అమృత వాక్కులు
అమృత వాక్కులు
1. తెలివికి నిదర్శనం తప్పులు వెదకడం కాదు.
పరిష్కారాలు సూచించగలగడం.
2. శాంతము లేని వారు సౌఖ్యాలను, తృప్తి లేని
వారు సుఖాలను పొంద లేరు.
3. మన పాత ఆలోచనలు పోవాలంటే, మన నైతిక
మేధోస్థాయిల్లో విద్యావంతులం కావాలి.
4.మంచి సమయం కొరకు ఎదురు చూడకండి.
దొరికిన సమయాన్ని మంచిగా మార్చుకుని
సద్వినియోగం చేసుకోండి.
5. పనిలో అనుభవించే ఆనందం, జీవితాన్ని
ఆనందమయం చేస్తుంది.
6. ఇతరుల కష్టాల్లో దయ చూపించు, నీ కష్టాల్లో
ధైర్యం చూపించు.
7. అంతరంగ పరివర్తన సరి చేసుకుంటే మానవుడు
తనను తాను విమోచనం పొందగలడు.
8.You probably don't listen as effectively as you think you do and you probably don't know it
_ Mark Twain
9.నీ జీవితంలో వెలుగు రావాలంటే వెలుగు వచ్చేచోట నువ్వు వుండాలి. లేదంటే... నువ్వే వెలుగును సృష్టించాలి.
10. ప్రతి వాడు చెడును వేలెత్తి చూపగలడు. కానీ, అందులోనుంచి బయట పడే మార్గం సూచించ గలిగిన వాడే సమాజానికి ఆప్తుడు.
11. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే తత్వం ఉండాలి. విమర్శలను ఎదుర్కొనే సాహసం ఉండాలి.
12. మనకున్న ఆత్మ విశ్వాసమే అన్నింటిని ఎదుర్కొనే శక్తినిస్తుంది, తోడు గెలుపును తెస్తుంది. ప్రశంసలు కురిపిస్తుంది.
విమర్శ ఎదుటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వారు మీ ఆత్మ విశ్వాసౌన్ని దెబ్బకొట్టే ప్రయత్నం తప్పక చేస్తారు. జాగ్రత్త. విమర్శించకపోతే ఎదుటివారి హృదయాలు గాయపడవు, వారు మీ గురించి అనుకూలంగా ఆలోచిస్తారు. అది మీకు మంచిని కలుగజేస్తుంది.
13.మీకు యిష్టం లేనిది - ఇష్టం లేదు' అని సష్గంగా చెప్పండి.
మీ యిష్టాయిష్టాలు, వ్యక్తిత్వం గురించి ఇతరులకు స్పష్టంగా తలుస్తుండది.
మీతో ఎలా మసులుకోవాలో వారికి అర్థం అవుతుంది.
మీ అంతరంగం మీకు స్పష్టంగా తెలుస్తుంది.
14.మీరు ఎలాంటి పని ఎంచుకోవాలో
- ఎలాంటి లక్ష్యం ఏర్పరచుకుంటే మీకు విజయం లభిస్తుందో మీకు తెలిసిపోతుంది.
15.మీకంటే పెద్ద స్థాయిలో వున్నవాళ్ళపై ఎంత గౌరవం అభిమానం చూపుతారో -
చిన్న స్థాయిలో వున్న వాళ్ళపై కూడా అంతే గౌరవం అభిమానం చూపండి.
అందర్నిసమంగా చూడడం వల్ల మీరు ఎవరి ప్రలోభాలకు లొంగని వ్యక్తిగా
మారుతారు.
చిన్నస్థాయిలో వున్న వారిపై మీరు చూపే అభిమానానికి రెట్టింపు అభిమానం వారు మీ పట్ల కనపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది.
16. అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి
మీ పరిశీలనాశక్తి పెరుగుతుంది.
మీ చుట్టూ జరిగే విషయాల్లోని అంతరార్ధం మీరు తెల్సుకోగలుగుతారు.
ఎదుటివారు చెప్పేది చక్కగా వినగల్గ్లుతారు. వారికి మీపై అభిమానం పెరుగుతుంది.
అత్యుద్భుతమైన పక్షాగ్రత మీ సొంతమవుతుంది.
17.పరస్పర గౌరవం, ప్రేమ, సంతోషం, ఆప్యాయత, అనురాగాలకు వివాహ వ్యవస్థే మూలం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి