మనల్ని మనం ప్రేమించాలి.
అప్పుడప్పుడు మనం కొత్త నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లకు స్వస్తి పలికి కొత్త వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. వాటిలో బరువు తగ్గించుకోవడం అన్న నిర్ణయంతప్పనిసరిగా వుంటుంది. బరువు తగ్గడం మంచిదే అయితే అందుకు మనం పాటించే పద్ధతి దానికి హాని కలిగించకూడదు.
ఎందుకంటే ఏళ్ల తరబడి చేసిన పరిశోధనలు
ద్వారా తేలిందేమంటే మీడియాలో చూపించినట్టు అందమైన శరీరాకృతి పొందడం అందరికీ సాధ్యం కాదు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కీల్ బృందం చేసిన పరిశోధనలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి. మన ఆకారాలకు, ప్రకటనల్లో
చూపించే ఆకారాలకు ఎక్కడా పొంతన వుండదు. అది అనేక అనర్థాలకు దారితీస్తోంది.తమ శరీరం ఎలా వున్నా అంగీకరించేలా పరిశోధకులు బృందం చేసిన ప్రయోగంతో గొప్ప ఫలితాలు వచ్చాయి.
నాజూకైన శరీరం కోసం ఆహారపు అలవాట్లలో తీవ్రమైన మార్పులు చేసుకోకుండా వారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో అద్దం ముందు నిలబడి అవయవాల పని తీరును మెచ్చుకొనే
వ్యాయామం ఒకటి. ఈ ప్రశంసలు శరీర పని
తీరును ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు చర్మం తీసుకుందాం. మెడ మీద, భుజాల మీదచర్మం ఆకృతి భిన్నంగా వుంటుంది.అవయవాన్ని బట్టి, దాని పని తీరును బట్టి చర్మం అనేక రకాలుగా వుంటుంది. అన్ని చోట్లా ఒకేలా వుంటే శారీరక ధర్మాన్ని నిర్వర్తించడం కష్టం కదా! అలాగే తమ శరీరాన్ని అంగీకరించేందుకు ఇబ్బంది పడుతున్న వారికి సంబంధించి మరో వ్యాయామం రూపొందిం
చారు. 'ఇవన్నీ క్రమేణా మీ ఆత్మగౌరవాన్ని
పెంచుతాయి.అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లను నిరోధిస్తాయి. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే అలవాట్లను తగ్గిస్తాయి' అంటున్నారు ప్రొఫెసర్ కిల్.
ఇంకేం! ఈ రోజు నుండే మీ శరీరాన్ని ప్రేమిస్తూ అధిక బరువును తగ్గించుకోండి. లావుగా వున్నామని ఆహారం తీసుకోకుండా మీరు బాధపడి, మీ శరీరాన్ని బాధ పెట్టకండి!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి