ప్రామిసరి నోటు గురించి
ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు తీసుకున్నవ్యక్తి ప్రామిసరి నోటును రాయాల్సి ఉంటుంది. ఒకవేళ అతను రాయకుంటే ఎవరైతే రాస్తారో వారి సంతకం ఉండాలి.
అంతే కాని డబ్బు ఇచ్చే వ్యక్తి అస్సలు రాయరాదు. ఇక లక్షకు ఒక ప్రామిసరి నోటు చొప్పున రాయించుకుంటే బెటర్.మూడు నాలుగు లక్షలకు కలిపి ఒకే ప్రామిసరి నోటును
రాయించుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది.
ప్రామిసరి నోట్ల విషయంలో కొందరు తరచు చేసే తప్పులు ఏంటంటే ఆ నోట్లపై స్టాంపులు అతికించక పోవడం,జామీను
సంతకం తీసుకోక పోవడం, సాక్షి సంతకం చేయించుకోక పోవడం,ఇక ప్రామిసరి నోటు సొంత దస్తూరితో రాయడం.ఈ నాలుగు తప్పులు చేయడం చేయకుండా ఉండాలి.
ఎంత మొత్తంకు ప్రామిసరి నోటు రాయించుకున్నా కూడా తప్పనిసరిగా స్టాంపులు అతికించాలి. స్టాంపుపై డబ్బు తీసుకున్న వ్యక్తి సంతకం చేయించుకోవాలి.
ఇక ప్రామిసరి నోటులో జామీను అనే ఆప్షన్ ఉంటుంది.కాని అంతా కూడా దాన్ని పట్టించు కోరు.కాని అదే చాలా కీలకం.తప్పనిసరిగా అప్పు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తిని తన
జామీనుగా ఉంచాలి.
ఇక సదరు వ్యక్తికి డబ్బు ఇచ్చినట్లుగా డబ్బు ఇచ్చే వ్యక్తి ఒక సాక్షిని కూడా సంతకం చేయించాలి.వడ్డీ ప్రభుత్వ కండీషను తగ్గట్లుగా ఉండాలి.అలా కాదని అయిదు, పది రూపాయల వడ్డీని ప్రామిసరి నోటులో
రాస్తే ఆ నోటు కోర్టులో చెల్లదు.అయిదు లక్షల వరకు మాత్రమే ప్రామిసరి నోట్లను వాడితే బెటర్.అంతకు మించి డబ్బు ఇస్తే 100 రూపాయల బాండ్ పేపర్‌నువాడటం ఉత్తమం.
ఇక ప్రామిసరి నోటును డబ్బు తీసుకునే వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో రాయించు కుంటే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవ డం వల్ల ప్రామిసరి నోటు కోర్టుకు వెళ్తే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది.
అలా కాకుండా ఇష్టం వచ్చినట్లురాయించు కుంటే ఆ డబ్బు రావడం అనుమానమే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి