పిళ్లా పద్మశోభ, సిరియపురెడ్డి చెన్నకిశోర్ రెడ్డి(ఏడోతరం 4)






         పిళ్లా దశరథరామిరెడ్డి, పిళ్లా నిర్మలాదేవి దంపతులకు 02-10-1976 లో జన్మించిన చివరి సంతానం పద్మశోభ. 
        శోభ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో పూర్తి చేసినారు.తరువాత గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ లో పదవ తరగతి వరకు చదివాక, ఇంటర్ చదువును ప్రభుత్వబాలికల కళాశాలలో పూర్తిచేసింది. 1997లో ఎన్.వి. డిగ్రీ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ పట్టాను పొందినారు.
          కడప వాస్తవ్యులైన సిరియపురెడ్డి చెన్నారెడ్డి, వజ్రమ్మ దంపతులకు జన్మించిన సిరయపురెడ్డి చెన్నకిశోర్ రెడ్డితో 10-08-2001న కడపలో శోభకు వివాహం జరిగింది.
         కిశోర్ 24-10-1975వ తేదీన కమలాపురంలో సిరియపురెడ్డి చెన్నారెడ్డి, వజ్రమ్మ దంపతులకు జన్మించారు. 10వ తరగతిని పులివెందులలో,ఇంటర్ ను నంద్యాలలో పూర్తిచేశాక, ఐ.టి.ఐ. డ్రాఫ్ట్ మన్ కోర్సును 1994లో పూర్తిచేసినారు. తరువాత ఆర్మీలో చేరినారు. వీరు చాలా కాలం పంజాబ్ లోని పాటియాలాలో వుండేవారు.
        వీరికి 27-04-2002న నితిన్ కుమార్ రెడ్డి జన్మించాడు. ఇతను  బెంగళూరులో ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 10వ తరగతి చదివాడు.తరువాత ఇంటర్ ను బెంగళూరు లో చైతన్య కళాశాలలో
యం.పి.సి.చదివి ఇంజనీరింగ్ కామెడ్ కే ప్రవేశపరీక్ష రాశాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth