పిళ్లా విశ్వనాథరెడ్డి, గజ్జల భాగ్యలక్ష్మి(ఏడోతరం3)
పిళ్లా దశరథరామిరెడ్డి, తుంగా నిర్మలాదేవి దంపతులకు పిళ్లా విశ్వనాథరెడ్డి మూడవ సంతానంగా 29.03. 1974న కడపలో జన్మించారు. అందరూ విశ్వం అని పిలిచేవారు.
ప్రాథమిక విద్యను, హైస్కూలు విద్యను కడప ఎర్రముక్క పల్లెలో ఉన్న న్యూఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో పూర్తిచేశారు. తరువాత ఇంటర్ మీడియట్ (హెచ్.ఇ.సి) చదువును ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్తిచేశారు.
తన తండ్రి తెలుగుపండితులుగా పనిచేస్తూ 1994లో మరణించడంతో కుమారుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. పెద్ద కుమారుడు లక్ష్మీ మోహన్ రెడ్డి (చిట్టీ) వద్దనడంతో విశ్వం ఆ ఉద్యోగాన్ని తీసుకున్నారు. ప్రారంభంలో రికార్డు
అసిస్టెంటుగా చేరినా తరువాత పదోన్నతి పొంది
ప్రస్తుతం సీనియర్ అసిస్టెంటుగా కడప మునిసి
పాలిటీలో పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ప్రవేశించాక మనోన్మాన్య విశ్వవిద్యాలయంలో దూరవిద్య కింద బి.కామ్ డిగ్రీని పూర్తిచేశారు.
కడపలో చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలేటిపల్లెలో వుండే గజ్జల వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మిదేవి దంపతుల ఏకైక కుమార్తె భాగ్యలక్ష్మితో విశ్వంకు 28.02.2002న కడప ఎల్.ఐ.సి. కళ్యాణ మండపంలో వివాహం జరిగింది.
19.08.1979లో జన్మించిన భాగ్యలక్ష్మి ఇంటర్ చదువును కడపలోవున్న ప్రభుత్వ బాలికలకళాశాల లోను, బి.ఎ. డిగ్రీని కడపలో వున్న ప్రభుత్వ మహిళా కళాశాలలో పూర్తిచేసినారు.
వీరికి ఇద్దరు సంతానం కలిగారు. మొదటి కుమారుడు వెంకట్రామిరెడ్డి 25.03.2006న జన్మించాడు. ప్రస్తుతం 7వ తరగతి చదువు తున్నాడు.
రెండో కుమారుడు చక్రధర్ 29.05.2008న
జన్మించాడు. ఇతను 5వ తరగతి చదువుతున్నారు.
కడపలో ఎస్.వి. డిగ్రీ కళాశాల సమీపంలో ఒక ఇల్లుకొని చక్కగా దాన్ని రీమాడల్ చేయించి సెప్టెంబరు 2017లో ఆఇంట్లోకి గృహప్రవేశం చేసినారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి