పురుషాధిపత్యం
పురుషాధిపత్యం
పురుషాధిపత్యం డిసీజ్ కాదు..అదొక డిజార్డర్ మాత్రమే.అందరిలో వున్నట్లే పురుషుల్లో కుడా కాస్తంత ఇగో వుంటుంది..ఇది ఈనాటిది కాదు. తరతరానుంచి వస్తున్న ఈ ఇగోను తృప్తి పరుచుకోడానికి పురుషులు నానా తంటాలుపడుతుంటారు. పురుషాధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పెంపకంలో బాలబాలికల మధ్య వివక్ష చూపిస్తుంటారు. ఇలా మగాడు గొప్ప అన్న భావాన్ని బాల్యం నుంచే నాటి, పాదుచేసి, పెంచడంవల్ల పురుషాధిపత్యభావనను ప్రోత్సహిస్తున్నాం..అది సరైంది కాదు..ఈలోపాన్ని సరిచేయగలిగితే, పురుషాధిపత్య భావనను దూరంచేసి,స్త్రీ పురుషులిద్దరూ సమానమేనన్న భావనను నెలకొల్పడం పెద్ద కష్టమేం కాదు.
"పురుషాధిపత్యం డిసీజ్ కాదు..
అదొక డిజార్డర్ మాత్రమే…
క్రమబద్దీకరణతో
ఆలోచనా న్యాయంతో
డిజార్డ ర్ కి ఆర్డర్ కి మధ్య
సరళ రేఖల బతుకుల్ని నేర్పాలి.
పురుషాహంకారం పెంపక లోపమే కాని
పుట్టుకతో వచ్చిన హక్కు కాదు
వంకరగీతల అల్లికలో వున్న
పాతవాచకాలన్నీ పునర్మించాలిక తప్పదు
పలుపుతాడుతో పశువును అధీనం చేసుకున్నట్లు
పసుపుతాడుతో మనిషిని అధీనం చేసుకోవాలనుకోవడం
కుడితి నీళ్ళకీ ,కొట్టపు బతుకులకీ
చట్రపు కంచెలకీ ,వేకువ తప్పదిక
అసమనీతికి నిదర్శనమిది
అమానుషత్వానికి బలివేదిక ఇది
భూతద్దాల దృష్టి నుంచి మరలి
పగిలిన అద్దాల బతుకు నుంచి
కొత్త అద్దాలతో సమదృష్టిని అలవర్చుకోవాలి
సహ.. ప్రేమికులయి
సహ జీవికలయి
సహజంగా నడవాలే గాని
సమాన బరువును మోయాలేగాని
ఎలపట దాపట గిత్తల్లా కాదు
సమాజపు బండి అప్పుడు తిరగబడక తప్పదు
విరిగి తునాతునకలయిన బండితో
ఏ వ్యవసాయదారులూ
బతుకు సేద్యం చేయలేరు."
శిలాలోలిత..స్త్రీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి