పిళ్లా రవీంద్రనాథరెడ్డి
పిళ్లా రవీంద్రనాథరెడ్డి 29-06-1958లో పిళ్లా లక్ష్మిరెడ్డి,రామలక్ష్మి దంపతులకురాజంపేటలో వున్న సరస్వతీపురంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం సరస్వతీపురంలో ఇంటి వెనుక నున్న ప్రాథమిక పాఠశాలలో గడిచింది.పదవ తరగతి వరకు ఇంటికి సమీపంలో వున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. తరువాత ఇంటర్మీడియట్ చదువుతున్న దశలో తన అక్క బావ దగ్గర ఉండి చదువు పూర్తి చేశారు.
ఇంటర్ చదువు పూర్తయ్యాక ఐ.టి.ఐ. ఎలక్ట్రిషియన్ కోర్సు చేరేందుకు 1975లో కడపకు
వచ్చారు. తన అన్న దశరథరామిరెడ్డి దగ్గర వుంటూ ఐ.టి.ఐ. లో రెండేళ్ళ కోర్సు పూర్తి చేశారు.తనతో పాటు తనబావ తమ్ముడు సంటి కొండారెడ్డి కూడా అదేకోర్సులో చేరి తనతోపాటు తన అన్న దగ్గరే వున్నాడు.
ఐటిఐ అర్హత ద్వారా విజయవాడలో విజయ స్పిన్నింగు మిల్లులో ఎలక్ట్రిషియన్ గా రూ. 200ల జీతానికి చేరారు.
స్పిన్నింగ్ మిల్లులో కంపెనీ వారిచ్చిన గదిలో వుండేవారు. మిల్లు బందరు రూటులో ఉన్న గంగూరులో వుండేది. అందులో 1977 నుండి 1984వరకు 7 సంవత్సరాలు పనిచేశారు. అక్కడ పనిచేస్తున్నసమయంలో 26-06-1980లో పులివెందులలోని లింగాల మండలంలోని చిన్నకుడాలగ్రామ వాస్తవ్యులు మొయిళ్ళ సుబ్బిరెడ్డి, అచ్చమ్మలకు చివరి కుమార్తె మొయిళ్ళ అనసూయతో పులివెందులలోని మిట్టమల్లేశ్వర దేవాలయంలో వివాహం జరిగింది. వారికి ఒక ఒక కుమారుడు దినేష్, కుమార్తె దీప్తి కలిగారు.దినేష్
14-08-1984లో చిన్నకుడాలలో జన్మించాడు. విజయవాడలో విజయ స్పిన్నింగ్ మిల్లులో దూదికి సంబందించిన ధూళి ఎక్కువగా వచ్చి అలర్జీ ఏర్పడిన కారణంగా తుమ్ములు,
ముక్కు నుండి నీరు కారడం వంటి సమస్యలు తలెత్తడంతో అక్కడ వుండలేక రాజీనామా చేసికడపకు 1984లో తిరిగి వచ్చారు.
కడపలో విజయవాడ నుంచి రాగానే కడపలో ఉన్న రంకా కేబుల్స్ లో ఎలక్టీషియన్ గా చేరారు. అప్పుడుఎర్రముక్క పల్లెలో తన అన్నతో పాటు వుండేవారు. తరువాత 1986లో ఆర్ట్స్ కాలేజీ అవతల ఎస్టేట్లో రంకా కేబుల్ ఫ్యాక్టరీకి దగ్గరగా వుంటుందని తన నివాసాన్ని మార్చారు. తరువాత12-09-1987లో దీప్తి జన్మించింది.
రంకాలో 1984 నుండి 1991వరకు 7సం॥రాలు పనిచేశారు. ఆ సమయంలో బి.ఏ. డిగ్రీని ఆర్ట్స్ కళాశాలలో రాత్రిపూట కళాశాల కోర్సు క్రింద పూర్తిచేశారు.ఇంతలో ఆఫ్యాక్టరీని మూసేసి తమిళనాడు కు మార్చేప్రయత్నంలోఉన్నారప్పుడు. ఆ సందర్భంలో 1992లో ఎంప్లాయిమెంట్ ఎక్సెంజ్ ద్వారా రోడ్డురవాణా సంస్థలో కండక్టరు ఉద్యోగం వచ్చింది. ఆర్.టి.సి. లో చేరిన తరువాత ఎర్రముక్కపల్లెకు తన నివాసాన్ని మార్చినారు. ఆర్.టి.సిలో ప్రథమంగా రాయచోటి డిపోలో పోస్టింగు ఇచ్చారు. 1992 నుండి 2005వరకు అక్కడ పనిచేశారు. వారి కుమార్తె దీప్తి బి. టెక్ కోర్సును రాజంపేట అన్నమయ్య కాలేజీలో చేరడంతో 2005 నుండి 2009 వరకు రాజంపేట డిపో కు మారి దాదాపు 4 సం||లు
అక్కడ పనిచేశారు. తదనంతరం కడప డిపోకు బదిలీ అయినారు.2009 నుండి 2016 జూన్ 30న పదవీ విరమణ చేసే వరకు కడపలో పనిచేశారు.
కుమారుడు దినేష్ రెడ్డి నిహైదరాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో చదివించారు.
కుమార్తె దీప్తి ని తాడిపత్రి వాస్తవ్యులైన రామనాధ రెడ్డి కిచ్చి వివాహం జరిపించారు.
తరువాత కుమారుడు దినేష్ రెడ్డి కి వివాహం జరిపించారు.
పదవీ విరమణ తరువాత ఎర్రముక్కపల్లెలో సొంత ఇల్లు నిర్మించుకొని అక్కడే వుంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి