పిళ్లా యశ్వంత్ రెడ్డి (ఏడోతరం 10)
పిళ్లా యశ్వంత్ రెడ్డి 19-04-1995న పిళ్లా విజయకుమార స్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా కడపలో జన్మించారు. యశ్వంత్ కు అతని మేనమామ రామకృష్ణారెడ్డి చోటూ అని ముద్దుపేరు పెట్టారు.
వారి తండ్రి అనంతపురం జిల్లాలోని కదిరి జీవిత బీమా సంస్థలో డెవలప్ మెంట్ ఆఫీసరుగా 1991 నుండి పనిచేస్తున్నారు.దాంతో యశ్వంత్ కుటుంబం కదిరి వాణీ వీధిలో వుండేది.ఆ వీధి చివరలో వున్న ఖాద్రీ పాఠశాలలో యల్.కె.జి. (లోయర్ కిన్నర్ గార్డెన్)తో యశ్వంత్ తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. తరువాత తన అక్క జ్యోత్స్న చదువుతున్న హరీష్ స్కూలులో యు.కె.జి. (అప్పర్ కిన్నెర్ గార్డెన్), ఒకటవ తరగతి పూర్తిచేశారు.
తన తండ్రి అనంతపురంలో సొంత ఇల్లు నిర్మించాక కుటుంబం అక్కడికి మారింది. అనంతపురంలో అప్పట్లో మంచి పేరున్న చిన్మయా నగర్ లో వున్న యల్.ఆర్.జి. పాఠశాలలో 2 నుండి 7వ తరగతి వరకు చదివారు.
"మన జీవితం మన చేతుల్లో వుంది. మనం ఎదగాలి అంటే మనం అబ్రహామ్ లింకన్ లాగా చదవాలి. గాంధీ లా వుండాలి.ఈ ముడూ గుర్తుంచు కుంటే చాలు మనం దేనినైనా సాధించవచ్చు" అని తన పుస్తకంలో యశ్వంత్ 7 వ తరగతి చదువుతున్నప్పుడే రాసుకున్నారు.దాని కనుగుణంగా తన జీవిత ప్రస్థానం సాగిస్తున్నారు.
హైదరాబాద్ లో చదవాలన్న కోరిక మేరకు ఉప్పల్ లో ఉన్న నారాయణ కాన్సెప్ట్ స్కూలులో 2008లో చేరారు. అక్కడ 8 నుండి 10వ తరగతి వరకు చదివారు. 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు.
ఇంటర్ యం.పి.సి.ని 2011లో నల్లకుంట నారాయణ జూనియర్ కళాశాలలో చదివి ప్రథమ శ్రేణి సాధించాడు. తరువాత కర్నాటక రాష్ట్రం నిర్వహించే ప్రవేశ పరీక్ష కామెడ్ కె రాశాడు. అందులో వచ్చిన ర్యాంకుతో బెంగళూరు జె.ఎస్.ఎస్ అకాడమీలో చేరినారు. 2013లో ప్రారంభమైన బి. టెక్ (మెకానికల్) చదువు 2017 జూలైలో పూర్తయింది. బిటెక్ లో అత్యధిక స్కోరు సాధించి
ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. ఈ కళాశాల విశ్వేశ్వరయ్య టెక్నాలాజికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. టెక్ మహేంద్రలో ఉద్యోగం వచ్చినా పదిమందికి ఉద్యోగాలు కల్పించే వ్యాపారం చేయాలన్న తపనతో ఆ ఉద్యోగంలో చేరలేదు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వున్న ఎ.వి.డిజైనర్స్ సంస్థ లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి