వివాహ సంబంధాలు- నేటి పోకడలు


వివాహ సంబంధాలు- నేటి పోకడలు
  _____నండూరి పద్మాంజలి

ఈ మధ్యకాలంలో మధ్య తరగతి వర్గాలలో చాలా మంది యువతీ యువకులకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ మధ్య వి. పట్టాభిరామ్ గారు ఆయన యూట్యూబ్ ఛానెల్లో పిల్లలు పెద్దవాళ్లని భయపెట్టే స్థాయికి వెళ్ళారు' అని 'అది వారికి చాలా నష్టం చేస్తుంది' అని ఆవేదన చెందారు. అది ఈ విషయంలో విజమే అనిపిస్తుంది. ఇవుడు ఏ పిల్లలకీ పెద్దలు చెప్పిన సంబంధాలు నచ్చడం లేదు. (ఇక్కడ ప్రేమించి చేసుకున్న వారిని మినహాయిస్తే ,ఇక నాస్తికులు, హేతువాదుల కుటుంబాలకు వధూపదులు దొరకడం ఒక ఎండమావి లాంటిదే) ఒకప్పుడు దాదావు 2000 సంవత్సరం వరకు రాజా ఫలాన వాళ్ల అబ్బాయి మంచివాడు, ఫలాన వాళ్ళమ్మాయి చాలా మంచిపిల్ల' అని చెప్పగానే సంబంధాలు కుదుర్చుకునే వారు, కానీ ఇవుడు కొన్ని వందల మాట్రిమోని సంస్థలు వచ్చినా యువతీ యువకులకు రోజుకు వందో, రెండొందలో ప్రొఫైల్స్ చూసినా నచ్చడం లేదు. ఒకప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు లేటైతే ఆ తల్లిదండ్రులను చుట్టుపక్కల వాళ్ళు 'పాపం పిల్లల పెళ్ళిళ్ళు సంభంధాల కోసం వాళ్ళు ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం' అని జాలిపడే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్లైన్ మాట్రిమోనీ సంస్థల వలన హాయిగా వళ్ళు అలిసిపోకుండా రెండో కంటికి తెలియ కుండా  కంప్యూటర్ లోనే వందలు సంబంధాలు చూసుకుని నచ్చిందా, నచ్చలేదా అని చూసుకుంటున్నారు. ఇక్కడ విచారమేమంటే అంత సౌకర్యం ఉన్నా కూడా యువతి యువకులకు ఒకరి కొకరు  ఒకపట్టాన నచ్చడం లేదు. ఎందుకంటే మగపిల్లాడు 'అందమైన అమ్మాయి, మంచి ఉద్యోగం గల అమ్మాయి కావాలి' అనుకుంటే, ఆ అమ్మాయి ఇంతకన్నా పైవారి కోసం సెర్చ్ చేస్తోంది. ఒకప్పుడు ఏవో చాదస్తవు కుటుంబాలలోనే ఏమైనా జాతరాల వ్యామోహం వుండేదేమో, ఇపుడు టి.వి. ఛానళ్ళ పుణ్యమా అని ఆ జాడ్యం అన్ని కులాల వారికి పాకింది. ఆది మానవుని కాలం నుండీ అవే గ్రహాలు అని పాపం ఈ మానవులకు ఎప్పటికీ అర్ధం
అవుతుందో. సాక్షాత్తు శ్రీదేవి అంత అంద గత్తెని తెచ్చినా, పోనీ బంగారు తల్లిలా సలక్షణాల పిల్లని ముందు పెట్టినా కూడా 'అబ్బే జాతకాలు కుదర లేదండీ' అని జరగబోయే మహత్తర సృష్టి రహస్యం మాకే తెలుసు అన్నట్లు చెబుతారు, దీని వలన పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం కావడానికి అదో పెద్ద కారణం అవుతున్నది.

అలాగే కొందరు పిల్లలు వాళ్ళ కోరికలకు తగ్గట్టు చూస్తుంటే, పెద్దవాళ్ళు వియ్యాల వారి హోదా చూస్తున్నారు. ఆడపిల్లలు ఆరంకెల జీతాలున్న పిల్ల గాడిని చూస్తున్నారు. మగపిల్లలు విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్ అయితే బాగుండు అను కుంటున్నారు. ఒకవేళ ఎవరైనా సర్లే ఎవరోకరు అని అనుకున్నా ప్రక్కనే మరో హై ప్రొఫైల్లో హైఫైగా కనపడగానే కుంగి పోయి 'మరికొన్నాళ్ళు చూద్దాం. మనకి మాత్రం ఏమి తక్కువ అని ఎదురుచూస్తూ కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య పోలీసు అధికారులు ఈ మాట్రిమోని సంస్థల గురించి మొత్తు కుంటున్నారు. ఏమని అంటే 'ఈ అత్యాశా పరుల ఆశలు గమనించి మోసకారులైన అబ్బాయిలు తాము పెద్ద ఆఫీసర్లు అని ఆస్తిపరులమని చెప్పి అమ్మాయిలను, వారి కుటుంబాలను బురిడీ కొట్టిస్తున్నా రని, ఎవరైనా అబ్బాయికానీ అమ్మాయి కానీ తనంతట తానే మాట్రిమోనిలో తన ప్రొఫైల్ అప్లోడ్ చేస్తే దాన్ని కాస్త అనుమానించ వలసినదే. జాగ్రత్తగా విచారించుకోవాలి' అని వారు సూచిస్తున్నారు. అలాగే గైనకాలజిస్టులు వివాహం లేటైతే ఆడపిల్లలకు కాన్పులు కష్టం అవుతాయని హెచ్చ రస్తున్నారు. పిల్లలు చేతికి రాకుండానే, రోగలబారిన పడే అవకాశం ఉంది' అని పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఎవరికైనా పెళ్లి కుదిరితే ఇద్దరూ మాట్లాడుకుంటున్నారా' అని ఆసక్తిగా మనమంతా అడుగుతాము. అపుడు వారు 'అవును' అంటే 'ఇప్పుడు అంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు
ఇందులో ఏమి వింత ఉంది అంటాము. 'లేదు' అంటే 'ఏమిటి తేడాగా ఉందే అంటాము. కానీ వీళ్ళు పెళ్ళికి ముందు గంటలు గంటలు మాట్లాడుకున్నా తరువాత విడాకులు దాకా వచ్చిన వాళ్ళు బోలెడు మంది. అంటే వీరు పనికొచ్చే మాటలు కాకుండా ఏదో అనవసరమైనవి మాట్లాడుకున్నారని మనకి ఇట్టే అర్ధం అవుతుంది. మరో రకం పిల్లలు ఉంటారు. మేమే కాబోయే వాళ్ళతో మాట్లాడుకుంటామని చెవుతారు. వాళ్ళకి ఆ వయసులో ఉండే సరదా అలవాట్లు, మాటలు అవే శాశ్వతం అనుకుని గుదిగుచ్చేసి వాటినే ఒకరిముందు ఒకరు ఉంచుకుని ఒకరి కొకరు అవి నచ్చలేదు అనుకుంటే 'చత్ నాకు వద్దు అనేస్తున్నారు. వీళ్ళు కార్ల్ మార్క్స్ ' మార్పు అనివార్యం' అనే సిద్దాంతం తెలియని వాళ్ళు. అదే వెనకట్లో అయితే కుర్ర కారుకి ఒకటి అరా అవ లక్షాణాలు వుంటే పెళ్లిళ్లు చేస్తే మారతారని పెళ్లిళ్లు చేసేవారు. ఎక్కడో ఒకరో ఇద్దరో దరిద్రులు మారకుండ ఉండి ఉండవచ్చేమో కానీ చాలా మంది తమ అలవాట్లను మార్చుకుని కుటుంబం చక్కగా నడుపుకున్నారు. ఆ దంపతులే సరదాగా కూచోని 'నేను పెళ్లికాక ముందు ఎలా ఉండే వాడిని అని అతను అంటే నాకు మాత్రం ఏమి తక్కువ, నేను మా పుట్టింట్లో కాలు మీద కాలు వేసుకు కూచుంటే అన్ని మా అమ్మా నాన్న నా చేతికి తీసుకువచ్చి అందించేవారు. నేను రోడ్డు మీద వెళు తుంటే నాకు లైను వేయనివాడు లేదు అని, నేను అలా చక్కగా కాపురం చేసుకుంటానో లేదో అని మావాళ్ళు అనుకుంటుండేవారు' అని ఆవిడ పుట్టింటి మురిపాలు చెప్పు కుని ఇద్దరూ హాయిగా నవ్వుకుంటారు. అలాగే ఇపుడు పిల్లలు చాలామంది వెనకటికాలం వాళ్ళులాగా వయను రాగానే పెళ్లి పెరంటాలు అనకుండా కెరీర్ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్లు అయినా కూడా ఈ కెరీర్ గోలలో పడి నూతన దంపతుల మధ్య ఉండాల్సిన శృంగారం కరువవుతున్నది. అసలు
విషయం పక్కకు పోయి ఏవో కారణాలుచూపించి విడాకుల వరకూ వెళుతున్నారు. అందుకే శృంగార వైద్య నిపుణులు డాక్టర్ సమరం 'ఏ భార్యాభర్తల బంధమైన బలపడాలంటే అది వారిద్దరి మధ్య ఉన్న శృంగార వాంఛాస్థాయి మీదనే ఆధారపడి ఉంటుంది' అని అంటారు.కానీ ఈ యువతీ యువకులకు పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలనే యావతప్ప కుటుంబ విలువలు అర్ధం కావడం లేదు. ఇలాంటి వాళ్ళు వివాహం ముందు ఊహా లోకాలలో తేలి పోయి పెళ్లి కాగానే భ్రమలు వదిలి పోవడం సాధారణ. ఇన్ని తియ్యని కష్టాలలో ఈ నూతన దంపతుల జీవితాలు కొనసాగుతుండగా, వివాహ సంబంధాలు చూసేటప్పుడు పది కోర్కెలు పెట్టుకుని కాల యాపన చేయకుండా పెద్దవాళ్ళు, పెళ్లి కావలసిన వాళ్ళు 'తమకు ఏమి కావాలో,



ఎలాంటివాళ్ళు కావాలో ' అని ఒక క్లారిటీకి వస్తేనే పెళ్లిళ్లు కుదురుతాయి. మన క్లారిటీ వెంట మనం వెళ్ళాలి కానీ, రంగుల మాయా మాట్రిమోనీల ఆకర్షణలోపడి వాటి వెంట మనం పరుగులు తీయ కూడదు. ఒక క్లారిటీ లేకుండా ఇలా పరుగులు తీసిన వాళ్ళే తరువాత అంతరాలు వచ్చి కుటుంబాల మధ్య గొడవలకు కారణమై మనశ్శాంతి కోల్పోతున్నారు. అందుకే ఇప్పుడు పిల్లలు కూడా పట్టాభిరాం గారు అన్నట్లు తల్లిదండ్రులను మీకు తెలియదులే' అని తీసి పారెయ్యకుండా వాళ్ళకి రాబోయే వధువు, వరుడు ఎలా ఉండాలను కుంటున్నారో మనసువిప్పి తల్లి దండ్రులకు, అవ్వాతాతలకు లేదా మేనమామ, చిన్నాన్నాలతో ,
పెద్దలతో వారి ఆలోచనలు పంచుకుంటే అందులోని సాధక బాధకాలు గురించి ఈ పెద్దవాళ్ళు ఒక వివరణ ఇస్తారు. అపుడు పిల్లలకి కూడా వాళ్ళకి తగ్గ పర్ఫెక్ట్స్ మ్యాచ్ ఏదో ఒక నిర్ణయానికి తేలికగా రాగలుగుతారు. లేదంటే ఊహలవెంట. భ్రమల వెంట వెళితే జీవితంలో ఓ మధుర ఘట్టమైన వివాహం' లో 'మధురం' పోయి కేవలం 'వివాహ ఘట్టమే' మిగులుతుంది.మనమేమిటో, మన స్థాయి ఏమిటో, మన కుటుంబం ఏమిటో, మన విలువలే మిటో అనే వాటి పట్ల మనకి ఖచ్చితమైన  క్లారిటీ ఉంటే మన పిల్లల 'పెళ్లి' చేయాలనుకోగానే సంబంధాలు కుదిరి మన ముంగిట్లో పెళ్లి భాజాలు మోగుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth