పిళ్లా ఇందిరాదేవి(ఆరో తరం_2)


పిళ్లా ఇందిరాదేవి తో ఆరోతరం కొనసాగింది. 
పిళ్లా ఇందిరాదేవి రాజంపేటలో పిళ్లా లక్ష్మిరెడ్డి పిళ్లా రామలక్ష్మి దంపతులకు 18.09.1952లో
జన్మించారు. విద్యాభ్యాసమంతా రాజంపేటలో సాగింది. ఇంటర్ మీడియట్ స్థానిక ప్రభుత్వ
జూనియర్ కళాశాలలో పూర్తిచేశాక, బి.ఏ. (తెలుగు) డిగ్రీ చేయడానికి తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో చేరారు. తరువాత 1972లో రాజంపేటలో తన తండ్రి పనిచేస్తున్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా చేరారు.
         రాజంపేటలో టీచరుగా పనిచేసిన కొన్నాళ్ళకు కమలాపురం మండలంలోని
 నలింగాయగారి పల్లె గ్రామ వాస్తవ్యులైన 

అంకిరెడ్డిగారి పిచ్చిరెడ్డి, కొండమ్మల పెద్దకుమారుడు అంకిరెడ్డిగారి కొండారెడ్డితో 1974 లో వివాహం జరిగింది. వివాహానంతరం బి.ఇడి., తప్పనిసరిగా పూర్తి చేయాలన్న నిబంధన కారణంగా ప్రొద్దుటూరులో ఆ కోర్సు పూర్తిచేశారు. 
         వారికి 1975లో ఒక కుమార్తె జన్మించింది. భాస్కరుడు తన కూతురి పేరిట లీలావతి గణితాన్ని రచించాడు. అలా ఆ అమ్మాయి తాత పిళ్లా లక్ష్మిరెడ్డి ఆ అమ్మాయి గణితంలో ప్రావీణ్యతసంపాదించాలన్న ఆశయంతో లీలావతి అని నామకరణం చేశారు. 
ఆమె ప్రస్తుతం హిందూపురంలో ఉపాధ్యాయురాలి గా పనిచేస్తోంది.
         వివాహానంతరం రాజంపేటలో అమ్మవారిశాల వీధిలో నివాసము ఉండేవారు. అక్కడి నుండి పాఠశాల చాలా దగ్గరలో ఉన్నందున, సరస్వతి పురం నుండి పోవడం శ్రమతో కూడినందువలన అక్కడికి నివాసాన్ని మార్చారు. 
        భర్త సహకారం నిండుగా ఉండేది. ఆయన పి.వై.ఆర్. సినిమా హాలు సమీపంలో ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకొని వ్యాపారము చేసేవారు.
        పెద్ద తమ్ముడు పిళ్లా రవీంద్ర నాథ రెడ్డి ని 
నాన్న పదవీవిరమణ తరువాత చదివించింది. ఇంటరు పూర్తయ్యాక  ఆయన కడపలో ఐటిఐ చేరి
అన్న గారింట్లో ఉండి చదువుకున్నారు.
       లీలవతి జన్మించాక వారికొక పుత్రుడు
1979లో కలిగాడు.

అతనికి జయభరత్ రెడ్డి అని పేరు పెట్టారు.ఇతనిప్పుడు హైదరాబాద్ లో ఓరిజోనాలో
 సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
        పదేళ్ళు పనిచేసిన అనంతరం 1982లో కడపకు బదిలీ మీద ప్రభుత్వ మహిళాప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వచ్చారు. దాంతో కడప పట్టణంలో ఐ.టి.ఐ. దగ్గర రాయచోటి రోడ్డులోకి రాజంపేట నుండి తమ నివాసాన్ని మార్చినారు.   
           ఆమె భర్త కొండారెడ్డి కూడా రాజంపేటలో
తమ వ్యాపారాన్ని పూర్తిగా ఎత్తివేసినారు. కడపకు వచ్చాక  మైదుకూరులో ఉన్న బంధువుల
వేరుశనగ మిల్లులో భాగస్వామిగా చేరి వేరుశనగ వ్యాపారం చేసేవారు.
        కొంత కాలము తర్వాత ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుండి చిన్నచౌకులోని
పాఠశాలకు మారినారు. మళ్లీ తిరిగి నాలుగేళ్ళ తర్వాత పూర్వ పాఠశాలకే బదిలీ అయినారు. అక్కడి నుండి మళ్ళీ ప్రభుత్వ బాలికల పాఠశాల కు బదిలీ అయినారు.తరువాత అక్కడే పదవీ విరమణ చేశారు. 

అక్కడ ఎంతో మంది విద్యార్థినులను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. 
ప్రస్తుతం వారు 
 కడప పట్టణంలో నివసిస్తున్నారు. 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth