అంకిరెడ్డి లీలావతి,గాలివీటి సాయికుమార్ రెడ్డి
అంకిరెడ్డి పెద్ద కొండారెడ్డి, పిళ్లా ఇందిరాదేవి దంపతుల ప్రధమ సంతానంగా 15.12.1975లో కడపలో లీలావతి జన్మించింది.
తనతల్లి పిళ్లా ఇందిరాదేవి రాజంపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తుండే వారు. తండ్రి అక్కడే ఫ్యాన్సీ స్టోరు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవారు. అందువల్ల లీలావతి తన థమిక విద్యాభ్యాసాన్ని రాజంపేటలో పూర్తిచేసింది.
తనతల్లి కడపకు ఉద్యోగరీత్యా బదిలీ కావడంవల్ల లీలావతి తనహైస్కూలు విద్యను చెంబుమియాపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో
పూర్తిచేసింది. ఇంటర్ విద్యను, డిగ్రీలో బి.ఎస్.సి (యం, పి.ఎస్)ని కడపలో ఉన్న ఎస్.వి. డిగ్రీకళాశాలలో 1996లో పూర్తిచేసింది. 1998లో బి.ఎడ్ చదివేందుకు బద్వేలు వెళ్ళి అక్కడున్న వీరారెడ్డి కళాశాలలో పూర్తిచేసింది. 2001లో
డి.ఎస్సీ, పరీక్షలో ఉత్తీర్ణురాలై రాయచోటీలోని ఉప్పర పల్లెలో ఉపాధ్యాయురాలిగా నియమితు రాలైంది.
1999 ఫిబ్రవరిలో గాలివీటి చంద్రశేఖర్ రెడ్డి లీలావతమ్మల కుమారుడు సాయికుమార్‌రెడ్డితో ఆమె వివాహం జరిగింది. రాయచోటిలో 08, 06. 1970లో జన్మించిన సాయికుమార్ రెడ్డి చిట్లూరులో తన ప్రాథమిక విద్యను, రాయచోటిలోని మాసాపేట లో హైస్కూలు విద్యను పూర్తి చేసినారు. ఇంటర్ విద్యను రాయచోటిలో పూర్తిచేశాక 1991లో గుంటూరులో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో టెక్స్ టైల్ కోర్సును చదివారు. పూర్తయిన వెంటనే హైదరాబాదులోని ప్రియదర్శిని స్పిన్నింగు మిల్లులో అసిస్టెంటు సూపర్వైజరుగా నియమితు లయ్యారు. తరువాత 1993లో హిందూపురంలో ఉన్న సూపర్ బి స్పిన్నింగుమిల్లులో సూపర్‌వైజరుగా చేరారు.
తన భర్త హిందూపురంలో ఉన్నందున లీలావతి తన ఉద్యోగాన్ని కడప నుండి హిందూపు రానికి మార్చుకొనింది. హిందూపురానికి దగ్గరలో వున్న రోళ్ళ మండలంలో కొంతకాలం పనిచేసి, తరువాత బదిలీపై సోమందేపల్లి మండలానికి వచ్చింది. ప్రస్తుతం హిందూపురం మండలంలోని రాచేపల్లెలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
వారిద్దరి ప్రేమ ఫలంగా 09.11, 1999న నయనేష్ రెడ్డి జన్మించాడు. ముద్దుగా చింటూ అని పిలుస్తారు. మంచి చిత్రకారుడు. సృజనాత్మకత వున్నవాడు. హిందూపురంలోని యల్.ఆర్.జిలో ప్రాథమిక విద్యను, చైతన్యలో హైస్కూలు విద్యను పూర్తిచేశారు. ప్రతిభా అవార్డు సాధించారు. ప్రస్తుతం ఇంటర్ (యం.పి.సి) ను విజయవాడలో వున్న చైతన్య కళాశాలలో చదువుతున్నారు.
తరువాత వారికి ఒక కుమార్తె అర్పిత జన్మించింది. కానీ దురదృష్టవశాత్తు డెంగీజ్వరం వచ్చి డాక్టర్లు సరిగా గుర్తించలేకపోవడం వల్ల ఆ అమ్మాయి అకాల మరణం చెందింది.
సూపర్ బి మిల్లుకు సోదర సంస్థగా హిందూ పురంలోనే ఏర్పడిన మరో కంపెనీకి సీనియర్ సూపర్‌వైజర్ గా పదోన్నతి పొందారు.ఇటీ ఫ్యాక్టరీలో జరిగిన పరిణామాల వల్ల సాయికుమార్ ఆ కంపెనీ కి రాజీనామా చేశారు.
హిందూపురంలో ఒక అపార్టుమెంట్ లో ఒక ఫ్లాటు తీసుకుని అక్కడే నివసిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి