పిళ్లా శరత్ జ్యోత్స్న, దొడ్డావుల సుధీర్ రెడ్డి(ఏడో తరం 9)





         పిళ్లా విజయ కుమారస్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి దంపతుల ప్రథమ సంతానంగా పిళ్లా శరత్ జ్యోత్స్న కడపలో 12.10.1990 తేదీన జన్మించింది. తండ్రి కడపలోని యల్.ఐ.సి. డివిజనల్ ఆఫీసులో అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన పదోన్నతి పై 1991 ఏప్రిల్ లో అనంతపురం జిల్లాలోని కదిరి యల్.ఐ.సి. బ్రాంచి ఆఫీసులో చేరడంతో కుటుంబమంతా కదిరికి మారింది.
  కదిరిలో  జ్యోత్స్న మెహర్ బాబా పాఠశాలలో కొంతకాలం చదివారు. తరువాత హరీష్ స్కూలులో యల్.కె.జి. నుండి 6వ తరగతి వరకు చదివారు. 1995లో తమ్ముడు యశ్వంత్ రెడ్డి తోడయ్యాడు. జ్యోత్స్న, యశ్వంత్ లు ఇద్దరూ కలిసి సంగీతాన్ని అభ్యసించారు. కొన్ని పాటలు కూడా నేర్చుకున్నారు.
         2001లో అనంతపురంలో స్వంత ఇల్లు నిర్మించాక అక్కడికి కుటుంబం మారింది. దాంతో శరత్ జ్యోత్స్న, తమ్ముడు యశ్వంత్ లిద్దరూ శారదానగర్‌కు దగ్గరలో వున్న యల్.ఆర్.జి (లక్ష్మిరమణ గోవింద) పాఠశాలలో చేరినారు. జ్యోత్స్న 7వ తరగతిలో, యశ్వంత్ 2వ తరగతిలో చేరినారు.
         జ్యోత్స్న పదవ తరగతి చదువుతున్నప్పుడు ఉదయాన్నే ఐదుకే లేచి ట్యూషన్ కు వెళ్ళి కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్లో పాసైనారు. తరువాత ఇంటర్ లో
యం.పి.సి. తీసుకొని హైదరాబాద్ లో మియాపూర్ లోని చైతన్య కళాశాలలో ఫస్ట్ క్లాస్ లో పాసైనారు. తరువాత ఇంజనీరింగు ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్
సాధించి హైదరాబాద్ లో అబిడ్స్ లో వున్న స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ పూర్తిచేసినారు. తరువాత యం.బి.ఏ చదివేందుకు ఉత్సాహం చూపి బెంగుళూరులో వున్న ఆర్.ఎస్.ఎన్. ఐ.టి కాలేజీలో చేరి యం.బి.ఎలో మార్కెటింగ్ స్పెషలైజేషన్ చేసింది. ఆ కళాశాలలో 2014వ సం|| బెస్ట్ స్టూడెంట్ అవార్డు సాధించారు.
ఈసిఐఎల్ లో వున్న తన చిన్నమ్మ సీతమ్మ. చిన్నాన్న మల్లికార్జునరెడ్డిల ఇంట్లో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తుండగా, 2015లో హైదరాబాద్ లో వున్న డెల్టా కంపెనీలో సేల్స్ ఇంజనీరు ఉద్యోగం లభించింది.
        2017సం|| అక్టోబరు 6వ తేదీన కదిరి టిటిడి కళ్యాణ మండపంలో దొడ్డావుల సుధీర్ రెడ్డితో శరత్ జ్యోత్స్నకు వివాహం జరిగింది. సుధీర్ తల్లిదండ్రులస్వస్థలం కదిరి. తండ్రి గారి జన్మస్థలం తలుపుల మండల కేంద్రానికి దగ్గరలో వున్న ఉబ్బరవాండ్లపల్లి. తల్లిగారిది కదిరికి సమీపంలో ఉన్న కౌలేపల్లి. దొడ్డావుల సుధీర్ రెడ్డి అనంతపురంలో 11-07-1990వ తేదీన దొడ్డావుల సురేంద్రరెడ్డి, ఉషారాణి దంపతుల ద్వితీయ సంతానంగా జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా చిత్తూరులో సెంట్రల్ సిల్క్ బోర్డులో పనిచేస్తున్నప్పుడు తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసినాడు. అక్కడే 8వ తరగతి నుండి ఇంటర్ వరకు అనంతపురంలో పూర్తిచేసినారు. నంద్యాలలో బి.టెక్ కోర్సును
ఆర్.జి.యమ్ లో పూర్తిచేసినారు.  వారి తండ్రి అనంతపురంలో రాప్తాడు లోని సెంట్రల్ సిల్క్ బోర్డునందు వర్క్ ఇన్స్ పెక్టరుగా పనిచేసి ఏప్రిల్ 2020 లో పదవీవిరమణ చేశారు.
           బి.టెక్ చదువు పూర్తవగానే సియోస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.  చెన్నైలో వున్న లెనాక్స్ సంస్థలో సాఫ్ట్ వేర్ఇంజనీరుగా పనిచేశారు.తరువాత 2019 మే లో హైదరాబాద్ లోని విప్రో కంపెనీలోకి మారారు. ప్రస్తుతం హైదరాబాద్లో తమ నివాసముంటున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth