పిళ్లా లక్ష్మీ మోహన్ రెడ్డి (చిట్టీ), గోసుల సుబ్బమ్మ(ఏడోతరం1)
చిట్టీ అని ముద్దుగా పిలువబడే లక్ష్మీ మోహన్ రెడ్డికి పుట్టినప్పుడు పెట్టిన పేరు లక్ష్మీ మనోహరరెడ్డి. ఆ పేరు పాఠశాలలో చేరినప్పుడు పొరపాటున లక్ష్మీ మోహన్ రెడ్డిగా మారిపోయింది. చిట్టి 01.06.1970 తేదీన కడపలో జన్మించారు. పిళ్లా దశరథరామిరెడ్డి, నిర్మలాదేవి దంపతుల ప్రధమ సంతానం చిట్టి.
కడపలో ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల లో, హైస్కూల్ విద్య మున్సిపల్ హైస్కూలులో పూర్తి చేశారు.తరువాత మరియాపురంలో ఇంటర్ చదివారు. తదనంతరం ప్రభుత్వ ఐ.టి.ఐలో ఎలక్ట్రికల్ కోర్సును పూర్తిచేశారు.
కడపలో బంధువులైన అంకుల్ సుబ్బిరెడ్డి దగ్గర
కాంట్రాక్టరు వర్క్ లు పనిచేస్తున్నారు. ఊటుకూరులో
వున్న గోసుల వెంకటసుబ్బారెడ్డి, శామలాదేవి దంపతుల ఏకైక కుమార్తె సుబ్బమ్మను 12.09.1999లో వివాహం చేసుకున్నారు.
సుబ్బమ్మ పదవతరగతి వరకు చదివింది.
వీరిప్పుడు కడపలో వున్న యర్రముక్క పల్లెలో ఉన్న స్వంత ఇంటిలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. 18.10.2003న ప్రథమ పుత్రుడు హర్షవర్ధన్ జన్మించాడు. ఇతను ప్రస్తుతం
కడప టౌన్ లో వున్న బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో
8వతరగతి చదువుతున్నాడు. రెండవ సంతానం
కవలలు. వీరు 16.02.2008న జన్మించారు.
వీరి పేర్లు విష్ణువర్ధన్, సాయివర్ధన్. విష్ణు, సాయిలిద్దరు రాజు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి