పిళ్లా దశరథరామిరెడ్డి(ఆరోతరం_1)


        పిళ్లా దశరథరామిరెడ్డి తో ఆరో తరం ప్రారంభమైంది.
            పిళ్లా దశరథరామిరెడ్డి సింహాద్రిపురం మండలంలోని కొరగుంటపల్లె లో పిళ్లా లక్ష్మిరెడ్డి,పిళ్లా శివలక్ష్మీదేవి దంపతులకు 16.3.40న  జన్మించారు.ఆయన   పుట్టిన  వారం రోజులకే  తల్లి దివంగతురాలైంది.   ఆయనను పెంచడానికి, బాగోగులు చూసేందుకు ఆయన తండ్రి ముసల్ రెడ్డి పల్లె వాస్తవ్యులు రామలక్ష్మమ్మ ను రెండో వివాహం చేసుకొన్నారు. దాంతో ఆయన బాల్యం,
ప్రాథమిక విద్య   ముసల్ రెడ్డి పల్లె లో గడిచింది.ఉద్యోగ రీత్యా తండ్రి రాజంపేటకు బదిలీపై వచ్చిన తరువాత దశరథరామిరెడ్డి చదువు రాజంపేటలో కొనసాగింది.

          ఎస్.ఎస్.ఎల్ .సి పూర్తి చేసిన తరువాత ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. ఇలా వెళ్ళిపోయిన  దశరథరామిరెడ్డి  ఉత్తర ప్రదేశ్ లోనివారణాసి సమీపంలో ఖుర్దా రోడ్ లో రైల్వే శాఖలో ఉద్యోగంలో చేరారు.ఇదంతా చివరి తమ్ముడు బాబు పుట్టక ముందు జరిగింది. అయినప్పటికీ ఇంటి విషయాలను తెలుసుకుంటూ
ఉండేవారని 1964లో బాబు పుట్టిన సందర్భంలో, కుమారస్వామిరెడ్డిగా పేరు పెట్టినపుడు కాశీ  నుండి లేఖ కూడా ఇంటికి రాసినారు.తన చెల్లెలు విజయలక్ష్మి వారి మరణవార్త తెలుసుకొని కుర్దా నుండి నుండి తిరిగిరాజంపేటకు వచ్చేశారు.
         
          తిరిగొచ్చిన  తనయుని వివాహానికి సన్నాహాలు మొదలు పెట్టారు  తండ్రి. 
సింహాద్రి పురం మండలం కసునూరు లో నివసిస్తున్న తుంగా మల్లమ్మ, తుంగా నారాయణరెడ్డి కుమార్తె తుంగా నిర్మలాదేవితో దశరథరామిరెడ్డికి 8_5_1969 లో వివాహం జరిపించారు. 
        
 నిర్మలాదేవి 27.02.1950శనివారం రోజున  సింహాద్రిపురం (మం)  కసనూరులో జన్మించారు. ఆవూర్లోవున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. 
ఆ దంపతులకు 1970 జూన్ 1న ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లోనికి లక్ష్మిమనోహర్ రెడ్డి అని నామకరణం చేశారు. చిట్టి అని ముద్దుగా పిలిచేవారు. 
 
         1972 లో భార్య రెండో బిడ్డకు గర్భవతి గా ఉన్న సమయంలో విద్వాన్ కోర్సు చేయడానికి ఆయన హైదరాబాద్ వెళ్లాడు. 9-9-1972 లో ఆడబిడ్డ జన్మించింది. 

       పద్మరాధిక, నిర్మల దేేేవిి, మల్లమ్మ(ఫోటో)

   ఆమెకు పద్మరాధిక అని నామకరణం చేశారు.ముద్దుగా చిన్నక్క అని పిలిచేవారు.
ఆ సందర్భంలో ఇంటి పనుల వలన,కొండమ్మవ్వ
సూటిపోటి మాటల వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆయన సతీమణి నిర్మలాదేవికి హిస్టీరియా లక్షణాలు వచ్చాయి. అందరూ దయ్యం పట్టిందని అనుకున్నారు.ఆసమయంలో గుంటూరు యాసలో మాట్లాడేవారు.అయితే  కడపలో పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రోజూ నబీకోటలోని శివాలయం చుట్టూ, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత పూర్తిగా తగ్గిపోయింది. ఆతరువాత మళ్ళీ ఎప్పుడూ ఆ లక్షణాలు రాలేదు.
            తెలుగులో విద్వాన్ పండిట్ కోర్సు పూర్తి చేశాక ఉద్యోగాన్వేషణలో కడపలో వుండేవారు. ఫ్యామిలీని కడపకు మార్చారు. అక్కడ అత్త గారింటికి పోవడానికి నామోషిగా భావించి బయటనే వుండేవారు. నిరుద్యోగ జీవితం ఎంతో
బాధించింది. టీలు ఎక్కువగా తాగడం మధ్యాహ్నం పూట సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల
గ్యాస్ ట్రబుల్, అల్సర్ చెప్పకుండానే శరీరాన్ని అంటి పెట్టుకున్నాయి. అవి ఉద్యోగం వచ్చిన తరువాత కూడా మరణించేవరకు వీడలేదు.ఆరోగ్యానికి సంబంధించి సరైన ఆహారం
సకాలంలో తీసుకోవాలని ఆయన జీవితానుభవం చెపుతోంది.
            తెలుగు పండిట్ ఉద్యోగానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొంతకాలం తాత్కాలిక పద్దతిలో  ఉపాధ్యాయునిగా మున్సిపల్ హైస్కూలులో పనిచేశారు. తరువాత పూర్తి కాలం తెలుగు పండితులుగా కడప ఎర్రముక్కపల్లెలో వున్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నియమితు
లయ్యారు. అప్పుడు ఎర్రముక్కపల్లెలో బుగ్గవంక ఒడ్డున వుండే వీధిలో నివసించేవారు. సుబ్బరాయుడు, గంగాధరం టీచర్లు కూడా ఆ వీధుల్లోనే నివసించేవారు.
             రాజంపేటలో ఐదోతరగతి పూర్తిచేసుకున్న తమ్ముడు కుమారస్వామిరెడ్డి (బాబు)ని    చదివించడానికి కడపకు పిలుచుకు వెళ్లారు.
బాబు కూడా కడపకు వస్తానంటూ  రాజంపేట నుండి అన్నతో పాటు వెళ్లాడు.ఆరకంగా బాబు‌ బాధ్యతను తాను తీసుకున్నాడు. తన తండ్రి బాధ్యతలను కొంతపంచుకోవటం ఎంతో సాహసో పేతమైనది. 
            ఆరోజుల్లో టీచర్ల కు  జీతాలు తక్కువగా ఇచ్చేవారు.కుటుంబ నిర్వహణకు ట్యూషన్లు చెప్పే వారు.స్కూలు నుంచి రాగానే వందలమంది పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు. 

         (ఆగ్రాలో సహచర టీచర్ల తో కలిసి)
ముగ్గురాళ్ళ క్రిష్టప్పకుటుంబంలోని పిల్లలైన సతీష్ మొదలైన పిల్లలకు దాదాపు 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ట్యూషన్లుచెప్పేవారు. అప్పట్లో నెలకు వాళ్ళు ఒకరికి వందరూపాయలు ఇచ్చేవారు. ఇది 1976, 77లలోజరిగిన విషయం. సరైన సమయానికి ఆహారం తీసుకోక పోవడం వల్ల, దానికితోడు టీలు ఎక్కువగా తాగడంవల్ల, సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల అల్సర్ సమస్య ఎక్కువగా బాధించేది. అప్పట్లో జెలూసిల్ సిరప్ ఎక్కువగా రోజూ సేవించేవారు.
            తమ్ముడు బాబుతో పాటు రాయచోటి నుంచి వచ్చి చదువుకుంటున్న ఆంజనేయరెడ్డి,
మల్ రెడ్డి మొదలైన పిల్లలను కూడా తన ఇంట్లోనే భోజనం పెట్టి చదివించేవారు. వాళ్ళు ఎప్పుడైనా
ఒకసారి కొంత బియ్యం ఇంటినుండి తెచ్చుకునే వారు. వారు చూపే కృతజ్ఞత ఎంతో ఆరాధన
పూర్వకంగా వినయంగా వుండేది.
            తన చెల్లెలు ఇందిరాదేవికి పెళ్ళైన తరువాత బావ ఇంటికి వచ్చినపుడు ఆయన ఒకరోజు రాత్రి ఇంటికి వచ్చినపుడు వచ్చినారని తెలిసి కూడా తలుపు తియ్యలేదన్న అపార్థంతో మనస్పర్థలు ఏర్పడి తాను మరణించేవరకు మాట్లాడుకోవడం ఇద్దరూ మానేశారు. ఇదంతా 1976 ప్రాంతంలో జరిగింది.
          తరువాత వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు కడపలో జన్మించారు. ఆ రకంగా  వారి సంతానం నలుగురయ్యారు. 
వీరే చిట్టీ, చిన్నక్క విశ్వం, శోభ.

లీలావతి,చిట్టి, చిన్నక్క (పద్మరాధిక),విశ్వం,
   పద్మశోభ(నిలబడి) 
                ఇదంతా ఒక వైపు జరుగుతుంటే అప్పుడప్పుడు తన భార్య తరపున బంధువులు కసనూరు నుండి ఫ్యాక్షన్ కారణంగా పదుల సంఖ్యలో కేసుల నిమిత్తం తరచూవచ్చేవారు. వారందరికి భోజనాలు ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయాసపడేది ఆయన సతీమణి నిర్మలాదేవి.
          మరో తమ్ముడు పిళ్లా రవీంద్ర నాథ రెడ్డి కూడా ఆయనింట్లోనే వుండి ఐ టి ఐ చదివేవాడు.

 అతనికి ఉద్యోగం వచ్చాక పులివెందులలో మంచి సంబంధం చూసి వివాహం జరిపించారు.
          బాబు (విజయ్ కుమారస్వామి) ను ఎంయస్సీ వరకు చదివించారు.అతనికి యల్ఐసిలో ఉద్యోగం వచ్చాక అతనికి కూడా 

కడప టౌన్ లో  మునిసిపాలిటీ లో పనిచేసే వెంకటరెడ్డి కూతురు తో వివాహం జరిపించారు.
          ముందు నుంచి బాధిస్తున్న అల్సర్ సమస్య మరింత తీవ్రం కావడంతో కడుపులో పుండు పెద్దదై మరణానికి దారి తీసింది. 
కడపలో 16-03-1994న ఆయన తుది శ్వాస విడిచారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth