పిళ్లా దీప్తి,పాపిరెడ్డిగారి రామనాథరెడ్డి(ఏడోతరం 8)



        పిళ్లా రవీంద్రనాథరెడ్డి, అనసూయ దంపతుల ఏకైక కుమార్తె పిళ్లాదీప్తి. 1987లో పులివెందులలో అమ్మగారి స్వంతవూరు పులివెందుల దగ్గరవున్న చిన్నకుడాలలో జన్మించింది.
      ప్రాథమిక విద్యాభ్యాసమంతా కడపలో తన అన్న చదివిన 'సరస్వతి శిశుమందిర్'లో గడిచింది. ఎనిమిది నుండి పదోతరగతి వరకు మహర్షి విద్యాని కేతన్ లో చదివారు. ఇంటర్ మీడియట్ సాయిరాం కాలేజీలో చదివారు. తరువాత రాజంపేటలో వున్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ లో బి.టెక్ చేరినారు. ఆ సందర్భంలో తన తల్లిదండ్రులు కూడా రాజంపేటలో మన్నూరులో నివాసముండేవారు. ఆమె తండ్రి  ఆర్.టి.సి. కండక్టరుగా రాజంపేటలో పనిచేసేవారు.
          2008లో బి. టెక్ పూర్తయ్యాక 2009లో
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం
వెన్నపూసపల్లె గ్రామ వాస్తవ్యులైన పాపిరెడ్డిగారి పెద్దారెడ్డి, రామతులశమ్మ దంపతుల చివరి పుత్రుడు రామనాథరెడ్డిని వివాహం చేసుకున్నారు.
రామనాథరెడ్డిహైదరాబాదులో రెడ్డిల్యాబ్స్ లో పనిచేస్తున్నారు.
        దీప్తి, రామనాథంలకు 01-04-2010లో రాకేష్ రెడ్డి జన్మించాడు.రాకేష్ కడపలో తన అమ్మమ్మ దగ్గర పెరిగారు. ఒకటవ తరగతి వరకు కడప‌ లోని ఎర్రముక్కపల్లెలో వున్న బాలవికాస్ పాఠశాలలో చదివేవాడు. ప్రస్తుతం హైదరాబాదుకు వచ్చి అమ్మదగ్గరే వుండి కె.వి.యం,టాలెంట్ పాఠశాలలో 2వ తరగతిచదువుతున్నాడు.‌ఇటీవల 12-07-2017లో ఈ దంపతులకు రాకేష్ కు తోడుగా మరో కొడుకు జన్మించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth