పిళ్లా పద్మరాధిక, చందమూరి నరసింహారెడ్డి(ఏడోతరం2)
పిళ్లా పద్మరాధిక 1972సం||లో సెప్టెంబరు 9న పిళ్లా దశరథరామిరెడ్డి, పిళ్లా నిర్మలాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా కడపలో జన్మించింది. పద్మరాధికను చిన్నక్క అనే ముద్దు పేరుతో పిలిచేవారు. ఇది ఆమె అబ్బ (నాన్నకు నాన్న) పిళ్లా లక్ష్మిరెడ్డి, తనతల్లిగారి పేరు మీద పెట్టిన ముద్దు పేరు. కుటుంబ సభ్యులంతా చిన్నక్క అని ముద్దుగా పిలిచేవారు.
చిన్నక్క ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల లో, హైస్కూల్ విద్యను కడపలో వున్న గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ లో పూర్తి చేసినారు. 1987లో పదవ తరగతి పూర్తయ్యాక ఇంటర్ మీడియట్ ను స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో చదివారు. 1989లో ఇంటర్ పూర్తవగానే పాలిటెక్నిక్ కళాశాలలో డి.ఫార్మసీ కోర్సులో చేరారు. ఇదిమూడు సంవత్సర కోర్సు. 1992లో ఫార్మసీ డిప్లొమా పొందినారు. తరువాత నాగరాజు పేటలోని డిగ్రీ కళాశాలలో బిఏ చదువుతుండగా ఆమెకు పెద్దలు వివాహం చేశారు.
అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం
సిద్దరాంపురం గ్రామానికి చెందిన చందమూరి
నరసిరెడ్డి, లక్ష్మినారాయణమ్మ దంపతులకు ఐదవ
సంతానమైన చందమూరి నరసింహారెడ్డితో పద్మరాధిక వివాహం 1996 డిసెంబరు 26న సిద్దారాంపురం గ్రామంలో జరిగింది.కదిరిలో యల్.ఐ.సి.లో పనిచేస్తున్న చిన్నక్క (పద్మరాధిక) చిన్నాన్న కుమారస్వామి రెడ్డి ఈ సంబంధాన్ని చూసి వారికి వివాహం జరగడానికి దోహద పడినారు.
వీరికి 1997లో ఒక కూతురు జన్మించి పురిట్లోనే మరణించింది. తరువాత 2000లో మే 3వ తేదీన ఉదయం 7గం||లకు ఒక కుమారుడు జన్మించారు. అతనికి నచికేత్ అని పేరు పెట్టారు. నచికేతరెడ్డి ప్రస్తుతం వేలూరు ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ కోర్సును చదువుతున్నారు.
చందమూరి నరసింహారెడ్డి సిద్దరాంపురంలో 08-09-1968న జన్మించారు.
హైస్కూలు విద్యవరకు సిద్దారాంపురంలో వున్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశారు. ఇంటర్‌ను పెనుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోచదివారు. అనంతపురంలో వున్న యస్.యస్. బి.ఎన్ కాలేజీలో బిఎస్సీ పూర్తి
చేసినారు.
డిగ్రీ పూర్తయ్యాక ఈనాడు దినపత్రికకు బుక్కపట్నంలో విలేకరిగా పనిచేస్తూ ఆర్టీసి కాంప్లెక్స్ లో ఫ్యాన్సీ స్టోర్ కూడ నడిపేవారు. రెండేళ్ళ తరువాత తన చిన్నాన్న కొడుకుకు అప్పచెప్పి ఎరువుల దుకాణం ప్రారంభించారు.
1996లో ఈనాడు యాజమాన్యం ఆదేశాల మేరకు తన వ్యాపారాన్ని ఎత్తివేసి కదిరి డివిజన్ లో పని చేయడానికి కదిరికి వచ్చారు. 1997లో సిద్ధరాంపురం గ్రామంలో ప్రబలిన విష జ్వరాలతో మరణాలు సంభవిం చినపుడు, ఆ విషయాలను సమగ్ర కథనంగా ఈనాడులో వార్త రాసినారు. ఆ వార్తలను గుర్తించిన ప్రభుత్వం, నరసింహారెడ్డిని ఉత్తమ గ్రామీణ విలేకరిగా గుర్తించి, ఆయనకు
కాసా సుబ్బారావు అవార్డును ప్రకటించింది. ఆ అవార్డుతో పాటు రూ. 25,000/- నగదును బహుమతిగా కూడా ఇచ్చారు.కదిరి సిటీకేబుల్ లో కొంతకాలం విలేకరిగా పనిచేసినారు. 1999లో
కదిరి యం.ఎల్.ఏ. పార్థసారధి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా (పి.ఏ) పనిచేశారు.ఐదేళ్ళ తరువాత కాంట్రాక్టు పనులు చేపట్టారు. ఇందులోనిలదొక్కుకొని 2009లో యస్.వి. కన్స్ట్రక్షన్ సంస్థను మిత్రులతో కలిసి స్థాపించారు. కదిరిలో చక్కని ఇంటిని నిర్మించుకొని స్థిరపడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి