవ్వాలి.
13 . నీ భార్య ఆధ్యాతిక జీవితం కొరకు ఎంతయినా ఖర్చు పెట్టు. ఆమెకు దేవునిపై విశ్వాసం వుంటే పుస్తకాలు, cd లు కొను. ఆమె కోసం నీవు చేసే ఉన్నతమైన పని ఇదే .
14 . నీ భార్యతో ధ్యానం మరియు ప్రార్ధన లో సమయం గడుపు నీకు దేవుని పై విశ్వాసం వుంటే.
15 .నీ భార్యతో సరదాగా ఆటలు ఆడు. తనతో గడిపే సమయమును సంతోషంగా , ఉల్లాసం గా గడుపు. గుర్తు పెట్టుకో -నీవు మరణించిన తరువాత నీ సమాధి పై పడి ఏడ్చేది నీ భార్యే. నీ స్నేహితులకు నీ సమాధి వరకు వచ్చే తీరిక లేకపోవచ్చు.
16 .డబ్బుతో నీ భార్యను లోబరచు కొనుటకు లేదా నియంత్రించుటకు ప్రయత్నించవద్దు. మర్చిపోవద్దు నీ డబ్బంతా ఆమెదే.
17 . నీ భార్య బలహీనతలను అందరికి తెలిసేలా బయలు పరచవద్దు . అలా చేస్తున్నావంటే నిన్ను నీవే బయలు పరచుకొంటున్నట్లు. ఆమె చుట్టూ ప్రాకారం గా నిలబడు.
18 .ఆమె తల్లి తండ్రులను , తోబుట్టువులను బాగా చూసుకో.
19 . ఆమెను నీ జీవితం లో ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్పడానికి ఎన్నడూ వెనుకాడవద్దు. ఆ మాటలు వినడానికి నీ భార్య కు ఎంతో ఆనందం గా వుంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి