వివాహబంధం
వివాహం పట్ల విముఖత రోజు రోజుకూ పెరుగుతోంది. 'బ్యాచిలర్ గా వుంటేనే సోబెటరు. సుఖంగా వున్న ప్రాణాన్ని కష్టపెట్టు కోవడమెందుకు' అనుకునేవారు బోలెడంత మంది. అయితే వివాహంపై వ్యక్తమవుతున్న ఈ అభిప్రాయాలను పటాపంచలు చేస్తోంది ఓ అధ్యయనం. బ్రిటన్లో చేసిన రెండు సర్వేల ఆధారంగా... పెళ్లి కాని వారి కంటే పెళ్లైన వారు ఎంతో సంతృప్తికర జీవితం గడుపుతున్నారు.
ఒంటరితనం అనే సమస్య లేకపోవడంతో సంతోషంగా జీవిస్తారని తేలింది. లండన్లోని 30 వేల మంది నుండి బ్రిటీష్ కుటుంబ విభాగ సర్వే సేకరించిన వివరాలను మరో సర్వేలో వివాహితులు, అవివాహితులు, వివాహమే చేసుకోనివారి సంతృప్తి కర జీవితాల రేటింగులను పరిశీలించారు. ఈ రెండు నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వివాహానంతర జీవితంలో ముఖ్యంగా మధ్య వయస్కులు అందరికంటే ఎక్కువ సంతృప్తికర జీవితాన్ని గడుపుతున్నారని తేలింది. వివాహం జీవితాన్ని సంతృప్తికరం చేయడమే కాదు, మధ్య వయస్సులో వచ్చే అనుకోని పరిణామాలను సులభంగా అధిగమించేందుకు వుపయోగపడుతుంది. ఈ విషయంలో అవివాహితులతో పోల్చుకుంటే వివాహితులు మెరుగైన ఫలితాలుసాధించారు.
వివాహబంధం దీర్ఘకాలం కొనసాగాలంటే భాగస్వాముల మధ్య స్నేహపూర్వక సంబంధం వుండాలి. జీవిత భాగస్వాములను స్నేహితులుగా భావిస్తేనే అది సాధ్యమౌతుందని పరిశోధకులు
పేర్కొంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి