కొన్ని అలవాట్లనైనా మార్చుకునేందుకు ప్రయత్నం చేసే నిర్ణయం తీసుకోండి.
ఈ ఏడాది కొన్నైనా డిసైడ్ అవండి.
- రోడ్డు మీదుగా వెళ్తూ వెళ్తూ ఏ సిగరెట్టో, బీడీయో, కిళ్ళీయో, ఖైనీయో, గుట్కానో నోట్లో వేసుకునే పురుషులారా... వాటిని చించాక ఆ పాకెట్లను జాగ్రత్తగా చెత్త తొట్లకే చేర్చడం.
అలాగే వాటిని నమిలాక రోడ్లమీద ఉమ్మకుండా ఉండటం.
- బహిరంగ మూత్ర విసర్జన చేయకపోవడం.
- టూ వీలర్, ఫోర్ వీలర్స్ నడిపేవారు సేఫ్ డ్రైవింగ్ కు అలవాటు పడటం.
- బయటి నుంచి ఇంటికి వచ్చాక చెప్పులను వాటి వాటి స్థానాల్లో ఉంచడం.
- స్నానాలు చేసాక టవల్స్ ను గాలి తగిలే చోట్లలో ఆరవేయడం.
- ఇంటిలోనైనా, మరే చోటైనా ఎక్కడ నుంచి ఒక వస్తువు తీస్తారో దాని స్థానం మారకుండా అక్కడే పెట్టడం.
- మీ అలవాట్లు మీ పిల్లలు కూడా గమనిస్తారని గుర్తుంచుకోండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి