చీకు చింతా లేని దాంపత్యం



            సృష్టి మనుగడ స్త్రీ పురుషుల లైంగిక విజ్ఞానం పైన, వారి లైంగిక శక్తి పైన ఆధారపడి వుంటుంది. లైంగిక విజ్ఞానం, లైంగిక శక్తి స్త్రీ పురుషుల్లో లోపించే కొద్ది సృష్టి ధర్మాలకే విఘాతం కలుగుతుంది. అందుకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి, ముఖ్యంగా బుద్ధి జీవి అయిన మనిషికి, సహజ అవసరాలైన ఆకలి,నిద్ర, దాహం, వీటితోపాటు మైధునాన్ని కూడా ఒక సహజ అవసరంగా పేర్కొన్నారు.  అంతేగాకుండ, మధురమైన మానవ జీవనకళలలో "కామం" అనేది కూడా ఒక కమనీయకళ అని అభివర్ణించారు.
       కళాత్మకంగా సాగే స్త్రీ పురుషుల జీవితం ఎల్లవేళలా కళకళలాడుతూ వుంటుందని, ఎప్పటికప్పుడు వినూత్నంగా, వినోదభరితంగా ఉంటుందని కొనియాడారు.
      ఆధునికులకు ఆదర్శం అలనాటిభారతీయ కామశాస్త్ర పాండిత్యం.ఈ నాటికీ ఆనాటికీ పోల్చుకుంటే ఆధునికులకన్నా ప్రాచీనులే అన్నింట మిన్న అని తేలిపోతుంది. ఆరడుగుల అందమైన ఆవయవ సౌష్టవంతో, ఆపాద పర్యంత సర్వాంగ సౌందర్యంతో, మధుర మందార మకరంద మందహాసాలతో, నిండు నూరేళ్ళ ఆరోగ్య సౌభాగ్య మహాభాగ్యాలతో, శృంగార గంగా తరంగ తురంగ వీరంగ విహారా లలో, ఇంకా ఏ విషయంలో పోల్చుకున్నా ఈ నాటి ఆధునికులు అలనాటి ప్రాచీనుల ముందు దిగదుడుపే అవుతారు.

          మనం ఎంతో అపురూపంగాపెంచుకున్న కూతుళ్లకు, కొడుకులకు తగిన వయసు రాగానే వారికోసం తగిన జీవిత భాగస్వాములను వెతికి కట్టబెట్టడం చేస్తాం. కానీ అక్కడే మన ఎంపికలో ఏ చిన్న పారపాటు జరిగినా వాళ్ళు తమ తమ జీవిత భాగస్వాములతో నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. లేదా ఆ ఇద్దరి నడుమ పొసగక అర్ధాంతరంగా తెగతెంపులు చేసుకుని వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవాల్సి వుంటుంది. దుర్మార్గుడో,మూర్ఖుడో అమ్మాయికి భర్తగా లభిస్తే ఆ అమ్మాయి జీవితం దినదినగండం ఆయుష్టుగా మారుతుంది.
          అలాగే ఏ గయ్యాలో, నోటి దురుసుతనం కలిగి భర్తను అత్తమామలపట్ల నిర్లక్ష్య వైఖరి కలిగిన ఏ అమ్మాయో భార్యగా లభిస్తే అతని జీవితం నరకప్రాయమే అవుతుంది. ప్రేమ వివాహాలు చేసుకుంటే అది వేరే సంగతి. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్టు ఎవరి అవస్థలు వాళ్ళు పడతారు.
        పెళ్ళి సంబంధాలను చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలను చూడమన్నారు. కాని ప్రస్తుత కాలంలో అలా కుదరటంలేదు. ఎవరికి అంత ఓపికగాని సమయం కాని లేదు. నెట్ లోనో లేదా పెళ్ళిళ్ళు కుదిర్చే మ్యారేజ్ బ్యూరోల ద్వారానో కుదుర్చు కుంటున్నారు.
      అబ్బాయి ఏ అమెరికా నుండో సెలవుల్లో వచ్చేసరికి పిల్లను చూడటం,ముహూర్తాలు పెట్టుకుని సిద్ధంగాఉండటం, అబ్బాయి రాగానే పెళ్లి జరిపెయ్యడం, ముందే అన్ని ఏర్పాట్లు జరిగి
పోయివుంటే అమ్మాయిని కూడా అక్కడికే పంపించెయ్యడం జరుగుతోంది. అయితే అలా చేయడంవల్ల కొత్త కోడలికి అత్తవారికి నడుమ సరైన అవగాహన గాని సత్సంబంధాలు కాని ఏర్పడవు. కొన్నాళ్ళు తమతోపాటు వుంచు కోవడమో లేదా తప్పనిసరి పరిస్థితుల్లో కూడాకోడలితో పాటు అక్కడికి వెళ్లి కొంతకాలం గడిపి రావడం ఉత్తమం. 
         అబ్బాయి కొత్త కాపురం పెట్టేటప్పుడు  పెద్దలు వెంట ఉండాలి.కొత్త కోడలికి తమ ఇంటి 
ఆచార వ్యవహారాలు, అలవాటు పద్ధతులతో నేర్పించాల్సి వుంటుంది. అంతేకాక  అత్తామామలకు కోడలికి నడుమ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వీళ్ళు నావాళ్ళు అనే భావన కలుగుతుంది. లేదంటే ఎప్పుడైనా కొడుకు ఇంటికి వచ్చినపుడు చుట్టపు చూపుగా  వచ్చిన బంధువుల్లా కన్పిస్తారు. అలాగే కోడలు అత్తారింటికి పండుగలకు, పబ్బాలకు వెళ్లినపుడు కూడా చుట్టపుచూపుగా వెళ్లినట్లు కన్పిస్తుంది తప్పఅది కూడా తన ఇల్లేనన్న భావన రాదు.
        మరో ముఖ్యమైన విషయం. లక్షణమైన అమ్మాయో, అబ్బాయో మన కళ్ళముందు కన్పిస్తున్నా వారిని విస్మరించి, వాళ్ళు తమ అంతస్థుకు తగరని, వారి కుటుంబాలలో మంచి స్నేహ సంబంధాలు లేవని పంతాలకు పట్టింపులకు పోయి కట్నకానుకలకు వచ్చే ఆస్తులకు ఆశపడి తమ ఇంటికి తెచ్చుకుంటే తరువాత అనుభవించాల్సిందే.
        పూర్వంలా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడకపోయినా కనీసం వారి వారి తల్లిదండ్రుల స్వభావాలను గుణగణాలను పరిశీలించి ముందు అడుగు వెయ్యాలి. వాళ్ళు సంస్కారం కలిగిన వారై ఉండాలి. తమ పిల్లలను సరైన దారిలో నడిపించేవాళ్ళుగా ఉండాలి.
       ప్రస్తుతం చాలామంది పెద్దలు కోడళ్ళు తమను అవమానపర్చినా నిర్లక్ష్య వైఖరితో మెలిగినా వారిసంసారంలో జోక్యం చేసుకోకుండా వారి మానాన వారిని జీవించమని వదిలేస్తున్నారు. తాము ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదెంతో బాధాకరం.
       వృద్ధాప్యంలో కొడుకు కోడలు మనవళ్ళతో హాయిగా గడిపెయ్యాలని చూస్తారు పెద్దలు. కాని వారినే దూరం చేసుకుంటే ఎవరిని చూసుకుంటూ శేషజీవితం గడపాలి.
         కూతురికి సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకుని పెళ్లిచేయండి. బంగారం, ఆస్తి
అంతస్థులు లేకపోయినా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth