quotation

"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".
        __ apple ceo steeve jobs

ఉద్వేగ భరిత క్షణాల్లో మనం ఏ నిర్ణయం తీసుకోకుండా మౌనంగా వుంటే ఏ నష్టమూ జరగదు. అలా కాకుండా హడావుడిగా స్పందించి ఒక నిర్ణయం తీసుకొంటే, దానివల్ల కలిగే తక్షణ ఫలితాలవల్ల బాధ పడాల్సి వస్తుంది. తర్వాత తీసుకునే నిర్ణయాల క్రమంలో మనం తప్పుదోవ పట్టే అవకాశమూ వుంది.
----- Dan Ariley, American Professor of Psychology and Behaviour

సత్యం కోసం తపనపడే వాడే నిజమైన తాత్వికుడు__ప్లేటో


తాగుడు జూదం లాంటి వ్యసనాలకు బానిసైన వ్యక్తి కి ఉన్మాదంతోడయితే ఎలా ఉంటుందో నియంత మనస్తత్వం అలా ఉంటుంది _ప్లేటో

మానవుడు స్వతహాగా రాజకీయ జంతువు __ అరిస్టాటిల్

You probably don't listen as effectively as you think you do and you probably don't know it
_ Mark Twain

1. తెలివికి నిదర్శనం తప్పులు వెదకడం కాదు. పరిష్కారాలు సూచించగలగడం.
2. శాంతము లేని వారు సౌఖ్యాన్ని తృప్తి లేని వారు సుఖాన్ని పొంద లేరు.
3. మన పాత ఆలోచనలు పోవాలంటే, మన నైతిక మేధోస్థాయిల్లో విద్యావంతులం కావాలి.
4.మంచి సమయం కొరకు ఎదురు చూడకండి, దొరికిన సమయాన్ని మంచిగా మార్చుకుని సద్వినియోగం చేసుకోండి.
5. పనిలో అనుభవించే ఆనందం, జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
6. ఇతరుల కష్టాల్లో దయ చూపించు, నీ కష్టాల్లో ధైర్యం చూపించు.
7. అంతరంగ పరివర్తన సరి చేసుకుంటే మానవుడు తనను తాను విమోచనం పొందగలడు.





1. గమ్యం ముందుంటే అలుపు రాదు. నిరంతర శ్రమయే ఇంధనం.
2. అంతరంగం అందంగా ఉంటే, ఆచరణ అర్థవంతంగా ఉంటుంది.

4. ఎవరికి అప్పగించిన పనిని వారు సక్రమంగా చేస్తే అదే ప్రగతి.

6. తామే గొప్పవారమని చెప్పుకునే వారివల్ల సమాజానికి చేటు.
7. గొప్పవారు కావడానికి ప్రయత్నించాలి కానీ, ఇతరులు పతనం కాకుండా చూడాలి.
8. కాలాన్ని గంభీరంగా వాడుకోగలిగినప్పుడు ఈశ్వరుడే మనకు మిత్రుడౌతాడు.

1.మీ కాలం బాగున్నప్పుడు మీ తప్పులు జోక్స్ లా కనబడుతాయి, బాగా లేనప్పుడు చక్కటి జోకులు కూడా తప్పుల్లానే కనబడుతాయి.
2.ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు, ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు.
3.నీ నడవడికనే నీకు సంపద తెస్తుంది.
4.కాకులతో తిరిగితే పావురం రూపు మారక పోవచ్చు కానీ, బుద్ది మారుతుంది.

7.ఆత్మ నిబ్బరం మనోధైర్యం దేన్నైనా ఎదుర్కొంటుంది.

8.బంగారం నీ ఒంటికి మెరుపు నిస్తుంది - సంస్కారం నీ జీవితానికి విలువనిస్తుంది.

9.మాటలనేవి పైనుండి జారిపడే గుడ్లవంటివి. అవి కింద పడి దుర్గంధాన్ని వెదజల్లాక, దాన్ని భరించడం తప్ప, వాటిని మీరు యథా రూపంలోకి తీసుకరాలేరు

2.చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడ గలగాలి. పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి.

3.సుత్తితోని దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాల్సిందే. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్దించదు. ఎడ తెగని ప్రయత్నం చేయాలి.

4.కోపం ఉన్నప్పుడు బదులు చెప్పక పోవడమే శ్రేయస్కరం.

5.ఆజ్ఞను పాటించని వాడు .... ఎప్పటికీ ఎవ్వరినీ ఆజ్ఞాపించలేడు.

6.మేధావులు మాట్లాడుతారు. మూర్ఖులు వాదిస్తారు.

7.అందు బాటులో ఉన్నవాటిని నేర్పుగా ఉపయోగించుకోవాలి.

9.ఫలితాల మీద మాత్రమే దృష్టి పెడితే, నీలో ఎప్పుడూ 'మార్పు' రాదు. మార్పు మీద దృష్టి పెడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి.

2.అక్కర లేనిది అనుభవిస్తున్నా బాధే, అవసరమైనది అనుభవించక పోయినా బాధే.

3.పగ తీర్చుకోవడం చేతకాని తనం, క్షమించండం ధీరత్వం.

4.నీ అసూయ ఇతరులకు ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ, నిన్ను నిలువున దహిస్తుంది.

5.అబద్ధానికి వేగమెక్కువ - నిజానికి ఓపిక మరీ ఎక్కువ.

6.ప్రతిభ ఉంటె సరిపోదు, దాన్ని సరైన సమయంలో వాడుకునే విచక్షణా జ్ఞానం ఉండాలి.

7.శరీరానికి వ్యాయామం ఎలాంటిదో, మనసుకు చదువు అలాంటిదే.

8.వివేక వంతులకు ఓటమి ఓ వేడుకలాంటిది.

9.సుఖం, దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుడి వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరాల్సిందే.

అసంభవమైన గొప్ప వాగ్దానం  కంటే చిన్న చిన్న మంచి పనులు మెరుగైనవి!! - మెకాలే!

విజయం మరియు బద్ధక రైలుపట్టాలు లాంటివే.ఎప్పటికీ కలవవు.ఒకదానితో చెలిమి చేస్తేరెండో దానితో వైరంపూనాల్సిందే.

అమాంతంగాకుబేరుడు కావాలని అడ్డమైన పనులు చేయొద్దు.

విద్యను దాచుకోవద్దు, పది మందికి పంచితే ఆది మరింత రాణిస్తుంది.

3.పిల్లల్ని మనం ఎంత బాగా ప్రేమిస్తున్నామని కాదు. జీవితాన్ని ప్రేమించడానికి వాళ్ళకు మనం ఏంచేస్తున్నామన్నదే ముఖ్యం.

4.స్నేహితుడి విలువ అవసరంలో తెలుస్తుంది.

5.సత్యం , శాంతి, దయ, దానం ధర్మాన్ని కున్న  నాలుగు పాదాలు.

6.ఓటమి బాధతో కన్నీరు పెట్టకు, కర్తవ్యం మసక బారుతుంది.

7.అందరిలోను మంచిని చూడటం నేర్చు కుంటే నీలో అది పెరుగుతుంది.

8.మనసా వాచా ఉండాల్సిన నాల్గక్షరాలు 'చిరునవ్వు'.

9.ఓరిమితో సాధన చేస్తే సాధించ లేనిది ఏమీ ఉండదు. ఒక్క రోజులో ఫలితం రావాలంటే కుదరదు.

 ఆత్మ జ్ఞానం గురించి ముందు వినాలి. ఆ తరువాత దాని గురించి ఆలోచించాలి. ఆ తరువాతే దాని గురించి ధ్యానించిలి. అప్పుడే మంచి ఫలితం.

మన ఆరోగ్యనారోగ్యాలు మన ఆలోచనాసరళిపైనే ఆధారపడి వుంటుంది. ప్రశాంతమైన మనసు శుద్ధమైన ఆలోచనలు ఆరోగ్యానికి పెట్టుబడులు. నిష్కల్మష నవ్వు ప్రేమలే ఆరోగ్య కారకములు.

ఒక మనిషి జీవిత కాలాన్ని నిర్వచించేది అతని భాషణే __ఫ్రాన్సిస్ బేకన్

1.కదిలే కాలం మనిషికి ముసలి తనం తేగలదేమో కానీ, మనసుకు తీసుకు రాలేదు.

2.ఎప్పుడూ ఉల్లాసంగా ఉండటమే అసలైన జ్ఞానానికి గుర్తు.

3.ధనం దుర్భుద్ధులకు మదం కలిగిస్తుంది.

4.క్షమాగుణం మనిషికి ఆభరణం.

5.మనిషిలోని మంచి గుణాలే సుఖాలకు సోపానాలు.

6.యాచకత్వానికి మూలం బధ్ధకత్వం.

7.నిరంతరం నేర్చుకునే వారె ఇతరులకు నేర్పగలరు.

8.ఆజ్ఞను పాటించని వాడు .... ఎప్పటికీ ఎవ్వరినీ ఆజ్ఞాపించలేడు

చెయ్యలేమని గొప్ప పనులను, చెయ్యాలని లేదని చిన్న పనులను వదిలేస్తే, ఏమి చెయ్యలేని చేతగాని వాళ్ళుగా మిగిలి పోతాం

2.సోమరి పోతులకు తీరిక ఉండదు.

3.అలవాటును అదుపు చేయకపోతే అదే అవసరమై తీరుతుంది - కష్టాల పాల్జేస్తుంది.

4.రూపాయి దానం చేయడం కన్న ముందు, రూపాయి సంపాదించడం ఎలాగో నేర్పించండి.

5.ప్రతి పనిలోను ఆచరణాత్మకను కనబరుచు. ఆచరణ కొరవడిన సిద్ధాంతాల వల్లే పతనం మొద‌లవుతుంది. ధైర్యంతో నీ కర్తవ్యాన్ని నిర్వహించు, ఓర్పుతో పని చెయ్యి.

6.ఉత్తమ పౌరులు, బలవంతులు గుణవంతులు సద్గుణ సంపన్నులు కావాలంటే పుస్తక పఠనం దిన చర్యలో భాగం కావాలి.

7.ప్రలోభాలకు లోబడకు పాపాలు మూట కట్టుకోకు.

2.శ్రద్ధ కలగడం వల్ల, అతి స్వల్ప క్రియలో సైతం మహత్తర విలక్షణ భావాలు ప్రకటిత మౌతాయి.

3.నిరంతరం శ్రమించే వాడికి ఏ బాధలు ఉండవు.

4.ఆశను మనం వదులుకుంటాం తప్ప ఆశ ఎప్పుడూ మనల్ని వదలి పోదు.

5.మిమ్మల్ని మీరు ప్రగాఢంగా విశ్వసించండి. ప్రగతికి అడ్డొచ్చే ఎలాంటి సాకులను దరిజేరనీయకండి.


7.కబుర్లకు కడుపు నిండదు - కష్ట పడితేనే కడుపు నిండేది.

8.ముఖ స్తుతి చేసే వాడు ఎన్ను పోటు కూడా పొడవగలడు - జాగ్రత్త 

2.మంచి పుస్తకాల పఠనం అలవాటు ఉన్న వారు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఆనందంగా ఉంటారు

3.లక్ష్యాన్ని సాధించాలంటే పట్టుదల ఏకాగ్రత అవసరం.

5.ఇంటింటా ధ్యానం ప్రపంచమంతా జ్ఞానం.

6.మనిషి విజ్ఞతకు మించిన మిత్రుడు లేడు.

7.నిరాశావాదీ ప్రతి దాంట్లోను కీడునే చూస్తాడు.

8."అతిథి దేవో భవః" అది మన సంస్కారానికి ప్రతీక

నేను అనే ఇరుకు ప్రపంచం నుంచి మనం అనే విశాలమైన ప్రపంచంలో కి వచ్చిచూడు. అందమైన జీవితం కనబడుతుంది.

చాలా మంది కాలాన్ని ఏలా గడపాలో ఆలోచిస్తూ ఉంటారు .
ప్రావీణ్యం కలవారు ⏲కాలాన్ని ఏలా ఉపయోగించు కోవాలో ప్రయత్నిస్తారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth