పిళ్లా దినేష్ రెడ్డి, పందిళ్లపల్లి సుస్మిత(ఏడోతరం7)




      ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రగతినగర్‌లో
నివాసముంటున్న పిళ్లా దినేష్ రెడ్డి పులివెందులలోని లింగాల మండలం చిన్న కుడాలలో పిళ్లా రవీంద్రనాథరెడ్డి, అనసూయ దంపతులకు 14-08-1984లో జన్మించారు.
          తన ప్రాథమిక విద్యాభ్యాసమంతా కడపలో జరిగింది. తండ్రి విజయవాడలోని  విజయ స్పిన్నింగుమిల్లులో పనిచేస్తున్నప్పుడు తాను జన్మించాడు. తండ్రి కడపకు వచ్చేశాక ఎర్రముక్క పల్లెలో నివాసముంటున్న తరుణంలో ప్రాథమిక విద్యాభ్యాసాన్నిసరస్వతీ శిశుమందిర్ లోనూ, మహర్షి విద్యానికేతన్ లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. పదవ తరగతి పూర్తవగానే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించారు. సికిందరాబాదులో వున్న గవర్నమెంట్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో ఎలక్ట్రానిక్స్ డిప్లమో కోర్సును 2002లో పూర్తిచేశారు. 
         2003లో జూబ్లీహిల్స్ లోవున్న వాల్యూలాట్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా చేరినారు. ఉద్యోగం చేస్తూ జె యన్ టి యులో బి.టెక్ కోర్సును దూరవిద్య ద్వారా పూర్తిచేశారు. ఆ తర్వాత 2014 నుండి కొనీల్యాబ్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ వున్నారు.
        పందిళ్లపల్లి జయరామిరెడ్డి, పార్వతమ్మల ఏకైక కుమార్తె సుస్మితను 09-02-2013లో కడపలో ఉన్న రైల్వే కళ్యాణ మండపంలో వివాహంచేసుకొన్నారు. వీరిది పులివెందులలోని బ్రాహ్మణ పల్లి. కాకపోతే సుస్మిత తండ్రి మంచిర్యాలలో ఉద్యోగరీత్యా వుండేవారు. ప్రస్తుతం హైదరాబాదులో ప్రగతి నగర్ లో కూతురు ఇంటి సమీపంలో నివాసముంటు న్నారు.
        వివాహమైన సంవత్సరానికి 22-09-2014లో దినేష్, సుస్మిత దంపతులకు సాయి హిమ జన్మించింది. వీరు ప్రస్తుతం ప్రగతి నగర్ లోని స్వంత ఇంటిలో నివసిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth